Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ డబ్బు ఇవ్వనని చెప్పిందని రామ్ సీతకు చెప్పి క్షమాపణ చెప్తాడు. ఉదయం అందరూ హాల్‌లో ఉంటారు. మహాలక్ష్మీ సూట్ కేస్‌తో వస్తుంది. మహాలక్ష్మీ రామ్, సీతని పిలుస్తుంది. రామ్ చిరాకుగా ఏంటి పిన్ని ఎందుకు పిలిచారని అడుగుతాడు.
మహాలక్ష్మీ: నిన్ను నువ్వు వచ్చి డబ్బు అడిగావ్ కదా.
రామ్: మీరు ఇవ్వను అన్నారు కదా.
మహాలక్ష్మీ: అప్పుడేదో మూడ్‌లో ఉండి అలా అన్నాను రామ్. తర్వాత నైట్ అంతా ఆలోచించాను. ఎంతైనా మధు మన సీతకి అక్క కదా తనకి సాయం చేస్తే మంచిదనిపించింది. అందుకే సూర్య ఆపరేషన్‌కి అవసరమైనా డబ్బు ఇస్తున్నాను. వెళ్లి సూర్యకి ఆపరేషన్ చేయించండి.
రామ్: నిజంగా డబ్బులు ఇస్తున్నారా పిన్ని. నైట్ మీరు ఇవ్వనని చెప్పడంతో చాలా ఫీలయ్యాను. సీత కూడా బాధ పడింది.
సీత: అవును ఇద్దరం డబ్బులు గురించి ఆలోచిస్తూ నైట్ అంతా ఉండిపోయాం.
మహాలక్ష్మీ: ఇకపై మీకు ఆ శ్రమ అవసరం లేదు. ఆ డబ్బుతో సూర్యకి ఆపరేషన్ చేయించండి.
మహాలక్ష్మీని అందరూ పొగిడేస్తారు. వెంటనే ఇద్దరినీ బయల్దేరమని చెప్తుంది. సీత, రామ్ ఇద్దరూ డబ్బు తీసుకొని వెళ్తారు. అర్చన మహాలక్ష్మీని తీసుకొని అర్జెంటుగా మాట్లాడాలని తీసుకెళ్తుంది. సీతకి అంత డబ్బు ఎందుకు ఇచ్చావ్ అని అర్చన మహాని అడుగుతుంది. దాంతో మహాలక్ష్మీ రాత్రి సీత వార్నింగ్ ఇచ్చిందని చెప్తుంది. సీత తన గదికి వచ్చి యాక్సిడెంట్ చేయించింది మీరే అని నాకు తెలుసని చెప్పిందని అంటుంది. నీతో నేను చెప్పిన విషయం సీత వీడియో తీసిందని చెప్తుంది. ఆ వీడియో చూపించి నన్ను బ్లాక్ మెయిల్ చేసిందని చెప్తుంది. అది కూడా రామ్ ఫొన్‌లో రికార్డ్ చేసిందని చెప్తుంది. రామ్ ఫోన్‌లో ఎప్పుడైనా వీడియో చేయించొచ్చని అప్పుడు అరెస్ట్ చేయించొచ్చని లేదంటే మెడ పట్టుకొని బయటకు గెంటేయొచ్చని సీత అంటుంది. సూర్యకి యాక్సిడెంట్ చేయించని మహాలక్ష్మీకే డబ్బు ఇమ్మని చెప్తుంది.
మరోవైపు శివకృష్ణ మధు, సూర్యల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. లలిత వచ్చి డబ్బు గురించి ప్రయత్నించారా అని అంటే తెలిసిన వాళ్లు ఎవరూ సాయం చేయడం లేదని ఇళ్లు తాకట్టు పెడితే వారంలో డబ్బు ఇస్తామని అంటున్నారని చెప్తాడు. ఇంతలో మధు, సూర్యలు శివకృష్ణ ఇంటికి వస్తారు. సీత ఫోన్ చేసి ఇద్దరినీ అర్జెంటుగా రమ్మని చెప్పిందని మధు వాళ్లతో చెప్తుంది. ఇంతలో సీత, రామ్‌లు సూట్ కేస్‌తో వస్తారు.
శివకృష్ణ: ఫోన్ చేసి అక్కా బావలను రమ్మన్నావంటే ఏంటి సీత.
సీత: కంగారు పడాల్సిన పని లేదు నాన్న గుడ్ న్యూసే.
రామ్: సూర్య కాలు ఆపరేషన్‌కి డబ్బు తీసుకొచ్చాం మామయ్య.
సీత: సారీ అక్క డబ్బు సర్దుబాటుకి కాస్త ఆలస్యం అయింది. ఇందులో పది లక్షలు ఉన్నాయి బావకి ఆపరేషన్ చేయించు.
మధు ఎమోషనల్ అయి సీతని హగ్ చేసుకుంటుంది. నేను నిన్ను ఎన్నో సార్లు ఇబ్బంది పెడితే నువ్వు మాత్రం నా జీవితం కోసం ఇంత పెద్ద సాయం చేశావని అంటుంది. దానికి సీత మనం అక్కాచెల్లెళ్లం సూర్య బావకి బాగు అయితే మనం అందరూ సంతోషంగా ఉంటాం అని అంటుంది. సూర్య కూడా రామ్ సీతలకు సారీ చెప్పి సాయం చేసినందుకు థ్యాంక్స్ చెప్తాడు. ఇక డబ్బు చిన్నగా ఇస్తామని అంటే రామ్ అదేమీ అప్పు కాదని ఇవ్వాల్సిన అవసరం లేదని అంటాడు. ఇక శివకృష్ణ చాటుగా సీతతో మాట్లాడుతాడు. ఇంత డబ్బు ఎక్కడిది అంటే మా అత్తయ్యని బెదిరించానని జరిగిందంతా చెప్తుంది. దాతె ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.