Trinayani September 5th: పంతులుగారు సుమనతో ఈ సస్యలకి నీ బిడ్డే కారణం అని అన్నాను కానీ నువ్వు కారణమని అనలేదు కదా.. నేను ఈ సమస్యను 20 సంవత్సరాలు ముందే చూసాను, మీ పెద్దత్తయ్య గాయత్రీ దేవి గారు అమ్మవారిని నాగ అంశతో ఒక వారసురాలు కావాలి అని కోరారు దానికి ఫలితమే ఇది దక్కింది అని చెప్తారు పూజారి గారు. ఇంకా నా బిడ్డ గురించి ఏమి చెప్పొద్దు. మీరు నాకు నా బిడ్డ మీద అనుమానం తెప్పించేలా చేయొద్దు.. తల్లి కూతుర్లని వేరు చేసే పాపం మీరు ఎవరు మూటకట్టుకోవద్దు.. ఇంతటితో విషయాన్ని ఆపేయండి అని సుమన అంటుంది. ఆ తర్వాత నయని మంగళ గౌరీకి నిష్ఠతో పూజలు చేసి తన బాధని చెప్పుకుంటుంది.


అప్పుడు పంతులుగారు పూజ అయిపోయిన తర్వాత హారతి అక్కడ అమ్మవారి ముందు పెట్టండి అమ్మవారు మీ పూజలను స్వీకరించినట్టు అయితే తనకు తానే హారతి ఇచ్చుకుంటారు అని అంటారు. అలాగే హారతిని అమ్మవారి ముందు పెట్టగా హారతి తనంతట అదే గాల్లోకి వెళ్లి హారతి పుచ్చుకుంటుంది అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించారు అని పంతులుగారు చెప్పగా ఉన్న కుటుంబ సభ్యులందరూ అమ్మవారికి దండం పెట్టుకుంటారు. కచ్చితంగా ఈ పూజకు ఫలితం దక్కుతుంది అని పంతులుగారు చెప్పారు.


ఆ తర్వాత సీన్లో వల్లభ త్రిలోత్తమ గదిలో ఉండగా దురంధర వచ్చి హారతి ఇస్తుంది. ఆ హారతికి వల్లభ భయపడేది అమ్మవారికి ఇచ్చిన హారతి కాదు కదా నాకు ఇంకా భయంగానే ఉందని భయపడతాడు.. అప్పుడు దురంధర మన నయని ఎంతో నిష్టగా చేసింది కనుక అమ్మవారు హారతిని తీసుకుంది మీరు కూడా అదే హారతిని తీసుకుంటే మంచిది అని చెప్తుంది. ఆ తర్వాత సీన్లో నయని విశాల్ దగ్గరికి వచ్చి నుదుటన విభూది పెడుతుంది.


అప్పుడు విశాల్ తన యవ్వన రూపంలోకి వచ్చి నేను ఇప్పుడే గాయత్రిని ఎత్తుకుందాము అని అనుకున్నాను ఇంతలో నువ్వు నుదుటిన విభూతి పెట్టావు. పాపం నేను ఎవరో అనుకోని గాయత్రి ఏడుస్తుంది అని వెంటనే గాయత్రిని వెళ్లి ఎత్తుకొని గట్టిగా హద్దుకుంటాడు. అప్పుడు నయని, బాబు గారు మీరు మన కుటుంబానికి మాత్రమే కదా కనిపిస్తారు అలాంటప్పుడు గాయత్రిని మీరు ఎలా ఎత్తుకోగలుగుతున్నారు అని అడుగుతుంది.


ఇంతలో కంగారుపడిన విశాల్, మూడు నిమిషాలు సమయం అయిపోవస్తుంది అని చెప్పి గాయత్రిని మంచం మీద పడుకోబెట్టి తను తిరిగి ముసలివాడిలా మారిపోతాడు. అప్పుడు లేచి నువ్వు గాయత్రిని దత్తకు తీసుకోక ముందే నీ పాలు ఇచ్చి పెంచావు కదా రక్తంతో తయారైన పాలు ఆ రక్త బంధాన్ని కూడా ముడివే సాయి అందుకే నేను గాయత్రి ని ఎత్తుకోగలిగాను అని చెప్తాడు. దానికి నయని సరే అంటుంది. ఆ తర్వాత సీన్లో సుమన పాపను ఒళ్ళో పెట్టుకుని లాలిస్తుంది ఇంతలో విక్రాంత్ అక్కడికి వస్తాడు విభూది పెట్టుకున్నావేంటి అని అడగగా నయని వదినా పెట్టింది అని అంటాడు విక్రాంత్. అక్క చెప్పు చేతుల్లోనే ఎప్పుడు ఉంటావు అని అనగా ఇప్పుడు వదిన జాలి చూపిస్తే నీకు ఆస్తి కూడా వచ్చేది అది గుర్తుంచుకో మాటలు తిన్నంగా రాని అని అంటాడు. 


దానికి సుమన నన్ను ముందు కూరలో కరివేపాకుల తీసిపారేశారు కానీ ఇప్పుడు నాకు పాప పుట్టింది.. నాకు ఆస్తి వచ్చి తీరుతుంది అని అనగా, విక్రాంత్ మాట్లాడుతూ నేను పాప మీద చాలా జాలి పడుతున్నాను నీలాంటి తల్లి వచ్చిందని, సొంత పాలు పట్టకుండా బయట నుంచి పాలు తెచ్చి అవి అరగక చిన్నప్పుడు నుంచే నరకయాతన భరిస్తుంది గత జన్మలో ఏం పాపం చేసిందో ఏంటో ఇలాంటి తల్లి దొరికింది అని అంటాడు. అదే సమయంలో పైనుంచి కుభసం సుమన కూతురు మీద పడుతుంది దాన్ని వెంటనే పక్కకు పారేస్తుంది సుమన. అయినా ఈ చెత్తంతా ఇంట్లో ఎందుకు ఉంది అని అనగా మొన్నటి వరకు నువ్వే కదా వేసుకొని తిరిగావు అని అంటాడు విక్రాంత్. నేనా అని ఆశ్చర్య పోతుంది సుమన.


Also Read: Prema Entha Madhuram September 4th: ఛాయాదేవికి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. అను ఇంటికి వచ్చిన ఆర్య?


Join Us on telegram: https://t.me/abpdesamofficial