Trinayani july 22th: ఇంటికి వచ్చిన వారందరికీ ఏదో ఒకటి జరుగుతుందని నయని అనటంతో వెంటనే విశాల్ అమ్మ దహన సంస్కారం ఇక్కడే జరిగింది కాబట్టి దాని ప్రభావం ఉంటుంది అని అంటాడు. అయితే గాయత్రమ్మ ఎక్కడో ఒకచోట పుట్టి ఉంటుంది కాబట్టి ఇంటికి వస్తే ఆ సమస్యలన్నీ పోతాయి అని నయని అంటుంది. అమ్మ ఇంట్లో ఉన్నా కూడా ఇలా జరుగుతున్నాయి అంటే శత్రువులపై పగ తీర్చుకుంటుంది అని అనుకుంటాడు విశాల్.


మరోవైపు గదిలో బెడ్ మీద సుమన పుస్తకం పట్టుకొని ఏవో రాస్తూ ఉండగా విక్రాంత్ వచ్చి చాప దిండు తీసుకొని వెళ్తుంటాడు. అలా వెళ్తున్నావు ఏం చేస్తున్నావని అడగవా అని అనటంతో వెటకారం గా రిప్లై ఇస్తాడు విక్రాంత్. నయని వదిన ఆస్తులు ఎంత పెరిగాయి ఎంత ఖర్చు పెట్టాలని రాస్తున్నావేమో అని అంటాడు. అలా కాదు అని తనకు 8 నెలలు నిండాయని తొమ్మిదో నెల కు వచ్చాను అని అనటంతో విక్రాంత్ అంతా సంతోషంగా ఏం కనిపించడు.


ఎవరికైనా ఇది సంతోషకరమైన వార్త అని.. ఈ తొమ్మిదో నెలలో తనకు సీమంతం జరిపించాలి అనటంతో వెంటనే విక్రాంత్ కోప్పడతాడు. అప్పుడే జరుపుకున్నావు కదా మళ్లీ ఎందుకు అని అనటంతో డబ్బులు ఉన్నాయి కదా ఏమవుతుంది అని అంటుంది సుమన. ఇక విక్రాంత్ తను ఏమీ చేయను అనడంతో సుమ నాకు కోపంగా చాప తీసుకొని తనే కిందికి వెళుతుంది. మరుసటి రోజు ఉదయాన్నే సుమన హాల్లో కింద కూర్చొని ఉంటుంది.


ఇక అక్కడికి ఎద్దులయ్య, పావని మూర్తి వచ్చి ఎందుకు ఇలా కూర్చున్నావు అని అంటారు. సుమను కోపంగా ఉండడానికి గమనించి పావన మూర్తి విజిలెయ్యటంతో అందరూ వచ్చేస్తారు. అలా కింద కూర్చున్నావ్ ఏంటి సుమన అని అందరూ అడుగుతూ ఉంటారు. లేచి సోఫాలో కూర్చుని నయని అంటుంది. అప్పుడే విక్రాంత్ వచ్చి తను బిల్డప్ కొట్టటానికి మరోసారి సీమంతం జరిపించుకోవాలని అనుకుంటుంది అనటంతో అందరూ మరోసారి షాక్ అవుతారు.


ఆల్రెడీ సీమంతం జరిగింది కదా మళ్లీ ఎందుకు అని అంటారు ఇంట్లో వాళ్ళు. కానీ సుమన మాత్రం మొండికి వేస్తుంది. వెంటనే విక్రాంత్ ఎంత డబ్బు ఖర్చైనా తిరిగి బిడ్డ పుట్టాక వచ్చిన ఆస్తులలో ఆ డబ్బుకు రెట్టింపు చెల్లిస్తానని అంటుంది అనటంతో అందరూ మరోసారి షాక్ అవుతారు. ఇక ఇవన్నీ వద్దులే నేను చేస్తాను లే అని విశాల్ అనటంతో.. నువ్వు ఎందుకు చేస్తావు అని నయని అంటుంది.


వెంటనే సుమన తన అక్క పై కోపడుతుంది. బావ చేస్తా అంటే నీకేం అవుతుంది అని అంటుంది. భార్య భర్తలన్నప్పుడు అని సమాన హక్కులు ఉంటాయి మేం అయితే సీమంతం చేయము అని చెప్పేస్తుంది.  ఎందుకు చేయవు అని సుమన గట్టిగా చెల్లరేగిపోతుంది. అసలు నువ్వు పిల్లలను కంటేనే కదా అని ఆవేశంలో నయని అనడంతో ఇంట్లో వాళ్ళు అలా అనకు అని అంటారు.


నిజం చెబితే మనకే సమస్య కదా అని గురువుగారు చెప్పారు కదా అనటంతో వెంటనే సుమన ఏం నిజమని ఆశ్చర్యంగా అడుగుతుంది. అవి అన్ని వదిలేసేయండి నేను సీమంతం చేస్తాను అని అంటుంది తిలోత్తమా. అందరూ మరోసారి షాక్ అవుతారు. ఇక సుమను పైకి లేమని అనడంతో హాసిని చెయ్యి ఇస్తుంది. కానీ సుమన అడుగు వేయకపోవడంతో కాళ్లకు ఏదో చుట్టుకున్నట్లు అనిపిస్తుంది అని అంటుంది.


చూసేసరికి పాము కుబుసం చుట్టుకుని ఉండటంతో అందరూ భయపడతారు. ఇక ఆ కుబుసం ఎంతకు తీయానికి రాకపోయేసరికి వెంటనే ఎద్దులయ్య పిల్లల కోసం కాబట్టి పిల్లలని తాకిస్తే కుబుసం వస్తుంది అని అంటాడు. ఇక పిల్లలు ఇద్దరితో కుబుసం తీపిస్తారు. దాంతో విశాల్ ఎద్దులయ్యకు థాంక్స్ చెబుతాడు. నయని కూడా ఎద్దులయ్యను కృతజ్ఞత కోరుతుంది. ఇక విశాల్ తన మనసులో థాంక్స్ చెప్పింది సుమన కోసం కాదు.. గాయత్రి వల్ల కుబుసం వస్తుంది అంటే అమ్మకు అనుమానం వస్తుంది కాబట్టి ఇద్దరు పిల్లలచే తీయించేలా చేశాడు ఎద్దులయ్యా అని అనుకుంటాడు.


 


also read it : Rangula Ratnam July 21th: ‘రంగులరాట్నం’ సీరియల్: ఆకాష్ వాళ్లు మారారని తెలుసుకున్న శంకర్ ప్రసాద్, ఆవేశంలో నిజాన్ని బయటపెట్టిన రేఖ?



 
Join Us on Telegram: https://t.me/abpdesamofficial