Trinayani August 14th: హాల్ లోకి వచ్చిన తిలోత్తమా గెటప్ ని చూసి ఆశ్చర్యపోతారు ఇంట్లో వాళ్ళు. ఇక హాసిని నీ బొక్కల చీర బాగుంది అంటూ వెటకారం చేస్తూ ఉంటుంది. తిలోత్తమా మాత్రం చిరాకు పడుతూ ఉంటుంది. ఎక్కడ చచ్చారు మీరంతా అంటూ కోపంగా అరుస్తుంది. దాంతో హాసిని వెటకారం చేస్తుంది. ఇక తిలోత్తమా నోరుముయ్యి అంటూ.. తను స్నానం చేసి చీర కట్టుకుందాం అంటే బెడ్ మీద పెట్టిన చీర లేదు అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు.


అల్మారులో నుండి ఇంకో చీర తీసుకుందామంటే లాక్ వేసి ఉంది అని.. లాక్ కూడా తన గదిలో లేదు అని ఎవరు చేశారు ఈ పని అని కోపంగా అరుస్తుంది. అయితే వెంటనే  విశాల్ కు.. తను గాయత్రి పాప దగ్గరికి వెళ్లినప్పుడు అవి తన దగ్గర ఉన్నట్లు గుర్తుకు వస్తుంది. దాంతో ఆ అమ్మ చీర ఈ అమ్మ ఎత్తుకొచ్చిందన్న మాట అని అనుకుంటాడు. ఇక తిలోత్తమా కోపంగా మాట్లాడరేంటి అని అనటంతో.. వెంటనే నయని ఆ పని ఎవరు చేయరు అని.. చేసిన కూడా చెప్పరు అని అంటుంది.


తన పరువు తీయాలని చేశారు అని ఎవరు చేశారు చెప్పండి అనడంతో.. అందరం ఇక్కడే ఉన్నాము అని.. మధ్యలో విశాల్ బావ వెళ్ళాడు అని సుమన చెబుతుంది. దాంతో నయని మా ఆయన రాముడు కృష్ణుడు కాదు అని అంటుంది. ఇక హాసిని మాత్రం ఈ డ్రెస్సు మాత్రం మీకు బాగుంది అంటూ సెల్ఫీ తీసుకుందామా అని అనటంతో వెంటనే ఇందాక దింపిన ఫొటోస్ కూడా డిలీట్ చేయమని అంటుంది.


దానితో సోషల్ మీడియాలో పెడితే మీడియా మన ఇంటి ముందు ఉంటుందని విశాల్ అనడంతో అందుకే పెట్టొద్దు అంటున్నాను అని అంటుంది తిలోత్తమా. ఇక హాసిని వాళ్ళు కేక్ కట్ చేస్తూ ఉండగా తిలోత్తమా తను చీర కట్టుకొని వచ్చే వరకు కేక్ కట్ చేయొద్దు అని అంటుంది. కానీ ఇంట్లో వాళ్ళు చాలా ఆలస్యమైంది తిలోత్తమాని అక్కడనే ఉండమని అంటారు.


ఇక తిలోత్తమా చీర కట్టుకొని వచ్చి తనకు మంచి గిఫ్ట్ పెట్టాలనుకున్నాను అనటంతో సుమన ఈసారి నేను గిఫ్ట్ తీసుకొచ్చాను అని హాసినికి ఒక గిఫ్ట్ ఇస్తుంది. ఓపెన్ చేసి చూడగ గోల్డ్ రింగ్ అని హాసిని అనటంతో అందరూ షాక్ అవుతారు. వెంటనే విక్రాంత్ డబ్బులు లేవు అన్నావు కదా అనటంతో వెంటనే సుమన.. వారం రోజులు ఆగితే తనకు ఆస్తి వస్తుందని జువెలరీ షాప్ వ్యక్తికి చెబితే ఫ్రీగా ఇచ్చాడు అని చెబుతుంది.


దాంతో ఇంట్లో వాళ్ళు మరోసారి షాక్ అవుతారు. వెంటనే నయని నవ్వుతుండగా సుమన తన మీద నమ్మకం మీదనే ఇచ్చాడని అనటంతో వెంటనే నయని జువెలరీ షాపు వ్యక్తి విశాల్ కి ఫోన్ చేసి నువ్వు అప్పుగా తీసుకున్న రింగు గురించి చెప్పటంతో విశాల్ డబ్బు కొట్టాడన్న విషయాన్ని చెబుతుంది. దాంతో అందరూ మరింత షాక్ అవుతారు.


ఇక సుమన.. ముష్టి రెండు లక్షలు రెండు వారాలు అవుతే వడ్డీతో సహా ఇస్తాను అనటంతో.. నయని రెండు లక్షలు కాదు మూడు కోట్లు అని అనటంతో సుమన షాక్ అవుతుంది. దాంతో గతంలో సుమన విశాల్ దగ్గరిక తీసుకున్న డబ్బులను గుర్తుకు చేస్తుంది హాసిని. ఇక సుమన ఆపండి అంటూ నన్ను అవమానిస్తారా అని అరుస్తుంది. ఆస్తి వచ్చాక అన్ని చెల్లిస్తాను అని అంటుంది.


ఇక వల్లభ పెళ్లిరోజు సెలబ్రేట్ చేసుకుందామని అంటాడు. ఇక హాసిని దంపతులకు కేక్ కట్ చేయటంతో అందరూ విష్ చేస్తారు. ఆ తర్వాత తిలోత్తమా తన గదిలో ఉండగా వల్లభ వచ్చి సింగపూర్ కి వెళ్దామని అంటాడు. దాంతో ఎందుకు వెళ్తున్నామో చెప్పు అని తిలోత్తమా అడగటంతో.. చంద్రుని చూడటం కోసం అని అంటాడు. ఈ విషయం మధ్యాహ్నం చెబుతే అప్పుడే వెళ్లే వాళ్ళం కదా ఇప్పుడు చూడలేము అని అంటుంది.


ఇక ఇప్పుడు వెళ్లి చూద్దాము అని.. ఆ సమయంలో కళ్ళు మూసాక ఏం కనిపించిందో పక్కకు వెళ్లి చెప్పుకుందామని అంటుంది. చీకటి పడటంతో అందరూ చంద్రుడిని చూడటానికి బయటికి వస్తారు. చంద్రుడిని చూసేటప్పుడు మంత్రం జపించాలి అని ఆ మంత్రం చెబుతారు. చంద్రుడు వచ్చిన క్షణంలోనే మొదట ఎవరు చూస్తారో వాళ్లకే క్లూ దొరుకుతుంది అని విశాల్ అంటాడు. అదే సమయంలో విశాలాక్షి, ఎద్దులయ్య చాటున నిలబడి వారిని చూస్తారు.


అయితే విశాలాక్షి ఎద్దులయ్యకు ఫేక్ చంద్రవంకను ఇచ్చి అది తిలోత్తమా వాళ్ళను చూసేటట్టు చేయమని చెప్పి మాయమవుతుంది. తిరిగి నయని వాళ్ళ దగ్గర ప్రత్యక్షమవుతుంది. నయనిని పిలిచి అందరూ ఒకే చోట ఉంటే ఎలా కనబడుతుంది అని అనటంతో.. ఎవరు ఏమి చూసిన ఒకరికొకరు చెప్పకూడదు కదా అని నయని అంటుంది. ఇక నువ్వు చూసిన చెప్పలేవు అని నయనితో అంటుంది. మరోవైపు ఎద్దులయ్య ఫేక్ చందమామని పెడతాడు. ఇక తిలోత్తమా వాళ్ళు విశాలాక్షి మాటలపై వెటకారం చేస్తూ ఉంటారు.


 


also read it : Janaki Kalaganaledhu August 12th: ఘనంగా వెన్నెల నిశ్చితార్థం వేడుకలు.. కిషోర్ పచ్చబొట్టును జానకి చూసేసిందా?


 



Join Us on Telegram: https://t.me/abpdesamofficial