Rangula Ratnam July 4th: రఘు, సీత వర్షను చూసి ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఇక వర్ష తనకేం జరగలేదు అంటూ కవర్ చేస్తూ ఉంటుంది. పక్కనే ఉన్న ఆకాష్ ఇక ఆపు వర్ష నిజం చెప్పేసాను అని అంటాడు. దాంతో నిజం తెలిసింది అని చాలా బాధపడుతుంది. మీరు ఇలా బాధపడతారని మీకు ఈ విషయం తెలియకుండా జాగ్రత్తపడ్డాను అని.. మీరు ఇలా ఉంటే నేను తట్టుకోలేను అని బాధపడుతూ మాట్లాడుతుంది.
ఇక రఘు ఇక ఇలా చూస్తూ ఊరుకోలేను నిన్ను ఈ ప్రపంచంలో ఏ హాస్పిటల్ లో నైనా డబ్బు పెట్టి చూపిస్తాను అనటంతో.. దాంతో వర్ష తన జబ్బుకు మందు లేదు అని చెబుతూ బాధపడుతూ ఉంటుంది. మరోవైపు జానకి బట్టలు సర్దుతూ ఉండగా ఆ సమయంలో తనకు తాళిబొట్టు కనిపించడంతో అది ఎవరిది అని వచ్చి తన భర్త సూర్యంను అడుగుతుంది. ఇక సూర్యం.. గతంలో వర్ష తన అత్తారింట్లో పరిస్థితులు బాలేవు అని తాళిబొట్టును తాకట్టు పెట్టడంతో తిరిగి ఆ వ్యక్తికి డబ్బులు ఇచ్చి తాళిబొట్టు తెచ్చాము అని.. తిరిగి ఆ తాళిబొట్టు వర్షకు ఇవ్వాలి అంటే కన్న తండ్రి సహాయాన్ని కాదనుకున్న తను మనం సహాయం చేస్తే ఒప్పుకుంటుందో లేదో అని అనుకున్నాము అని అంటాడు.
దాంతో జానకి ఇప్పుడు తన అత్తారింటి పరిస్థితులు మారాయి కాబట్టి ఇప్పుడు అందరూ బాగున్నారు కాబట్టి మంచి రోజు చూసి వెళ్లి తాళిబొట్టు ఇస్తే సంతోషంగా తీసుకుంటుంది అని అనటంతో దానికి సూర్యం కూడా సరే అని ఒప్పుకుంటాడు. మరోవైపు రేఖ దగ్గరికి ముగ్గురు మహిళా మండలి సభ్యులు వచ్చి తనను తమ మహిళా మండలికి అధిపతిగా ఉండమని రేఖ దగ్గర 15 లక్షలు తీసుకొని వెళ్తారు. ఇక రేఖ డబ్బు ఉంటే పోస్టులు అవంతటావే దగ్గరికి వస్తాయని తెగ మురిసిపోతుంది.
ఇక స్వప్న సిద్దుతో కలిసి తన ఫ్రెండ్ ఇంటి దగ్గరికి వెళ్ళగా సిద్దు తను లోపలికి రాను అని అంటాడు. కానీ స్వప్న తన ఫ్రెండు అలాంటిది కాదు అని తను చాలా మంచిది అని తనకు సహాయం చేస్తుందని అంటుంది.
సిద్దు మాత్రం డబ్బులు లేని వాళ్ళను తక్కువగా చూస్తుంటారు వద్దు అని అంటున్న కూడా వినిపించుకోకుండా స్వప్న సిద్దు ని లోపలికి బలవంతంగా తీసుకొని వెళుతుంది. ఇక తన ఫ్రెండ్ రీచా ను పిలవడంతో తను రావడం రావడమే వెటకారం చేస్తూ వస్తుంది. మీరా అన్నట్లుగా మాట్లాడుతుంది. అదే సమయంలో ఇంట్లో పని చేసే ఆవిడ టీ తీసుకొని రావటంతో వెంటనే రీచా తనని కొడుతుంది.
ఇక్కడ గెస్ట్ లెవరో ముష్టి వాళ్ళు ఎవరో తెలియదా.. వీళ్లు తాగిన కప్పులో మళ్లీ మేము తాగాలా అంటూ తనపై అరిచి తనని లోపలికి పంపిస్తుంది. ఇక అక్కడ అవమానం జరిగింది అని సిద్దు స్వప్న కి చెప్పి వెళ్ళిపోదాం అని అక్కడి నుంచి వెళ్తాడు. ఇక స్వప్న తన ఫ్రెండ్ తో ఇలా చేస్తావని అనుకోలేదు అనటంతో తిరిగి తన ఫ్రెండ్ గతంలో నువ్వే కదా పేదవాళ్లు బతుకు బతికే బదులు చావడం బెటర్ అని డైలాగ్ కొడుతుంది.
దాంతో స్వప్న సిద్దు దగ్గరికి వెళ్లి చనిపోదాం అని అనటంతో వెంటనే సిద్ధు ఇతరులు సహాయం చేయకపోతే చనిపోవడం మార్గం కాదు అని.. కష్టపడి బతకాలి అని అంటాడు. గతంలో తన అన్నయ్య రఘు ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు బాగా కష్టపడి ఇప్పుడు ఒక పొజిషన్ కి వచ్చాడు అని అంటాడు. ఇప్పుడు నేను కూడా కష్టం చేయడానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు కూడా నాతో ఉంటావా అని అంటాడు.
తరువాయి భాగంలో స్వప్న, సిద్దు ఒకచోట కూర్చోగా ఆ సమయంలో తమ ముందు నుండి పూర్ణ శంకర్ ప్రసాద్ ను తీసుకొని వెళ్తుంది. ఇక అది చూసి సిద్దు డాడీ పక్కన అర్చన ఉంది ఏంటి అని అనుకుంటాడు. అంటే అన్నయ్య చెప్పినట్లు అర్చననే తన తల్లి అని.. ఏ భర్త కైనా కష్టాల్లో తోడుగా భార్య ఉంటుంది కాబట్టి తనే తన తల్లి అనుకొని నిజం తెలుసుకోవడానికి వెళ్తాడు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial