Young Tiger NTR Birthday Today: ప్యాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుండే ఎన్టీఆర్‌కు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ తర్వాత తన స్టోరీ సెలక్షన్, తన యాక్టింగ్... ఇవన్నీ తనకు మరికొంత ఫ్యాన్ బేస్‌ను తెచ్చిపెట్టింది. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి ప్యాన్ ఇండియా మూవీలో నటించిన తర్వాత దేశవ్యాప్తంగా ఎన్టీఆర్ నటనకు ఫ్యాన్స్ అయ్యారు. దీంతో ఎన్టీఆర్ పుట్టినరోజును ఫ్యాన్స్ అంతా పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఎన్టీఆర్‌కు బర్త్‌డే విషెస్ చెప్తూ ట్వీట్స్ చేశారు.
భీముడి కోసం రాముడి ట్వీట్!
రామ్ చరణ్, ఎన్‌టీఆర్ కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి రాజమౌళి దర్శకత్వంతో పాటు ఎన్టీఆర్, చరణ్‌ల పోటాపోటీ యాక్టింగ్ కూడా కారణమయ్యింది. ఇక ఎన్టీఆర్‌ను తన ప్రాణ స్నేహితుడిగా భావించే రామ్ చరణ్... ‘ఆర్ఆర్ఆర్’లోని ఒక స్పెషల్ ఫోటోను పోస్ట్ చేసి బర్త్‌డే విషెస్ తెలిపారు.
మహేశ్ అన్న విష్ చేశాడు...
‘హ్యాపీ బర్త్‌డే తారక్. ఈ ఏడాది మొత్తం నీకు సంతోషం, సక్సెస్‌తో నిండిపోవాలని కోరుకుంటున్నాను’ అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశారు.
బావ బన్నీ కూడా ట్వీట్ చేశాడు
ఆన్ స్క్రీన్ కలిసి నటించకపోయినా.. ఆఫ్ స్క్రీన్ అల్లు అర్జున్, ఎన్టీఆర్‌కు మంచి బాండింగ్ ఉంది. ఒకరినొకరు బావ అని పిలుచుకుంటూ ఉంటారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్‌గా ట్వీట్ చేశాడు బన్నీ. ‘మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బావ’ అంటూ ఎన్టీఆర్‌కు విషెస్ తెలిపాడు.
పవన్ కల్యాణ్ ప్రశంసలు...
ఏ హీరో పుట్టినరోజు అయినా తన తరపున, తన పార్టీ తరపున విష్ చేయడానికి ముందుకొస్తారు పవన్ కళ్యాణ్. అలాగే ఎన్టీఆర్‌కు కూడా బర్త్‌డే విషెస్ చెప్తూ స్పెషల్ ప్రకటన విడుదల చేశారు. ‘ఆర్ఆర్ఆర్ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో సినీ ప్రియుల మెప్పు పొందారు. తనదైన నృత్యంతో ప్రేక్షకుల అభిమానాన్ని దక్కించుకున్నారు’ అంటూ ఎన్‌టీఆర్‌ను ప్రశంసిస్తూ బర్త్‌డే విషెస్ తెలిపారు పవన్ కళ్యాణ్.
అందరికీ థ్యాంక్స్..
‘నా ప్రయాణంలో మొదటిరోజు నుండి మీరు చూపిస్తున్న సపోర్ట్‌కు చాలా థ్యాంక్స్. నాకు విషెస్ తెలిపిన అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్’ అంటూ ఎన్‌టీఆర్ ట్వీట్ చేశాడు.
Also Read: 'దేవర'కు ముందు ఓ లెక్క, ఇప్పుడో లెక్క - బాక్సాఫీస్ రికార్డులను తొక్కుకుంటూ పోవాలే!