Trinayani August 26th: తను పిలిస్తే నాగయ్య ఎందుకు రాలేదు అని నయని అయోమయంలో ఉండటంతో.. వెంటనే హాసిని.. పిలిచింది నువ్వు కానీ, విశాల్ కానీ కాదు కదా.. ఆ సుమన పిలిచింది కదా అందుకే రాలేదేమో అని అంటుంది. దాంతో అంతేనంటావా అని నయని అనటంతో కచ్చితంగా అంతే అని అనటంతో కాస్త నయని కూల్ అవుతుంది. ఇక టెన్షన్ పడాల్సిన విషయం మరొకటి ఉందని.. రేపే సుమన డెలివరీ అని హాసిని అనటంతో ఏం జరగబోతుందో అని నయని కంగారు పడుతుంది.


ఇక మరుసటి రోజు ఉదయాన్నే సుమన తన గదిలో కూర్చొని ఫోన్ లో టైం పాస్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తిలోత్తమా చేతిలో రెండు ప్యాకెట్లు పట్టుకొని సుమన గది బయట నిలబడుతుంది. అప్పుడే వల్లభ పాలు తీసుకుని రావడంతో ఆ పాలలో ఒక ప్యాకెట్ పౌడర్ వేసి కలుపుతుంది. ఇక మధ్యలో వల్లభ మాట్లాడే మాటలకు చిరాకు పడుతూ ఉంటుంది తిలోత్తమా. ఇక ఇంకో ప్యాకెట్ కూడా వేయమని వల్లభ అనడంతో అది సుమన కు కాదు విశాల్ కని అంటుంది.


ఈ పాలు తాగితే సుమన అరుస్తుంది అని.. ఆ పౌడర్ కలిపిన పాలు తాగితే విశాల్ సైలెంట్ అవుతాడు అని అనటంతో విశాల్ కు ఏదో ముప్పు తెచ్చే ప్రయత్నంలో ఉందని అర్థమవుతుంది. ఇక మొదట తిలోత్తమా సుమన గదిలోకి వెళ్లి తనను మాటల్లో పడేస్తుంది. వల్లభ కూడా లోపలికి వచ్చి కబుర్లు చెబుతూ ఉంటాడు. ఇక తిలోత్తమా పాలు తాగమని ప్రేమ చూపిస్తున్నట్లు నటించి తనతో పాలు తాగిస్తుంది.


ఇక ఆ తల్లి కొడుకులిద్దరూ అక్కడ నుంచి మెల్లిగా జారుకుంటారు. మరోవైపు తన చెల్లికి డెలివరీ బాగా జరగాలి అని నయని దేవుడికి దీపం పెడుతుంది. అప్పుడే అక్కడికి తిలోత్తమా, వల్లభ వచ్చి ఏం చేస్తున్నారు అని అడగటంతో సుమన డెలివరీ బాగా జరగాలి అని దురంధర అంటుంది. ఇక నయని సుమనను హాస్పిటల్ కు తీసుకెళ్దాం అని అంటుంది. అప్పుడే తిలోత్తమా సుమన చెప్పినట్లే ఈరోజు డెలివరీ జరిగితే బాగుంటుంది.


కానీ తొందరపడి హాస్పిటల్ కి తీసుకెళ్తే డబ్బులు ఎక్కువ ఖర్చవుతాయి కదా అని అంటుంది. దాంతో దురంధర అయితే ఖర్చు ఎక్కువ అవుతుందేమో కానీ హాస్పిటల్ కి తీసుకెళ్లాలి అని మాట్లాడుతుంది. అదే సమయంలో పైన ఉన్న సుమనకు పురిటి నొప్పులు వస్తాయి. గట్టిగా అరవడంతో అందరూ పైకి పరిగెత్తుతారు. తనకు పురిటి నొప్పులు వస్తున్నాయని గమనించి హాస్పిటల్ కి తీసుకెళ్లాలని అనుకుంటారు.


కానీ సుమన మాత్రం తను ఇంట్లోనే డెలివరీ అవుతాను అని నొప్పులతో బాధపడుతూ చెబుతుంది. ఇక భార్యను అలా చూసి విక్రాంత్ తట్టుకోలేక పోతాడు. మరోవైపు పెద్ద బొట్టమ్మ పాము రూపంలో సుమనకు డెలివరీ చేయడానికి వస్తుంది. సుమన హాస్పిటల్ కి వద్దనటంతో తిలోత్తమా ఈ వీధిలో ఎవరైనా డెలివరీ చేసే పెద్ద వాళ్ళు ఉంటే తీసుకొస్తాను అని వల్లభతో కిందికి వెళ్తుంది.


అప్పుడే పెద్ద బొట్టమ్మ అక్కడికి వచ్చి వచ్చాను నయని అనడంతో నయని తనని చూసి షాక్ అవుతుంది. ఇక తను.. విశాలాక్షి చెప్పింది కదా అందుకే వచ్చాను అంటుంది. దాంతో నయనికి గతంలో విశాలక్షి మాట్లాడే మాటలు గుర్తుకు రావడంతో తనే సుమనకు డెలివరి చేయడానికి వచ్చిందని తెలుసుకొని సుమన దగ్గరికి తీసుకెళ్తుంది.


సుమన పెద్ద బొట్టమని చూసి తనకు డెలివరీ చేయమని వేడుకుంటుంది. ఇక నొప్పితో బాగా కొట్టుమిట్టు లాడుతూ ఉంటుంది. అక్కడికి పెద్ద బొట్టమ్మ వచ్చిందన్న విషయం చెప్పటంతో విక్రాంత్, హాసిని వాళ్ళు షాక్ అవుతారు. ఇక నయని తను మీకు కనిపించదు అని.. తను డెలివరీ చేస్తుంది అని చెబుతుంది. ఇక నయని విక్రాంత్ తో గానవికి పాలు తాగించాను గాయత్రి కి ఆవుపాలు తాగించమని విశాల్ తో చెప్పమని అక్కడి నుంచి బయటికి పంపిస్తుంది.


ఇక తల్లి కొడుకు కిందికి రాగా ఇదే సమయం చూసుకొని విశాల్ కు ముప్పు పెట్టే ప్రయత్నం చేయాలని చూస్తుంది తిలోత్తమా. అప్పుడే విశాల్ గాయత్రి పాపని ఎత్తుకొని వచ్చి ఏవో అరుపులు వచ్చాయని అడగటంతో.. సుమనకు పురిటి నొప్పులు వస్తున్నాయని తిలోత్తమా చెబుతుంది. హాస్పిటల్ కి తీసుకెళ్తే సరిపోతుంది కదా అనటంతో.. అప్పుడే అక్కడికి విక్రాంత్ వచ్చి కంగారు పడాల్సిన అవసరం లేదు పెద్ద బొట్టమ్మ వచ్చింది అని అంటాడు. దాంతో తిలోత్తమా వాళ్ళు షాక్ అవుతారు. ఇక గాయత్రి కి పాలు ఇవ్వమని వదిన చెప్పింది అని విక్రాంత్ విశాల్ తో అంటాడు. ఇక అదే అవకాశం చూసుకుని తిలోత్తమా లోపలికి వెళ్లి ఒక గ్లాసులో పాలు పోస్తుంది.


also read it : Prema Entha Madhuram August 25th: భర్త కంట పడకుండా పేరు మార్చుకున్న అను.. ఆర్యను మించి ఉన్న అభయ్ ఆలోచనలు?



Join Us on Telegram: https://t.me/abpdesamofficial