బిగ్ బాస్‌ రియాలిటీ షోలో ప్రేక్షకులను ఎన్నో విషయాలు ఆకట్టుకుంటాయి. అందులో ఒకటి సీక్రెట్ టాస్క్. కంటెస్టెంట్ ఒకరికి సీక్రెట్ టాస్క్ ఇవ్వడం, ఆ కంటెస్టెంట్ ఆ టాస్క్‌ను మిగతావారికి తెలియకుండా చేయడం.. ఇవన్నీ ప్రేక్షకులకు విపరీతమైన మజాను ఇస్తాయి. అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ 7లో అలాంటి ఒక సీక్రెట్ టాస్క్‌తో ఫస్ట్ డేనే హౌజ్‌లోకి వచ్చింది రతిక. తన టాస్క్ గురించి పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకొని హౌజ్‌లోకి వచ్చిన రతిక.. అప్పుడే తన ప్రణాళికను అమలు చేయడం మొదలుపెట్టింది. ఒకరి తర్వాత ఒకరిగా కంటెస్టెంట్స్‌ను తన సీక్రెట్ టాస్క్‌తో అప్రోచ్ అయ్యింది.


ముందుగా శోభా శెట్టి దగ్గరకు వెళ్లి ఒక సీక్రెట్ టాస్క్ ఉంది చేస్తావా అని అడిగింది రతిక. శోభా కూడా చేస్తాను. ఏంటో చెప్పు చేస్తాను అని పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యింది. రెండు ముక్కలైన హార్ట్‌ను చూపించి అమర్‌దీప్, ప్రియాంక మధ్య ఏదో ఒక గొడవ పెట్టాలి, ఫైట్ క్రియేట్ చేయాలి అని చెప్పింది రతిక. ఏం చేసినా గొడవ జరగాలి అని చెప్పింది. ‘వాళ్లిదరూ నిజంగా గొడవపడితే నువ్వు టాస్క్ విన్ అవుతావ్, నామినేషన్ నుంచి సేవ్ అవుతావ్, ఒకవేళ వారు గొడవపడకపోతే నువ్వు నేరుగా నామినేషన్స్‌లోకి వెళ్తావ్’ అని శోభాతో అంటుంది రతిక. ఇదంతా విన్న శోభా.. రతికను అనుమానిస్తుంది. టాస్క్ పరంగా నాకు నీ మీద నమ్మకం రావడం లేదని మోహం మీదే చెప్పేస్తుంది. ‘ఏ విధంగా చూసుకున్న బిగ్ బాస్ నీకు ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌ను వేరేవాళ్లకు చెప్పకూడదు కదా.. ఒకవేళ నాకు చెప్పావ్ అని నేను చేస్తే అది నీకు మాత్రమే ప్రయోజనాన్ని ఇస్తుంది కదా’ అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది శోభా. ఆ తర్వాత అమర్‌దీప్, ప్రియాంక దగ్గరకు వెళ్లి రతిక చెప్పిన విషయం అంతా చెప్పేస్తుంది.


సీక్రెట్ టాస్క్ గురించి శోభా శెట్టితో షేర్ చేసుకున్న విషయాన్ని పల్లవి ప్రశాంత్‌కు వచ్చి చెప్తుంది రతిక. బిగ్ బాస్ తనకొక సీక్రెట్ టాస్క్ ఇచ్చాడని, శోభా చేస్తానంటే తనతో చెప్పానని, చెప్పిన తర్వాత తను చేయను అంటుందని అంతా పల్లవి ప్రశాంత్‌కు వివరించింది. ఆ సీక్రెట్ టాస్క్ చేస్తే ఏంటి ఉపయోగం అని రతికను అడుగుతాడు ప్రశాంత్. అది కరెక్ట్‌గా చేస్తే నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వచ్చు అని చెప్తుంది. అయితే ఆ టాస్క్ నాకు చెప్పొచ్చు కదా, రిస్క్ అయినా సరే నీకోసం చేస్తాను అంటాడు ప్రశాంత్. అయితే సీక్రెట్ టాస్క్.. అమర్‌దీప్, ప్రియాంకకు గొడవపెట్టాలి, రాత్రి వరకు చేస్తే రేపటి నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వొచ్చు అని రతిక చెప్తుంది. వారిద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి ఈ టాస్క్ కష్టమని ప్రశాంత్ అనగా.. ఆలోచించుకో అని రతిక ఎంకరేజ్ చేస్తుంది.


శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్‌తో సీక్రెట్ టాస్క్ చేయడం కష్టమని తెలుసుకున్న రతిక.. వెళ్లి టేస్టీ తేజకు అదే విషయాన్ని చెప్తుంది. ఇద్దరి మధ్య గొడవ పెడితే.. సీక్రెట్ టాస్క్ గెలిచినట్టే, తరువాతి వారం నామినేషన్స్ నుంచి సేవ్ అవుతావు అని చెప్తుంది. ఎవరు ఆ ఇద్దరు అని తేజ అడగగా.. గెస్ చేయమంటుంది. గౌతమ్ కృష్ణ, యావర్ అని చెప్తే.. అవును కరక్టే అని చెప్పి వారిద్దరి మధ్య గొడవపెట్టమని ఎంకరేజ్ చేస్తుంది. దీంతో తేజ.. యావర్ దగ్గరకు వెళ్లి.. గౌతమ్ అనని విషయాలు కూడా అన్నాడని అబద్ధాలు చెప్తాడు. రతిక.. గౌతమ్ కృష్ణను పక్కకు తీసుకెళ్లి తేజ చేసినట్టే ఆరోపణలు చేస్తుంది. అదే సమయంలో గౌతమ్ దగ్గరకు వచ్చిన తేజ.. తన దగ్గర కూడా అదే అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నిస్తాడు. రతిక ఇదంతా సైలెంట్‌గా గమనిస్తుంది. యావర్‌కు, గౌతమ్ కృష్ణకు మధ్య గొడవపెట్టాలనుకున్న తేజ ప్రయత్నం.. కొంతవరకు ఫలించిందని అర్థమవుతోంది. 


Also read: ‘బిగ్ బాస్’ ఏం మర్యాద ఇచ్చాడు? షకీలా ఫైర్, టేస్టీ తేజా ప్రశ్నల వర్షం - హౌస్‌లో అంతా డమ్మీలే