Brahmamudi September 5th Written Update: కావ్యతో కలిసి సంతోషంగా ఉండమని సీతారామయ్య రాజ్ దగ్గర మాట తీసుకుంటాడు. ఆ మాటకి సంతోషంతో తనని బయటకి తీసుకెళ్లమని అడుగుతాడు. హాల్లోకి రాగానే వ్రతం ఇంకా పూర్తి కాలేదని చెప్తాడు.


సీతారామయ్య: ఉదయం నుంచి వ్రతం వల్ల ఉపవాసం ఉంది. పొద్దుటి నుంచి ఏమి తినకుండా వ్రతం పనులు చేసి అలిసిపోయింది. చివరలో అక్షింతలు వేయకుండా తనని బాధపెట్టావ్. ఆ అమ్మాయి ఎంతో భక్తితో వ్రతం చేసుకుంటే ఫలితం దక్కకుండా చేశావ్ అది నాకు నచ్చలేదు. నువ్వు అక్షింతలు వేస్తే కానీ కావ్య భోజనం చేయదు


రాజ్: ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను తాతయ్య


గదిలో కావ్య తన బట్టలు మొత్తం సర్దుకుని వెళ్లిపోవడానికి రెడీ అవుతుంది. రాజ్ ఎదురుపడి ఎక్కడికని అడుగుతాడు.


కావ్య: బయల్దేరాల్సిన చోటుకి వెళ్తున్న. మీ ప్రయాణం కొనసాగించండి నా గమ్యం మీ గమ్యం వేరు అని అర్థం అయ్యాక ఇక్కడ ఎలా ఉండాలి. ఇంకా వెళ్లలేదా అని ఎందుకు ఉన్నావని అడుగుతారు. వీడ్కోలు చెప్పి వెళ్ళడం కరెక్ట్ కదా అందుకే చివరి సారిగా చెప్పడం కోసం ఎదురు చూస్తున్నా. సెలవు


Also Read: లాస్య ప్లాన్ మిస్ ఫైర్- గెటవుట్ అన్న విక్రమ్, తులసికి మాజీ మొగుడు ప్రేమలేఖ


రాజ్: ఆగు నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నా అభిప్రాయం మార్చుకున్నా. నిన్ను ఉండమంటున్నా


కావ్య: ఎందుకు ఉండమంటున్నారు. ఇంట్లో ఒక వస్తువుగా ఉండమంటున్నారా?


రాజ్: ఇన్ని రోజులు ఎదురుచూశావ్ ఇంకొద్ది రోజులు ఎదురుచూడు


కావ్య: మార్పు కోసమా ఓదార్పు కోసమా?


రాజ్: నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒక్కటే. ఇన్ని రోజులు ఓపిక పట్టిన దానివి ఒక మూడు నెలలు ఓపిక పట్టి చూడు


కావ్య: మూడు నెలల్లో ఏం జరుగుతుంది. మూడు నెలల్లో మీరు మారిపోతారా? నన్ను భార్యగా స్వీకరిస్తారా?


రాజ్: నువ్వు అడిగిన వాటికి మూడు నెలల్లో సమాధానం దొరుకుతుంది


కావ్య: ఈ అస్పష్టమైన కాపురం చేసేది ఎలా


రాజ్: నాతో ఈ ఇంట్లో ఉండు నిన్ను సంతోషంగా ఉంచడానికి ట్రై చేస్తాను


కావ్య: నాలో ఆశలు కల్పిస్తున్నారు నేను ఉండాలా? వెళ్ళాలా?


రాజ్: నీకు నమ్మకం కలగాలి అంతే కదా అని తన చెయ్యి పట్టుకుని కిందకి తీసుకుని వస్తాడు. అది చూసి అపర్ణ షాక్ అవుతుంది. రాజ్ చేతికి ఇంద్రాదేవి అక్షింతలు ఇచ్చి కావ్యని ఆశీర్వదించమని అడుగుతుంది. రాజ్ కావ్య తల మీద అక్షింతలు వేసి దీవిస్తాడు. చాలా సంతోషపడుతుంది. వ్రతం అసంపూర్తిగా ముగిసిపోతుందని అనుకున్నా కానీ ఆశీర్వాదం దక్కిందని కావ్య ఆనందపడుతుంది. రాజ్ దంపతులని కలకాలం కలిసి ఉండాలని పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తారు. మిమ్మల్ని విడదీయాలని చూస్తే వారికి భంగపాటు కలుగుతుందని అంటాడు.


