బుల్లితెరపై 'జబర్దస్త్' షోకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ షో చూస్తుంటారు. ఎన్ని వివాదాలు ఎదురైనా.. ఇప్పటికీ నెంబర్ వన్ కామెడీ షోగా దూసుకుపోతుంది 'జబర్దస్త్'. ఈ షోని మొదలుపెట్టి దాదాపు తొమ్మిది సంవత్సరాలు అవుతోంది. అత్యధిక టీఆర్ఫీతో దూసుకుపోతుంది. దీంతో ఈ షోని కాపీ చేస్తూ చాలా కామెడీ షోలు వచ్చాయి. కానీ 'జబర్దస్త్' ముందు ఏదీ నిలవలేకపోయింది. కానీ ఈ మధ్యకాలంలో 'జబర్దస్త్' రేటింగ్స్ తగ్గుతున్నాయి. రొటీన్ స్కిట్ లతో ప్రేక్షకులను విసిగిస్తున్నారు. ఒకట్రెండు టీమ్స్ మినహా.. మిగిలిన వాళ్ల స్కిట్ లను చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడడం లేదు.
యూట్యూబ్ లో ఎపిసోడ్స్ ను బిట్స్ బిట్స్ గా టెలికాస్ట్ చేస్తుండడంతో.. తమకు నచ్చిన స్కిట్ లను చూసుకుంటున్నారు ఆడియన్స్. దీంతో సరైన రేటింగ్స్ రావడం లేదు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ షో నుంచి ముగ్గురు స్టార్ కమెడియన్స్ బయటకు వెళ్లిపోయినట్లు సమాచారం. ఇప్పటికే ధనరాజ్, చమ్మక్ చంద్ర లాంటి కమెడియన్స్ 'జబర్దస్త్'కి దూరమయ్యారు. ఇప్పుడు మరో ముగ్గురు కూడా షోని వదిలేస్తున్నారట.
వారెవరంటే.. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను. హైపర్ ఆది చాలా రోజులుగా 'జబర్దస్త్' షోలో కనిపించడం లేదు. ఆది షోని వదిలేసినట్లు కొందరు కంటెస్టెంట్స్ చెబుతున్నారు. అలానే ఆటో రామ్ ప్రసాద్.. ఇటీవల ఓ స్కిట్ లో తనే ఇకపై టీమ్ లీడర్ అని.. తన స్నేహితులు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను ఇకపై షోలో కనిపించరని క్లారిటీ ఇచ్చారు. అయితే సుధీర్, గెటప్ శ్రీను ఇద్దరూ కూడా ఈటీవీలో ప్రసారమవుతోన్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో కనిపిస్తున్నారు. కానీ 'జబర్దస్త్'కి దూరమయ్యారు.
ఈ ముగ్గురు కమెడియన్స్ చాలా ఏళ్లుగా స్కిట్ లు చేస్తున్నారు. ఇప్పటికీ తమ పెర్ఫార్మన్స్ తో నవ్విస్తున్నారు. అలాంటిది వీరు ముగ్గురు ఈ షోకి దూరమైతే అది షోపై ప్రభావం చూపడం ఖాయం. ఇదివరకు అంటే.. వీరందరికీ 'జబర్దస్త్' షో ఒక్కటే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కొక్కరి చేతిలో రెండు, మూడు షోలు ఉన్నాయి. ఇక సుడిగాలి సుధీర్ అయితే హీరోగా సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇప్పటికే తను నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రీసెంట్ గా మరో సినిమాను మొదలుపెట్టాడు.
Also Read: మహేష్ బాబుని బూతు తిట్టడానికి కీర్తి పడ్డ కష్టాలు!
Also Read: బాలయ్య కథను లీక్ చేసిన దర్శకుడు - ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇదే