Lok Sabha Elections Polling Sixth Phase: లోక్‌సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్‌లో సినీ,రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరూ విధిగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ సీనియర్ నటుడు పరేశ్ రావల్‌ ముంబయిలో ఓటు వేశారు. ఆ తరవాత మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు అత్యంత కీలకమైనవని, వాటి ప్రాధాన్యతను తెలుసుకోవాలని సూచించారు. ఇదే సమయంలో ఓటు వేసేందుకు ఆసక్తి చూపించని వారికి చురకలు అంటించారు. అలాంటి వారిని అలా ఊరికే వదిలేయకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఓటు వేయని వారి నుంచి ఎక్కువ ట్యాక్స్‌ వసూలు చేయాలని, లేదంటే మరింకేదైనా శిక్ష విధించాలని తేల్చి చెప్పారు. అలా అయితేనే అందరూ ఈ బాధ్యతను తెలుసుకుంటారని స్పష్టం చేశారు. ఓటు వేయని వారికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉండదని అన్నారు. ఏ పని జరగకపోయినా అందుకు ఓటు వేయని వారే బాధ్యత వహించాల్సి వస్తుందని, ప్రభుత్వాన్ని నిందించే అధికారం కోల్పోతారని వెల్లడించారు. 


"ప్రభుత్వం అది చేయలేదు ఇది చేయలేదని చాలా మంది కంప్లెయింట్స్ ఇస్తుంటారు. ఇవాళ మీరు ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఆ పనులు చేయకపోవడానికి మీరే బాధ్యులవుతారు. అప్పుడు ప్రభుత్వాన్ని నిందించే అధికారం ఉండదు. ఓటు వేయని వాళ్లపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఆ మేరకు కొత్త నిబంధనలు విధించాలి. ఓటు వేయని వారి నుంచి ట్యాక్స్‌ను భారీగా వసూలు చేయాలి. లేదా ఇంకేదైనా శిక్ష విధించాలి"


- పరేశ్ రావల్, సినీ నటుడు 






పరేశ్ రావల్‌తో పాటు మరి కొందరు బాలీవుడ్ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీళ్లలో అక్షయ్ కపూర్, షాహిద్ కపూర్, రాజ్‌కుమార్ రావ్, జాహ్నవీ కపూర్ ఉన్నారు. 






మరో బాలీవుడ్ నటుడు శర్మన్ జోషి కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేయడం దేశ అభివృద్ధికి ఎంతో కీలకమని, అందరూ కచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకుంటారని ఆశిస్తున్నానని వెల్లడించారు. గాయకుడు శంకర్ మహదేవన్ కుటుంబంతో సహా వచ్చి ఓటు వేశారు.






Also Read: Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడి చివరి క్షణాలు, చాపర్ క్రాష్ అయ్యే ముందు వీడియో వైరల్