Janaki Kalaganaledhu August 12th: జ్ఞానంబ ఇంట్లో వెన్నెల నిశ్చితార్థం వేడుక ఏర్పాట్లు ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఇద్దరు చిన్న కొడుకులు గుమ్మాలకు పువ్వులు కడుతుండటంతో అది చూసి గోవిందరాజులు ఆశ్చర్యపోతాడు. అంతేకాకుండా వెటకారంగా డైలాగులు కూడా కొడుతుంటాడు. ఇక రామ కూడా ఇంట్లో పని చేస్తూ ఉంటాడు. అప్పుడే మలయాళం రామ దగ్గరికి వచ్చి వెన్నెల పెళ్లి కాగానే తనకు కూడా పెళ్లి చేయమని తెగ సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతూ అడుగుతుంటాడు.


దాంతో రామ సరే అని పనులు చూసుకోమని సరదాగా అంటాడు. అప్పుడే గోవిందరాజులు రామ దగ్గరికి వచ్చి పంతులుకి ఫోన్ చేసావా అని అడగటంతో దారిలో ఉన్నాడట అని రామ చెబుతాడు. ఆ పంతులు ఎప్పుడు ఇదే మాట చెబుతుంటాడు అని.. పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చే లోపు పంతులు రాకపోతే మీ అమ్మ మనపై మంత్రాలు చల్లుతుందంటూ సరదాగా కామెంట్ చేయడంతో అప్పుడే అక్కడికి జ్ఞానంబ వచ్చి తన గురించి ఏమంటున్నారు అని అంటుంది. దాంతో గోవిందరాజులు మాట మార్చి విష్ణుని లాగుతాడు. 


మరోవైపు జానకి, జెస్సి వెన్నెలను తయారు చేస్తూ ఉంటారు. వెన్నెల మనకు అవకాశం ఇవ్వకుండా తన అత్తారింటికి తనే దారి చూసుకుందని జెస్సి అంటుంది. ఇక వెన్నెల వాళ్లు ఎక్కడున్నారు అని అడగటంతో వెంటనే జెస్సి నువ్వు మెసేజెస్ చేస్తున్నావు కదా అంటూ ఫోన్ లాక్కుంటుంది. ఇక ఫోన్ ఇవ్వకుండా కాసేపు ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇక పంతులు ఇంట్లోకి రాగానే గోవిందరాజులు పంతులు పై సెటైర్లు వేస్తూ ఉంటాడు. అదే సమయం కు పెళ్లి కొడుకు వాళ్ళు కూడా వస్తారు.


ఇక జానకి మల్లికతో వెన్నెలను తీసుకొని రమ్మని అంటుంది. జెస్సి అందరికీ టీ ఇస్తుండగా జానకి ఆపి మొదట వెన్నెల చేతితో ఇప్పించాలి అని అంటుంది. ఇక వెన్నెలను తీసుకొని రాగానే వెన్నెల కిషోర్ కి టీ ఇస్తుండగా టీ మీద పడిపోతుంది. దానితో ఇంట్లో వాళ్లంతా కంగారు పడగా కిషోర్ పరవాలేదు బయట క్లీన్ చేసుకుంటాను అనగా వెంటనే రామ కూడా వెళ్తాడు. ఇక అదే సమయంలో జానకికి ఆఫీస్ కి రమ్మని ఫోన్ రావడంతో వెంటనే జ్ఞానంబ ఇంట్లో నిశ్చితార్థం ఉందని రాలేను అని చెప్పమని అంటుంది.


దాంతో జానకి సరే అని బయటికి వెళ్లి మాట్లాడుతుంది. ఇక అప్పుడే నీలావతి వచ్చి నిశ్చితార్థం పూర్తయిందా.. అయ్యో ఆలస్యంగా వచ్చాను అనటంతో.. మల్లిక ఇంకా పూర్తి కాలేదు అని తన పక్కన వచ్చింది నిలబడమని అంటుంది. బయట కిషోర్ షర్టు విప్పి వాష్ చేసుకుంటూ ఉండగా అదే సమయంలో జానకి అక్కడికి వచ్చి ఫోన్ మాట్లాడుతుంది. అయితే కిషోర్ బాడీ మీద టాటూ ఉంటుంది. ఇక మాఫియాలలో ఎన్కౌంటర్ చేసిన వాళ్ళకి ఇద్దరికీ ఒకేలా టాటూ ఉందని.. మరో వ్యక్తికి కూడా అదే టాటూ ఉంటుంది అని ఫోన్లో చెబుతూ ఉంటుంది.


