Trinayani Serial Today Episode విశాలాక్షి హాల్‌లో ధ్యానంలో ఉంటే అక్కడికి సుమన, తిలోత్తమ  తాము తెచ్చిన కెమికల్ కలిపిన నీరు తీసుకొని వస్తారు. ఇంతలో అత్తాకోడళ్లు ఇద్దరూ ఓం  నమఃశివాయ అనుకుంటూ వస్తారు. తిలోత్తమ, సుమన అలా అనే సరికి అందరూ షాక్ అయి కారణం అడుగుతారు. దాంతో ఇద్దరం శివాలయానికి వెళ్లి వచ్చాం అని తిలోత్తమ చెప్తుంది.  


నయని: నన్ను పిలిస్తే నేను వచ్చేదాన్ని కదా చెల్లి.
సుమన: ఎక్కడక్కా నువ్వు ఇంటి పనుల్లో బిజీగా ఉన్నావ్ ఇక ఈ గారడీ పిల్ల వస్తే అది వండాలి ఇది వండాలి అని వంట గదిలోనే ఉండిపోతావ్.
విశాలాక్షి: ఏం తెచ్చారో అడగండి.
దురంధర: తీర్థం తీసుకొచ్చారు అనుకుంటా.
తిలోత్తమ: ఇది తీర్థం కాదు మోక్ష రసం. 
సుమన: గుడిలో కేదార్‌నాథ్ స్వామి పూజ చేశారు పంతులు గారు ఈ రసం ఇచ్చి కుటుంబ సభ్యుల మీద చల్లమన్నారు. 
విశాలాక్షి: నా కోసమే కదా తిలోత్తమమ్మ తీసుకొచ్చింది. చల్లకుండా ఎలా ఉంటుంది. 


తిలోత్తమ ఆ రసాన్ని విశాలాక్షి మీద చల్లడానికి వెళ్తుంది. ఇంతలో గాయత్రీ పాప అడ్డంగా నిల్చొంటుంది. దాంతో అందరూ ముందు పాప మీద చిలకరించమని అంటారు. దాంతో విశాలాక్షి గాయత్రీ పాపని తీసుకొని తన ఒడిలో కూర్చొపెట్టుకొని మా ఇద్దరి మీద చల్లమని అంటుంది. తిలోత్తమ ఓం నమఃశివాయ అంటూ చిల్లుతుంది. అయితే సుమన, వల్లభ, తిలోత్తమల ముఖం మీద రక్తం చిమ్ముతుంది. దాంతో ముగ్గురు ఒకరి ముఖం ఒకరు చూసుకొని బిత్తర పోతారు. అందరూ షాక్ అయిపోతారు. 


నయని: మీ మీద ఎవరో రక్తం చిలకరించినట్లు అలా అయిందేంటి. 
విక్రాంత్: అమ్మా విశాలాక్షి ఇది నీ గారడీఏనా
విశాలాక్షి: మోక్ష రసం అని తీసుకొచ్చారు కానీ మనసులో చెడు ఉద్దేశంతో  ఉన్నట్లున్నారు అందుకే అలా అయింది. నా మీద చిలకరించాలి అనుకున్నవి వాళ్ల మీద పడ్డాయి. ఓం నమఃశివాయ అని శివుడిని తలచుకోవడం వల్ల ఏం కాలేదు లేదంటే నెత్తురు దెబ్బలు తగిలేవి. ఏం చేయాలి అనుకున్నారో చెప్పుకోలేకపోతున్నారు. ఒకరి ముఖం మరొకరు కడుక్కుంటే తప్ప ఈ మరకలు పోవు. 
సుమన: పరువు తీయాలని చూసి మళ్లీ దెబ్బతిన్నాం. 



విశాలాక్షి నయని చేతికి కుంకుమ ఇచ్చి అవసరానికి ఉపయోగపడుతుందని చెప్తుంది. రాత్రి విక్రాంత్ మేడ మీద ఉంటే అక్కడికి సుమన వస్తుంది. విక్రాంత్ని మాటలతో రెచ్చ గొట్టడం వల్ల విక్రాంత్ కోపంతో పెద్దబొట్టమ్మతో నువ్వు కలిసి చేసిన పాపిష్టి పని వల్లే విశాల్‌ బ్రోకి ఈ పరిస్థితి వచ్చిందని అంటాడు. దానికి సుమన మా వల్లే మణికాంత గిరి గురించి కూడా తెలిసిందని అంటుంది. విశాలాక్షి ఇచ్చిన కుంకుమ పెట్టుకొని నయని వెళ్తే మధ్యలో మూర్ఛ వచ్చి పడిపోతుందని సుమన అంటుంది.  దానికి విక్రాంత్ మా అమ్మలా నీలా విశాలాక్షి కాదని మంచిదని అంటాడు. 


విశాల్ ఆరు బయట ఉంటే నయని ఇక్కడేం చేస్తున్నారని అంటుంది. సూర్య నమస్కారాలు చేయడం అలవాటని ఇప్పుడు చేయలేక ఇక్కడ నిల్చొన్నానని అంటాడు విశాల్. దాంతో నయని విశాలాక్షి ఇచ్చిన కుంకుమ విశాల్‌కి పెట్టి మీకు అమ్మవారు సాయం చేస్తుందని అంటుంది. పౌర్ణమికి మణికాంత ప్రాంతానికి వెళ్లి భుజంగమణి తీసుకొస్తానని అంటుంది నయని. ఇక కుంకుమ తన కొంగున కట్టుకొని విశాల్‌ని ముందుకి తిరగమని తన వెనక ఉండి విశాల్ రెండు చేతులు జోడించి సూర్య నమస్కారాలు చేయిస్తుంది. 


మరోవైపు తిలోత్తమ, వల్లభలు గజగండ దగ్గరకు వెళ్తారు. భుజంగమణి గురించి గజగండకు చెప్తారు. నయని మళ్లీ పౌర్ణమికి మణికాంత ప్రాంతానికి వెళ్తుందని చెప్తాడు. గజగండ కూడా షాక్ అయిపోతాడు. దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మనీషాతోనే పూజలో కూర్చొంటానని మొండికేసిన మిత్ర.. పాము పరీక్షలో ఎవరు నెగ్గుతారో!