Krishnamma kalipindi iddarini July 10th: ఇక మెహేంది ఫంక్షన్ స్టార్ట్ అవుతుండగా సౌదామిని వచ్చి ఆపండి అంటూ అందరికి షాక్ ఇస్తుంది. ఏం జరిగింది అని తన అన్నయ్య అడగటంతో వదిన ఇంకా ఏ కాలంలో ఉంది.. అన్ని పాత పద్ధతులే అంటూ వెటకారం చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. వెంటనే సునంద నేరుగా విషయం ఏంటో చెప్పు అనటంతో.. ఈ కాలంలో కాబోయే భార్యకు మెహేంది పెడుతున్నారు.. ఇవన్నీ ఒక తీపి జ్ఞాపకాలుగా మల్చుకోవటానికి ఇలా చేస్తున్నారు అని అంటుంది.


దాంతో తన అమ్మ వాళ్ళు ఈశ్వర్ ఎలా పెడతాడో తెలియదా.. తెలిసి కూడా అలా ఎందుకు చేస్తున్నావు అని అడుగుతారు. నేను చెప్పిన దాంట్లో తప్పేముంది ఇప్పుడు అందరూ అలాగే పెట్టుకుంటున్నారు కదా అని వెటకారంగా మాట్లాడుతుంది. సునంద కూడా తన మనసులో ఈశ్వర్ ని బాధ పెట్టాలి అని సౌదామిని అనుకుందని ఈశ్వర్ బాధపడుతున్నాడు అని అనుకుంటుంది. వెంటనే ఈ వెటకారం మాటలు ఆపమని అంటుంది.


నేనేం వెటకారం చేశాను అని అంటుంది. ఇక ఈశ్వర్ కి చూపు లేదు కదా అందుకే వెయ్యలేడేమో కదా అంటూ పదేపదే ఈశ్వర్ కి చూపులేదు అని గుర్తుకు చేస్తుంది. దాంతో ఆనందయ్య ఎందుకు అండి పదేపదే అలా అంటున్నారు అని సమర్థించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక సునంద కూడా తనను ఆపమని అంటుంది. వెంటనే ఈశ్వర్ నేను గౌరీ గారికి మెహేంది పెడతాను అని అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు.


దాంతో ఈశ్వర్ కోన్ తీసుకొని గౌరీకి పెడతాడు. ఇక సునంద ఎవరో మాటలు పట్టించుకోని నువ్వు ఎలా పెడతావ్ అంటావు నాన్న అనడంతో.. ఎవరో గురించి కాదు గౌరీ గారికి ఒక అందమైన జ్ఞాపకాన్ని అందివ్వాలి అని నేనే పెట్టాలనుకుంటున్నాను అని అనటంతో అందరూ సంతోషపడతారు. ఇక గౌరీ కి ఈశ్వర్ గోరింటాకు పెడుతూ ఉండగా.. వెంటనే అఖిల కూడా ఆదిత్యతో పెట్టించుకోవాలని అనుకుంటుంది.


ఇక ఆదిత్యతో గోరింటాకు పెట్టమని అనడంతో వెంటనే ఆదిత్య తనకు గోరింటాకు పెట్టడం రాదు అనటంతో.. మీ అన్నయ్య మా అక్కకు ఎలా పెడుతున్నాడో నువ్వు కూడా అలాగే పెట్టు ఏం పరవాలేదు అని అంటుంది. ఇక గోరింటాకు పెట్టడం పూర్తయిన తర్వాత. వెంటనే సౌదామిని కూతురు కోడి గెలికినట్టు గెలకావ్ అదేం డిజైన్ అని ఈశ్వర్ తో అంటుంది.


దాంతో ఈశ్వర్ తన పెట్టిన డిజైన్ గురించి తమ మధ్య ఉన్న ప్రేమతో వివరించటంతో అందరూ ఫిదా అవుతారు. కానీ సౌదామిని వాళ్లకు బాగా మండుతుంది. ఆ తర్వాత ఈశ్వర్ పెట్టిన గోరింటాకు చూసి గౌరీ తెగ మురిసిపోతూ ఉంటుంది. ఈశ్వర్ గురించి ఆలోచనలో మునిగిపోతుంది. మరోవైపు ఈశ్వర్ కూడా గౌరీని తలుచుకుంటూ ఉంటాడు.


ఇక ఇద్దరు ఒకరికొకరు ఇప్పుడు ఏం చేస్తున్నారో అని బ్యాక్ గ్రౌండ్ లో ఒక పాట కూడా వేసుకుంటారు. ఆ తర్వాత అఖిల.. ఈశ్వర్ గౌరీ పై ఉన్న ప్రేమ గురించి చెప్పిన మాటలు గుర్తుకు చేసుకొని మండి పడుతుంది. గౌరీ సంతోషంగా ఉందని జీర్ణించుకోలేకపోతోంది. ఏదో ఒకటి చేసి గౌరీని బాధపెట్టాలి అని అనుకుంటుంది.


Also Read: Trinayani July 10th: ‘త్రినయని’ సీరియల్: సుమనకు పాము గండం, విశాలాక్షి తలకు ఢీకొట్టిన తిలోత్తమా?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial