Seethe Ramudi Katnam Serial Today Episode సీతని పొగుడుతూ మహాలక్ష్మీ మీడియాతో మాట్లాడుతుంది. తన అత్తకు థ్యాంక్స్ చెప్పి ఇక బయల్దేరండని అంటుంది. దానికి అర్చన, గిరిధర్‌లు మాతో పని అయిపోయింది ఇక వెళ్లండని చెప్పినట్లు ఉందని అంటారు. ఇక మహాలక్ష్మీ వాళ్లు బయల్దేరుతారు. రామ్‌ని పిలిస్తే కాసేపు షాప్‌లో ఉండి వస్తానని అంటాడు. 


మహాలక్ష్మీ: రామ్ చెప్పాడని తప్పక వచ్చాం కానీ సీత మనతో ఇష్టం వచ్చినట్లు ఆడుకుంది. అనవసరంగా వచ్చాం రాకుండా ఉండాల్సింది. 
జనార్థన్: చాలు ఆపండి. ఇదంతా మీ వల్లే వచ్చింది సీత ఇలా తయారవ్వడానికి కారణం మీరే. తన మానాన తనని వదిలేసి ఉంటే ఇంట్లో సీత మన వీధిలో వాళ్ల చీరలు కుట్టుకుంటూ ఉండేది. అనవసరంగా తనని రెచ్చగొట్టి ఇంత వరకు తీసుకొచ్చారు.
గిరిధర్: అవును అన్నయ్య తన స్పీడ్ చూస్తుంటే సీత ఇలాంటివి పది పెట్టి వ్యాపారంలో మనకు పోటీ వచ్చేలా ఉంది. 


సీతకు అంత సీన్ లేదని మహాలక్ష్మీ, అర్చన అంటారు. దాంతో జనార్థన్ ఇద్దరినీ తిడతాడు. సీత జోలికి వెళ్లొద్దని చెప్తాడు. సీత, రామ్‌లు సరదాగా మాట్లాడుకుంటారు. సీతతో రామ్ మా ఆవిడకు ఓ మంచి చీర కొనాలి అనుకుంటున్నా మంచి చీర చూపించమని అంటాడు. సీత మీ భార్య గురించి చెప్తే చీర చూపిస్తాను అంటుంది. సీతని రామ్ మీరే బాలేదు అంటూనే మా ఆవిడ చాలా అందంగా ఉంటుందని అంటాడు. ఇక సీత రామ్‌లు గిల్లిగజ్జాల తర్వాత రామ్ ఓ చీర తీసి అది మా ఆవిడకు బాగుంటుందని అంటాడు. సీత రామ్ ఇద్దరూ ఒకరి మీద ఒకరు పడిపోతారు. రామ్ అప్పుడు సీతని హగ్ చేసుకుంటాడు. రామ్‌తో సీత ఇవన్నీ ఇంటి దగ్గరంటుంది. ఇక రామ్ ఒక ముద్దు పెడితే వెళ్లిపోతా లేదంటే సాయంత్రం వరకు ఇక్కడే ఉంటానని అంటాడు. దాంతో సీత రామ్‌లు ఒకరికి ఒకరు ముద్దు పెట్టుకుంటారు.



సీత ఇంటికి వచ్చిన తర్వాత విద్యాదేవి దగ్గరకు వెళ్తుంది. జరిగిందా అంతా చెప్తుంది. టీచర్‌కి సారీ ఇస్తుంది. సీతని విద్యాదేవి హగ్ చేసుకొని మీ అత్తమ్మ స్థానంలో నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని అంటుంది. ఇక సీతకు చీర కోసం డబ్బులు ఇస్తుంది.  మరోవైపు మధు తల్లిదండ్రుల దగ్గరకు వస్తుంది. సూర్య ఆపరేషన్ గురించి చెప్తుంది. ఆపరేషన్‌కి పదిలక్షలు అవుతుందని చెప్తుంది. సీతని అడిగాను అని సర్దుతాను అని చెప్పిన సీత ఇంత వరకు సర్దలేకపోయిందని అంటుంది మధు. మిమల్ని కూడా అడిగి ఇబ్బంది పెట్టలేక మీ దగ్గర ఆ ప్రస్తావన తీసుకురాలేక ఇప్పటి వరకు తీసుకురాలేదు కానీ ఇప్పుడు రెండు రోజుల్లో డబ్బులు కావాలని అంటుంది. 


ఇప్పటికిప్పుడు డబ్బులు అంటే ఎలా అని మధుతో తల్లి అంటుంది. వీలైతే డబ్బు సర్దగలరా నాన్న అని అంటుంది. ప్రస్తుతం తన దగ్గర అంత డబ్బు లేదని శివకృష్ణ ఫీలవుతాడు. ఏదో ఒకటి చేసి సర్దుదామని లేదంటే ఇళ్లు తాకట్టు పెడదామని శివకృష్ణ అంటాడు. దానికి మధు వద్దని అంటుంది. నీ కంటే ఏదీ ఎక్కువ కాదని మధుతో తల్లిదండ్రులు చెప్తారు. మధుతో ధైర్యంగా ఉండమని చెప్తారు. మధు ఇంటికి వెళ్తూ తోటి కోడలు జలజ మాటలు తలచుకుంటూ సీతకు ఫోన్ చేస్తుంది. మహాలక్ష్మీ కాల్ లిఫ్ట్ చేస్తుంది. సీతకి ఫోన్ ఇవ్వమని మధు చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.   


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కాశీని చంపేస్తానని స్వప్నని బెదిరించిన శ్రీధర్.. జ్యోత్స్న మీద చేయి ఎత్తిన దీప!