Trinayani September 18th Written Update: నయనిని పక్కకు తీసుకుని వచ్చిన విశాల్, విక్రాంత్ ఏమైనా పాపను దాచుంటాడా అని నయనీ ని అడుగుతాడు.


నయని: విక్రాంత్ బాబు కోపగ్రస్తుడే కానీ ఏనాడు పాపపైన అది చూపడు. పాపకి ఏ సమస్య వచ్చినా నాకు సూచనలు వస్తాయి నాకు ఏమీ రాలేదు అంటే పాప క్షేమంగానే ఉన్నాదని అర్థం.


విశాల్: పాప క్షేమంగా ఉంటే చాలు. నేను ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేస్తాను.


నయని: వద్దు బాబు గారు ఆస్తి విషయంలో నేను ఒక ఆలోచనకి వచ్చాను. ఇప్పుడు ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేస్తే అది తప్పుదారి పడుతుంది. మనం స్వామీజీని తీసుకుని వద్దాం అంజరం వేసి పాప ఎక్కడుందో చెప్తారు. అని అంటుంది నయని.


ఆ తర్వాత సీన్లో సుమన తన గదిలో కూర్చుని ఏడుస్తూ ఉండగా వెనకనుంచి తిలోత్తమ, వల్లభలు అక్కడికి వస్తారు. సుమన వినాలని గది బయట నుంచే గట్టిగా మాట్లాడుతుంటారు.


వల్లభ: మమ్మీ ఇప్పుడు వెళ్లి ఓదార్చడం అవసరం అంటావా అసలుకే సుమన బాధలో ఉంది.


తిలోత్తమ: అవునురా మనం కాకపోతే దానికి ఎవరున్నారు చెప్పు. చూడు ఒక్కతే ఎలా ఏడుస్తుందో అని సుమన దగ్గరికి వెళ్తారు ఇద్దరూ.


వల్లభ: అయినా మమ్మీ నాకు ఒక డౌట్ వచ్చింది సుమనకి ఆస్తి రావాలి అని చాలా కలలు కన్నది కదా అప్పుడు విశాల్ ముసలివాడిగా అయినందుకు ఆస్తి రావడం డిలే అయింది. మళ్ళీ విశాల్ తిరిగి మామూలు స్థితికి వచ్చినప్పుడు ఆస్తి ఇచ్చేయొచ్చు కదా ఈ మంచి రోజులు ముహూర్తాలు అని నయని ఎందుకు లేట్ చేసిందంటావు?


తిలోత్తమ: నాకేం తెలుసురా బహుశా ఇదంతా కావాలనే చేసి ఉండొచ్చు


సుమన: ఏంటి అత్తయ్య మీరు అంటుంది?


తిలోత్తమ: నయనీ కి ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు పెద్ద పాప తప్పిపోయింది. రెండవ పాప గానవిని నీ దగ్గర ఉంచాడు విక్రాంత్. 4 నెలల పాటు కూతురు లేని బాధని నయని అనుభవించింది. నీకు కూడా అదే బాధ రావాలి అని ఇదంతా చేస్తుంది అని మా అనుమానం


సుమన: మీరు చెప్తుంటే నాకు ఇప్పుడే అర్థమవుతుంది అత్తయ్య. నాకు తెలిసి అక్క ఇదంతా కావాలనే చేసింది నేను సుఖపడడం తనకి ఎప్పుడూ నచ్చదు. రోజుకి మూడు పట్టు చీరలైన కట్టి మ్యాచింగ్ జువెలరీ వేయలనుకున్నాను. ఐదు కోట్లు పెట్టి కార్ నీ అమెరికా నుంచి తెచ్చుకోవాలనుకున్నాను.


వల్లభ: ఇవన్నీ జరగాలంటే ఆస్తి రావాలి కదా ఆస్తి రావాలంటే పాప ఉండాలి కదా.


సుమన: ఆస్తి వస్తుంది ఈ రోజు సాయంత్రం ఆరులోపుగా పాప ఇంటికి రాకపోతే మా అక్క సంగతేంటో తేలుస్తాను.


తిలోత్తమ: నువ్వు ఇదే పట్టుదలతో ఉండు. అని చెప్పి వల్లభతో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తిలోత్తమా.


తర్వాత సాయంత్రం అవుతున్న కొద్ది కుటుంబ సభ్యులందరూ హాల్లో చేరుతారు. హాసిని కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది.


దురంధర: సాయంత్రం ఆరు అయ్యింది పాప ఇంకా తిరిగి ఇంటికి రాలేదు సుమ్మీ వచ్చిందంటే గొడవ చేస్తుంది.


హాసిని: మరి పాప జాడ దొరకలేనట్టేనా అని అనగా అప్పుడే వచ్చిన తిలోత్తమా దొరికితే ఈ పాటికి ఇంట్లో ఉంటుంది కదా. అదిగో సుమన కూడా కిందికి వస్తుంది అని అంటుంది. అప్పుడే సుమన పరిగెత్తుకుంటూ పైనుంచి కిందకి వస్తుంది.


దురంధర: అది కాదు సుమ్మీ ఇంత పెద్ద నగరంలో ఒక కుక్క పిల్ల తప్పిపోయినా రెండు రోజులు పడుతుంది వెతకడానికి. అదే చిన్న కూన అందులోని అమ్మాయి కనీసం వారమైన పడుతుంది కదా?


సుమన: నాకు తెలుసు మీరు ఏవేవో సాకులు చెప్పి వాయిదా వేసేద్దాం అనుకుంటున్నారు. నేను ఎవరిని వదిలిపెట్టను నా పాప నాకు ఇప్పుడే కావాలి.


విశాల్: అదిగో స్వామీజీ వచ్చారు అని అనగా అప్పుడే స్వామీజీ అక్కడికి వస్తారు. అందరూ స్వామీజీకి నమస్కారం పెట్టగా సుఖీభవ అని స్వామీజీ దీవిస్తారు.


విశాల్: పాప కనబడడం లేదంటే సుఖీభవ అని దీవిస్తారేంటి స్వామి?


స్వామీజీ: పాప క్షేమంగానే ఉన్నది


సుమన: క్షేమంగా ఉండడం కాదు పాప ఎక్కడున్నదో ఎవరి దగ్గర ఉన్నాదో నాకు తెలియాలి వాళ్ళ అంతు తేలుస్తాను.


స్వామీజీ: సంధ్య వేళ అవుతుంది వెళ్లి సాయంకాలపు దీపం వెలిగించు సుమన. పాప తనంతట తానే ఇక్కడికి వస్తుంది. అని అనగా దురంధర వెంటనే వెళ్లి దీపపు ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు పాప ఎలా వస్తుంది అని తిలోత్తమ మనసులో నవ్వుకుంటుంది.


హాసిని: ఇంతకు పాపని ఎవరు తీసి ఉంటారు స్వామి. అని అనగా స్వామీజీ తిలోత్తమ వల్లభల వైపు చూసి చిరునవ్వు నవ్వుతాడు.


హాసిని: మీరు అలా చూస్తుంటే ఈ దొంగ మొఖాల్లే తీసినట్టున్నారు. మీరు నిజం చెప్పండి స్వామీ వీళ్లంతు నేను తెలుస్తాను.


స్వామీజీ: పాపను తీసుకుని వెళ్ళింది పెద్దబొట్టమ్మ. పాప  క్షేమంగానే ఉన్నది అని అంటారు.


