Karthika Deepam 2 Serial Today Episode : కార్తీక్ శౌర్యని పెద్ద స్కూల్‌లో చేర్పించడంతో కోప్పడ్డ దీప ఫీజు తానే కడతాను అంటుంది. ఇక తన చేతిలో ఉన్న 1900 కార్తీక్‌కు ఇచ్చి మిగతా డబ్బు ఎంతో చెప్తే ఇచ్చేస్తా అంటుంది. కార్తీక్ 80 వేలు అని చెప్పడంతో షాక్ అయిపోతుంది. అంత డబ్బు కట్టలేను అని శౌర్యని మామూలు స్కూల్‌లోనే చేర్పిస్తా అంటుంది..


ఇక కార్తీక్ నీవల్ల అవుతుంది అని తన వెంట రమ్మని దీప ఉన్న ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ ఓ స్టీల్ బాక్స్ తీసి అందులో కొంత డబ్బు వేసి 80 వేలు అయిన తర్వాత తనకు ఇవ్వమని సలహా ఇస్తాడు.  


దీప: ఇలా అయితే ఇది ఎప్పటికి నిండాలి. 80 వేలు ఎప్పటికి ఇవ్వాలి. 


కార్తీక్: అది మీ ఇష్టం ఎందుకంటే ఇది మీ కూతురు కోసం మీరు చేస్తున్న యుద్ధం కదా. ఎన్నాళ్లలో పూర్తి చేస్తారో ఎన్నాళ్లలో పూర్తి చేయగలరో మీరే చెప్పండి. కంగారు ఏం లేదు దీప మీరు ఎంత టైం అయినా తీసుకోండి. స్కూల్‌ కోసం నేను కట్టిన డబ్బు మీరు నా దగ్గర తీసుకున్న అప్పు అనుకుందాం. అనుకోవడం కాదు అదే నిజం. ఇప్పుడు చెప్పండి ఎన్ని రోజుల్లో అప్పు తీర్చుతారు.   


దీప: ఓ ఆరు నెలల్లో తీర్చుతాను బాబు. ఎలాగోలా కష్టపడి ఆరు నెలల్లో తీర్చుతా.


కార్తీక్: బాగా ఆలోచించుకోండి. ఆరు నెలల్లో తీర్చలేకపోతే. 


దీప: తీర్చుతాను బాబు.


కార్తీక్: తీర్చలేకపోతే ఏం చేస్తానో తెలుసా. నేను ఇంక ఆ డబ్బు తీసుకోను. మీ మీద మీకు నమ్మకం ఉంటే ఈ పందానికి ఒప్పుకోండి లేదంటే లేదు. 


దీప: తీర్చేస్తాను బాబు. 


కార్తీక్: ఫస్ట్ ఇన్‌స్టాల్ మెంట్ కింద ఈ వేయి రూపాయలు వేస్తున్నా. ఇప్పుడు మీ కూతుర్ని మీరే చదివించుకుంటున్నారు. ఎవరైనా తప్పుగా మాట్లాడితే చెంప పగలగొట్టండి. 


పారిజాతం: దీప, కార్తీక్‌ల మాటలు వింటూ.. వీడు నన్ను దృష్టిలో పెట్టుకొనే అంటున్నాడు. 


కార్తీక్: మీరు నన్ను ఎంత ద్వేషిస్తున్నారో నాకు తెలుసు. ఇక మిమల్ని క్షమించమని కూడా నేను అడగను. ఎందుకంటే దాని కోసమే ఇదంతా చేస్తున్నా అని నువ్వు అనుకుంటావ్. కానీ ఏదో ఒక రోజు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావ్ అని చిన్న ఆశ అయితే ఉంది. మీరు నన్ను ఎప్పటికీ క్షమించకపోయినా నేను మాత్రం మీ శ్రేయాభిలాషినే. 


నర్సింహ ఫ్రెండ్, స్కూల్‌ ప్యూన్ నర్సింహ దగ్గరకు వచ్చి ఆ పాప తండ్రి ఆ డబ్బున్నోడే అని చెప్తాడు. నర్సింహ ఆడు కాదురా వేరే ఉన్నాడు అని నీకు చెప్పాను కదా అంటాడు.  కార్తీక్ ఆ పాపకు తండ్రి అని తన పేరు రాసి సంతకం పెట్టాడని చెప్తాడు. సరిగ్గా చూశావా అని నర్సింహ అడిగితే ఫొటో తీశాను అని ఫొటో చూపిస్తాడు. ఇక ఆ ప్యూన్ ఈ పాప ఆ డబ్బున్నోడికే పుట్టుండాలి అని అంటాడు. దాంతో నర్సింహ కోపంతో ప్యూన్ కాలర్ పట్టుకుంటాడు. వెళ్లి దీపనే అడుగుతాను అని అనుకుంటాడు.


ఇక శౌర్యకి దీప అన్నం తినిపిస్తుంది. శౌర్య కార్తీక్‌ని పొగుడుతుంటుంది. ఇక కొత్త స్కూల్‌కి రేపటి నుంచి  వెళ్తానని అమ్మమ్మ కారులో పంపిస్తాను అంది అని చెప్తుంది. దీంతో దీప కారులో వెళ్లొద్దని చెప్తుంది. ఆటోలో తీసుకెళ్లి దింపుతాను అని అంటుంది. ఇక త్వరలో సైకిల్ కొంటానని అంటుంది. 


ఉదయం దీప హోటల్‌లో టిఫెన్స్ రెడీ చేస్తూ ఉంటుంది. ఉప్మా వల్ల టిఫెన్స్‌కి గిరాకీ పెరిగిందని కడియం దీపని పొగిడేస్తాడు. ఇంతలో నర్సింహ అక్కడికి వస్తాడు. తానే దీప మొగుడని కడియంతో చెప్తాడు. ఇక దీప కడియంతో ఇక్కడ ఏం జరిగినా కాసేపు మధ్యలో మాట్లాడొద్దని చెప్తుంది.  


దీప: చూడు నర్సింహ ప్రతీ సారి నేను అరవలేను. బాగా విసిగిపోయాను. నీకు మాకు ఏ సంబంధం లేదు అని మీ ఇంటి దగ్గరే చెప్పారు. మిమల్ని నేను ఏమైనా అడిగానా. నాకు ఇంతే రాసి పెట్టిందని సరిపెట్టుకున్నాను. నా కూతురిని చదివించడానికి మేం బతకడానికి ఓ పని వెతుక్కున్నాను. నెల జీతానికి పని చేస్తున్నాను. ఇంటి దగ్గరకు వచ్చి ఎలాగూ అందరిలో ఛీ అనిపించావ్. ఇక్కడ అయినా నా పని నన్ను చేసుకోనివ్వు. 


నర్సింహ: చేసుకో దీప. నీ చుట్టూ తిరగడానికి నాకు ఏం పని లేదు అనుకున్నావా కానీ నువ్వు చేసే పనులు ఉన్నాయే అవే నన్ను ఏ పనీ చేసుకోనివ్వడం లేదు. రాత్రే నీ సంగతి తేల్చుదామని మీ ఇంటికి వచ్చాను. ఎవరో పెద్దాయన బయట తిరుగుతున్నారు. పొద్దున్న చూసుకుందామని వెనక్కి వచ్చా. ఇప్పుడు మీ ఇంటికే వచ్చా కానీ ఇక్కడ నిన్ను చూసి ఆగా. ఇప్పుడు నా అనుమానం తీర్చుకోవడానికి వచ్చాను. నిజం చెప్పు మనం ఓపెన్‌గా మాట్లాడుకుందాం. పాపకి తండ్రి నేనా ఆ కార్తీక్‌ గాడా. వాడే అని నాకు తెలుసులే నీ నోటితో వినాలి అని అడిగా.


దీప: ఆరోజు నీ కూతలకు చెప్పు తీశాను. ఇప్పుడు చెప్పు తెగేలా కొడతాను. పోరా ఇక్కడి నుంచి.


నర్సింహ: ఇది తప్పుడు మాట కాదు. నా దగ్గర సాక్ష్యం ఉంది. పాపని స్కూల్ దగ్గర చేర్పించింది ఎవరే ఆ కార్తీక్‌ గాడే కదా. నువ్వు మాటలతో వినవే చూడు పాప తండ్రి స్థానంలో వాడి పేరు రాశాడు. సంతకం కూడా పెట్టాడు. అంటే తండ్రి వాడే అని ఒప్పుకున్నట్లే కదా. వాడు రాయమన్నాడా నువ్వే రాయమన్నావా. కావాలంటే నాతో స్కూల్‌కి రా అక్కడ నిరూపిస్తా నా పేరు ఉండాల్సిన ప్లేస్‌లో వాడి పేరు లేకపోతే నీ చెప్పుతో నన్ను కొట్టు. ఉంటే నా చెప్పుతో నిన్ను కొట్టనా. ఏంటి దీప మాట పడిపోయిందా. 


దీప: నువ్వు చెప్పింది ఎంత నిజమో నాకు తెలీదు. ఒకవేళ అదే నిజం అయితే ఆ మనిషికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. అయినా నాతో నా కూతురితో నీకు ఏ సంబంధం లేనప్పుడు నీతో నాటకాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. ఆ పేరు సంగతి నేను చూసుకుంటా నువ్వు వెళ్లు. 


నర్సింహ : ఏంటి నాకు సంబంధం లేదా. కూతురి విషయంలో నాకు సంబంధం లేదు అంటావ్ అంతేనా. అయితే నాతో నీకు సంబంధం లేదు అంటావ్ అంతే కదా. అయితే నేను కట్టిన తాళి నీకు ఎందుకే నా తాళి నాకు ఇచ్చేయ్. ఏంటి అలా చూస్తున్నావ్ నేను కట్టిన తాళి నీ మెడలో ఉంది అంటే సంబంధం ఉన్నట్లే. నీతో సంబంధం నాకు వద్దే నా తాళి నాకు ఇచ్చేయ్. నీకు తీసివ్వడానికి ఇబ్బంది అయితే కట్టిన నా చేతితోనే నేనే తీసుకుంటానే. 


నర్సింహ దీప మెడలో తాళి లాగడానికి ప్రయత్నిస్తాడు. నేను తాళి ఇవ్వనూ అంటూ దీప అడ్డుకుంటుంది. కడియం కూడా అడ్డుకుంటే నర్సింహ కడియాన్ని తోసేస్తాడు. ఇక దీప నర్సింహను తోసేసి కడియం, దీప ఇద్దరూ రెండు పాత్రలు నర్సింహ మీదకు ఎత్తుతారు. ఇక కార్తీక్ కూడా ఈ గొడవ చూస్తూ ఉంటాడు. వీడి అంతు చూడాలి అనుకుంటాడు. దీపనే ఇక నర్సింహను పంపేస్తుంది. వాడు వెళ్లిపోగానే దీప కుప్పకూలి ఏడుస్తుంది. ఇక కార్తీక్ విష్ణు అనే వ్యక్తికి కాల్ చేసి నర్సింహకు బుద్ధి చెప్పాలి అని అంటాడు. ఇక రాత్రి ఇంటికి వచ్చి దీప ఏడుస్తుంది. ఆ గొడవలో దీప మెడమీద తగిలిన గాయానికి శౌర్య మందు పెడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్ : రేపే తిలోత్తమకు మృత్యువు.. సర్ప దీవిలో తిలోత్తమను చంపేది గాయత్రీ పాపేనా! నయని అడ్డుకుంటుందా!