Also Read: ముకుంద ప్లాన్ సక్సెస్- ప్రేమించిన అమ్మాయి పేరు చెప్పమని మురారీని అడిగిన కృష్ణ


రాజ్ కావ్య చేతిని పట్టుకుని తీసుకురావడం గురించి అపర్ణ ఆలోచిస్తూ ఉంటుంది. కోపంతో రగిలిపోతుంటే రుద్రాణి మరింత ఎక్కించడానికి చూస్తుంది. భార్య నెత్తిన అక్షింతలు వేయమంటే వేయకుండా బెట్టు చేసిన రాజ్ తర్వాత తన చేతిని పట్టుకుని మరీ తీసుకొచ్చాడని దెప్పి పొడుస్తుంది.


రుద్రాణి: నీ కోడలు సామాన్యురాలు కాదు అందరినీ ఆట ఆడిస్తుంది. రాజ్ తన భార్య చెప్పినట్టే వింటున్నాడు ఏం మాయ చేసిందో ఏంటో


అపర్ణ: భార్య ఏడుస్తుందని అమ్మ తిట్టిందని రాజ్ మనసు మార్చుకునే రకం కాదు


రుద్రాణి: నా ముందు ఒప్పుకోకపోయినా తర్వాత నిదానంగా ఆలోచించి చూడు నీకే తెలుస్తుంది


కావ్య కృష్ణయ్య దగ్గరకి వెళ్ళి తన బాధ పంచుకుంటుంది.


కావ్య: నా భర్త మారడానికి సమయం అడిగాడు. మారితే బతుకు అంతా వెలుగే కదా. నా భవిష్యత్ అంతా వెలిగిపోతూ ఉంటుంది కదా. కానీ ఒక పక్క అపనమ్మకం. నిజంగా మార్పు జరుగుతుందా? నా కాపురం నిలబడుతుందా? కాసేపటి క్రితం వరకు వెళ్లిపోవాలని అనుకున్నా ఇప్పుడు ఉండిపోతున్నా. ఇది నీ లీల. నా భర్త మారడానికి సమయం అడిగాడు. నేను మార్పు కోసం సమయం ఇచ్చాను. గెలిస్తే సంసారం, ఓడితే ఒంటరితనం. నాకు నా భర్త మనసులో స్థానం కావాలి. నా కాపురం నా భర్త చేతిలో ఉంది. నిన్నే నమ్ముకున్నాను కృష్ణ


ఆ తర్వాత రాజ్ కన్నయ్య విగ్రహం దగ్గరకి వెళ్ళి మాట్లాడతాడు.


రాజ్: కళావతి చాలా అడిగినట్టు ఉంది. అన్నీ ఇవ్వకు నేను ఇరకాటంలో పడతాను. ఇందులో నా తప్పేమీ లేదు తాతయ్య ప్రాణాల కోసం లౌక్యంగా ప్రవర్తించాను. నువ్వు నేర్పిన విద్యే నీరజాక్ష. మార్పు కోసం మూడు నెలలు అడిగాను. ఎందుకు అడిగానో నీకు తెలుసు. తాతయ్య ఉన్నంత వరకు నేను ఆయన మాట ప్రకారం కళావతిని ప్రేమగా చూసుకుంటున్నట్టు నటించాలి. ఈ కళావతి మనసులో ప్రేమ, ఆశలు రేపకు. ఆ తర్వాత నిజం తెలిస్తే కష్టం. మా కాపురం ఒక కల అది ఎప్పటికీ నిజం కాదు. నా మనసులో కళావతి ఎప్పటికీ స్థానం సంపాదించుకోలేదు


తరువాయి భాగంలో..


రాజ్ ఆఫీసుకి వెళ్తూ కావ్యని క్యారేజ్ రెడీ అయ్యిందా అని అడుగుతాడు. ఆఫీసుకి వెళ్తూ వెళ్లొస్తాను అని చెప్పి మరీ వెళతాడు. కొడుకు ప్రవర్తన చూసి అపర్ణ షాక్ అవుతుంది. వీడు ఏంటి కొత్తగా ప్రవరిస్తున్నాడని అనుకుంటుంది.