దాని ముందు రోజు రాత్రి వల్లభ పాపని వ్యాన్ లో పెట్టగా పెద్దబొట్టమ్మ  అక్కడికి దగ్గరికి వెళ్లి తలుపు తీస్తుంది. లోపల పాము రూపంలో ఉన్న పాప ఉంటుంది. నేను నిన్ను కాపాడడానికే వచ్చానమ్మా నాతో రా మీ నాన్న దగ్గరికి తీసుకుని వెళ్తాను అని అంటుంది పెద్ద బొట్టమ్మ. అప్పుడు పాము పైనుంచి నేల మీదకి వస్తుంది. అప్పుడు పెద్ద బొట్టమ్మ కూడా పాము రూపంలో మారగా వాళ్ళిద్దరూ అక్కడ్నుంచి వెళ్లిపోవడానినీ మనకి చూపిస్తారు.


హాసిని: పెద్ద బొట్టమ్మ పాపని ఎలా తీసుకుని వెళ్తాది స్వామీజీ? శాపగ్రస్తురాలు అయిన తర్వాత నయని, చిట్టికి తప్ప ఇంకెవరికి కనిపించదు కదా కనిపించినా పాము రూపంలోనే మాకు కనిపిస్తుంది ఇది సాధ్యమేనా


సుమన: మా అక్కని తప్పించడానికి స్వామీజీ అబద్ధం ఆడుతున్నారు.


దురంధర: నువ్వు స్వామీజీ మీద అరకు ముందు దీపం వెలిగించు. అని అనగా సుమన దీపం వెలిగిస్తుంది.


స్వామీజీ: చీకటి అయింది కనుక పెద్ద బొట్టమ్మ కు పాపను తేవడం సుసాధ్యమే అవుతుంది. అని అనగా ఇంటి లోపలికి ఒక పాము వస్తుంది.


హాసిని: పెద్ద బొట్టమ్మ వచ్చినట్టుంది


నయని: కాదు ఇది నాగయ్య అని అనగా వెనకనుంచి ఇంకొక పాము కూడా అక్కడికి వస్తుంది. దాని తర్వాత ఒక చిన్ని పాము అక్కడికి వస్తుంది.


స్వామీజీ: సుమన జన్మనిచ్చింది ఆ చిన్ని పాముకే. అని అనగా ఒకేసారి కుటుంబ సభ్యులందరూ భయభ్రాంతానికి గురవుతారు.


సుమన: మీరేం మాట్లాడుతున్నారు? నేను జన్మనిచ్చింది అమ్మాయికి దాన్ని అందరం ఎత్తుకున్నాము, చాలామంది ముద్దులాడారు కూడా. నిన్న రాత్రి నా పాప తప్పిపోయింది ఇప్పుడు పెద్ద బొట్టమ్మ తీసింది అని చెప్పి ఒక పామును తెచ్చి నా పాప అంటే నమ్మడానికి నేనేమైనా అమాయకురాల్లా కనిపిస్తున్నానా?


స్వామీజీ: నేను ఇప్పుడు పెద్ద బొట్టమ్మ అందరికీ కనిపించేలా విబూధి జల్లుతాను అని పెద్ద బొట్టమ్మ మీద విభూతి జల్లుతారు స్వామీజీ. అప్పుడు పెద్ద బొట్టమ్మ పాము రూపం నుంచి మనిషి రూపంలోకి వస్తుంది.


హాసిని:  పెద్ద బొట్టమ్మ చాలా రోజులైంది చూసి ఎలా ఉన్నావు అని దగ్గరికి వెళ్తుండగా దురంధర ఆపుతుంది


దురంధర: అదేమైనా మనిషి అనుకున్నావేంటే దగ్గరికి వెళ్తున్నావు, పాము. అని అనగా భయపడిన హాసిని మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది.


నయని: ఏంటి పెద్దమ్మ పాపని నువ్వు తీయడమేంటి?


పెద్ద బొట్టమ్మ: నేనేం చేశాను నయని?


విక్రాంత్: నువ్వు పాపని తీసుకుని వెళ్ళడం వల్ల పాపం సుమన నయని వదిన మీద నిందలు వేసింది.


విశాల్: నీ మీద కూడా వేసింది కదా విక్రాంత్.


Join Us On Telegram: https://t.me/abpdesamofficial