ఇక కిషోర్ షర్ట్ వేసుకుంటాడు. కిషోర్ జానకి దగ్గరికి వెళ్లి ఏంటి సిస్టర్ ఇంత టెన్షన్ పడుతున్నారు అనటంతో మా జాబ్స్ అంతే అని నవ్వుతూ చెబుతుంది. దాంతో రామ ఇక దాపరికం ఎందుకు అంటూ ఎవరు టెర్రరిస్ట్ తప్పించుకొని ఈ ఊర్లోని తిరుగుతున్నాడు అంట అని అంటాడు. దాంతో కిషోర్ కాస్త భయపడుతున్నట్లు కనిపిస్తాడు. ఇక కిషోర్ తనకు తెలిసి టెర్రరిస్టులు చాలా మొండి వాళ్ళు అంటూ.. ప్రాణాలు ఇవ్వడానికే కాదు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు అని  అనటంతో వెంటనే రామ నీకెలా తెలుసు అని అంటాడు.


దాంతో కిషోర్ ఎన్ని సినిమాలు చూడలేదు, ఎన్ని పేపర్లు చదవలేదు అని అంటాడు. అంతేకాకుండా టెర్రరిస్ట్ కు సపోర్టుగా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో జానకి అనుమానంతో ఎందుకు టెర్రరిస్ట్ వైపు మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. దాంతో మీ క్షేమం నాకు ముఖ్యం మీ వైపే మాట్లాడుతున్నాను అని కవర్ చేస్తాడు. ఇక అయిన టెర్రరిస్టులు ఎక్కడో ఉండట్లేదు జనాల మధ్య తిరుగుతున్నారు వాళ్ళని పట్టుకోవడం చాలా ఛాలెంజ్ అని కిషోర్ అనటంతో.. పట్టుకొని తీరుతాను అని జానకి అంటుంది.


ఇక రామ ఈ టెర్రరిస్టుల గొడవ ఎందుకు అని లోపలికి తీసుకొని వెళ్తాడు. ఇక ఇంట్లో నిశ్చితార్థం వేడుక జరుగుతుండగా కిషోర్ తన మనసులో వీలైనంత తొందరగా వెన్నెలని పెళ్లి చేసుకొని ఈ ఇంటి అల్లుడిని అయితే జానకి తన జోలికి రాదు అని.. వెన్నెలను అడ్డు పెట్టుకోవచ్చు అని అనుకుంటాడు. ఆ తర్వాత కిషోర్, వెన్నెల మూగ సైగలతో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కిషోర్ జానకి వైపు చూస్తూ.. నా ఎదురుగా ఉన్న మృత్యుదేవత నన్ను తొందర పడేలా చేస్తుంది అని అనుకుంటాడు.


జ్ఞానంబ.. వెన్నెల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మంచి అల్లుడు దొరికాడు అంటూ పొగుడుతూ ఉంటుంది. మల్లిక, నీలావతి ఒకరికొకరు చెవులు కొరుక్కుంటారు. ఇక తాంబూలాలు మార్చుకోవటం, రింగులు మార్చుకోవటం కూడా జరిగిపోతుంది. ఇక రామ జానకితో సరసాలు వాడుతూ ఉంటాడు. కిషోర్ కంగారు పడుతూ ఉండటంతో వెంటనే రామ కిషోర్ ని దేనికి కంగారు పడుతున్నారు అని అడుగుతాడు. దాంతో కిషోర్ షాక్ అవుతాడు.


 


also read it: Madhuranagarilo August 10th: సంయుక్త చేతిని చూసి షాకైన శ్యామ్.. రాధ చెంప పగలగొట్టిన అపర్ణ?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial