Trinayani july 4th: అమ్మవారిని ఎత్తుకొని ఊరేగింపు జరిగే రోజుల్లో అమ్మ ఇచ్చిన కాసులకు ఆశపడ్డారని మట్టిగుడ్డలను చదును చేశారు. అప్పుడు మాయమైన వారే చీకట్లో జీవం పోసుకుంటున్నారు అని గురువు అనడంతో ఆ మాటలు తమకు ఎవరికి అర్థం కాలేవు అని అంటారు. దాంతో గాయత్రి పాప బరువుగా ఉందా తేలికగా ఉందా అని సుమన ను అడగటంతో ఈరోజు తేలికగానే ఉంది అని అంటుంది సుమన.


దాంతో గురువు తనని మోస్తుంది నువ్వు కాదని గురువు అనడంతో సంబంధం లేని మాటలు మాట్లాడకండి అంటూ గాయత్రిని విశాలికిచ్చి అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది సుమన. దాంతో విశాల్ గాయత్రిని ఎత్తుకుంది పామే కదా అనడంతో అవునని అంటాడు గురువు. ఇక ఇందాక చెప్పిన మాట అర్థం కాలేదు అనటంతో.. వెంటనే గురువు శుభ ముహూర్తాన్ని మీకే తెలుస్తుంది దానిని జీర్ణించుకునే శక్తి మీకు ఉండాలని చెప్పి అక్కడి నుండి వెళ్తాడు.


మరోవైపు తిలోత్తమా ఫోన్ మాట్లాడుతూ ఉండగా సుమన వచ్చి గురువు చెప్పిన మాటలు చెప్పగా మధ్యలో హాసిని వెటకరం చేస్తూ ఉంటుంది. ఇక గురువు చెప్పిన మాటల్లో ఏదో అర్థం ఉంది అని తిలోత్తమా అనటంతో హాసిని తనకేం అర్థం అవ్వట్లేదు అని అక్కడి నుంచి వెళ్తుంది. ఇక నయని దగ్గరికి పావని మూర్తి దంపతులు రాగా ఆయన భార్య యాత్రను తిరిగి వచ్చినందుకు ప్రసాదం పంచి పెడుతుంది.


తన మొక్కులతో పాటు నయని మొక్కులను కూడా మొక్కాను అని అంటుంది. ఇక అప్పుడే విక్రాంత్ వచ్చి ఆఫీస్ విషయం గురించి చెప్పి ఇప్పుడే బయలుదేరుదాం అని నయని తో అనటంతో వద్దులే సుమన దగ్గర ఉండాలి నువ్వు నేను వెళ్తాను అని అంటుంది. ఇక అప్పుడే పావని మూర్తి సుమన గర్భంలో ఉన్న విషయం గురించి చర్చ చేస్తూ నిజం చెప్పబోతుంటే అత్తయ్య తాళి తెగుతుంది అని విక్రాంత్ అంటాడు.


దాంతో అవి షాక్ అయి ఏం జరిగింది అని నయని తో అనటంతో ఆ విషయం డెలివరీ అయ్యేవరకు గురువుగారు ఎవరికి చెప్పొద్దన్నారు అని అంటుంది. ఇక పరోక్షంగా అయినా చెప్పు అనటంతో నాతో రా నీకు విషయాన్ని నీకు మరోలా చెబుతాను అని అక్కడి నుంచి బయలుదేరుతారు. ఆ తర్వాత ఇంట్లో వాళ్లంతా గురువు రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు.


ఇక అప్పుడే గురువు, డమ్మక్క రాగా వారితో పాటు ఒక పెట్టెను తీసుకొని వస్తారు. ఇక ఆ పెట్టెలో గాజు ముక్క లాగా ఉన్న చంద్రకాంతమనను చూసి సుమన తనకు కావాలి అంటూ అరుస్తుంది. అప్పుడే సుమన గొంతు మగవాడిలా మారిపోతుంది. దానితో గురువు ఆ చంద్రకాంతమును సుమన నుదుటిలో పెట్టమని అంటాడు. కానీ సుమన పాపిటల్లో పెట్టమని అంటుంది. అదంతా చూసి ఇంట్లో వాళ్లంతా భయపడుతుంటారు.


ఇక విక్రాంత్ పాపిట్లో పెట్టడంతో సుమన స్పృహ కోల్పోతుంది. దెబ్బకు పావనమూర్తి కూడా కింద పడిపోతాడు. వెంటనే ఆ చంద్రకాంతమని పెట్టెలో పెడుతాడు. సుమన, పావని మూర్తిని ఎంత పిలిచినా కూడా వాళ్ళిద్దరూ లేవక పోయేసరికి వారిని రూమ్ లోకి తీసుకెళ్తారు. ఇక తిలోత్తమా మణి గురించి అడగటంతో.. దాని వెనుక ఉన్న రహస్యం చెబుతాడు గురువు.


ఇక ఆ మణికి, సుమనకు సంబంధం ఉందో లేదో అని పరీక్షించడానికి వచ్చాను అని అంటాడు. దానితో వాళ్ళు షాక్ అవుతారు. తన అంచనా నిజం అయ్యిందని తను డెలివరీ అయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలి అని చెబుతాడు. అక్కడే వదిలేసిన చంద్రకాంతని చూసి భయపడుతుంటారు. ఇక స్పృహలో నుంచి బయటికి వచ్చిన సుమన ఏదో వెతుకుతూ ఉండగా అప్పుడే తన పిన్ని వాళ్ళు వచ్చి ఏం వెతుకుతున్నావు అని అడుగుతుంది.


దాంతో ఏం కావాలి మీకు అంటూ కోపంగా అరుస్తుంది సుమన. ఇక తనకు పెట్టె కావాలని అంటుంది. అప్పుడే నయని వచ్చి ఏం కావాలని అడగడంతో పెట్టె కావాలని అంటుంది. దానిని నేను భద్రంగా దాచాను అని అనటంతో వెంటనే పావని మూర్తి చంద్రకాంతం ఉన్న పెట్టెనా అనటంతా అవును అంటుంది సుమన. వెంటనే నెయ్యిని తనపై కోపంగా అరుస్తుంది.


Also Read: Krishnamma kalipindi iddarini July 3rd: బోల్తా కొట్టిన సౌదామిని ప్లాన్.. తల్లితో చెప్పుకుంటూ కోపంతో రగిలిపోతున్న అఖిల?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial