Seethe Ramudi Katnam Serial Today Episode సుమతిని తీసుకొస్తానని సీత మహాలక్ష్మీని తన వ్యాన్ దగ్గరకు తీసుకెళ్తుంది. అందులో సర్‌ఫ్రైజ్ ఉందని మహాలక్ష్మీకి చెప్తుంది. సీత చప్పట్లు కొట్టగానే విద్యాదేవి ఎంట్రీ ఇస్తుంది. విద్యాదేవి అలియాస్ సుమతిని చూసి మహాలక్ష్మీ షాక్ అయిపోతుంది. 


మహాలక్ష్మీ: సుమతిని చంపిన ఈ హంతకురాలు ఇక్కడేం చేస్తుంది పోలీసుల నుంచి తప్పించుకొని నీ వ్యాన్‌లో తల దాచుకుందా.
సీత: మీరు రెండు విషయాలు తెలుసుకోవాలి అత్తయ్య. ఒకటి ఈ విద్యాదేవి టీచర్ హంతకురాలు కాదు. రెండు ఈవిడ అసలు విద్యాదేవినే కాదు మా అత్తమ్మ సుమతి. అత్తమ్మ మిమల్ని పెళ్లి మండపానికి తీసుకెళ్లడానికి మీ స్నేహితురాలు మహాలక్ష్మీ వచ్చారు రండి.
విద్యాదేవి: ఏంటి మహాలక్ష్మీ షాక్ అయ్యావా.
మహాలక్ష్మీ: ఈ నేరస్తురాలిని తీసుకొచ్చి చివరి నిమిషంలో తానే సుమతి అని చెప్పి పెళ్లి చేయాలి అనుకుంటున్నావా సీతఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి ఈమెని చంపిస్తాను.
సీత: అతిగా ఆవేశ పడొద్దు అత్త. ఈ విద్యాదేవి టీచరే సుమతి అని మీకు తెలుసు. మీకు తెలుసు అన్న విషయం నాకు  తెలుసు. 
మహాలక్ష్మీ: నాకు సుమతి గురించి తెలుసు ఈ విద్యాదేవి సుమతి కాదు హంతకురాలు. 
సీత: మండపంలోకి రండి అత్తయ్య రుజువులు చూపిస్తాను. అత్తమ్మ నీ గురించి ఈ రోజు అందరికీ నిజం తెలుస్తుంది. అని మహాలక్ష్మీని, విద్యాదేవిని తీసుకొని మండపంలోకి  వెళ్తుంది. అందరూ చూసి షాక్ అయిపోతారు. 
రామ్: మా అమ్మని తీసుకొస్తా అని చెప్పి ఈ హంతకురాలిని తీసుకొచ్చావ్ ఏంటి సీత. 
సీత: ఈమె హంతకురాలు కాదు ఎవరు ఎవర్ని చంపలేదు తన నిర్దోశి అని నిరూపించుకోవడానికి పారిపోయింది. సుమతి ఎవరో ఎక్కడుందో ఎలా వస్తుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు కదా ఆ సుమతి ఎవరో కాదు ఈవిడే.
జనార్థన్: ఈవిడ సుమతి ఏంటి సీత ఈవిడ హంతకురాలు కదా.
గిరిధర్: నువ్వు ఏదో చేస్తావ్ అంటే ఇలా ఈమెను తీసుకొచ్చి నాటకం ఆడుతావా.
మహాలక్ష్మీ: సీత ఈమెను తన వ్యాన్లో ఉంచడం నేను రాత్రే చూశా సీత ఆమెను తీసుకొచ్చి నాటకం ఆడుతుంది.
శివకృష్ణ: ఆవిడే మీ అమ్మ రామ్ నా తోడ పుట్టిన చెల్లి.
ప్రీతి: ఏంటి మామయ్య నువ్వు అనేది
లలిత: అవును ప్రీతి తినే మీ అమ్మ రామ్‌ని కాపాడబోయి తన రూపం పొగొట్టుకుంది.  


మహాలక్ష్మీ సీత నాటకం ఆడుతుందని అందుకు తన తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తుందని అంటుంది. అందరూ సీతని సాక్ష్యాలు అడుగుతారు. ఇక మహాలక్ష్మీ పోలీసులకు ఫోన్ చేస్తానని ఫోన్ తీస్తుంది. దాంతో విద్యాదేవి మహాలక్ష్మీని ఆపి నేనే సుమతిని అని చెప్తుంది. నా రూపం మారిపోయిందని నేను చెప్తే నమ్మరని తెలుసని సీతకి సాక్ష్యాలు చూపించమని అంటుంది. ఇక సీత డీఎన్‌ఏ టెస్ట్ చేసి రక్తసంబంధాల గురించి తెలుసుకోవచ్చని చెప్పి డాక్టర్‌ని పిలుస్తుంది. గతంలో విద్యాదేవి తానే సుమతి అని చెప్పడంతో అనుమానంతో గతంలోనే ప్రీతి తల వెంట్రుకలు తీసుకొని డాక్టర్‌కి పంపించానని, ఇక రామ్ గోళ్లు కట్ చేసి వాటిని కూడా డాక్టర్‌కి పంపాపని చెప్తుంది. ఇక డాక్టర్ రామ్,సీతల డీఎన్‌ఏలు విద్యాదేవి డీఎన్‌ఏ మ్యాచ్ అయ్యావని చెప్తారు. రామ్, ప్రీతిలు ఇద్దరూ విద్యాదేవి పిల్లలే అని రిపోర్ట్ వచ్చాయని అందరికీ రిపోర్ట్ చూపిస్తారు. 


మహాలక్ష్మీ కూడా చూసి షాక్ అయిపోతుంది. విద్యాదేవి దగ్గరకు వెళ్లి సారీ సుమతి అని చెప్తుంది. నీ రూపం మారిపోవడంతో నువ్వే సుమతిని చంపావని అనుకున్నానని ఫ్రెండ్‌నే అనుమానించానని సారీ చెప్పి హగ్ చేసుకుంటుంది. రామ్‌, ప్రీతిలను తీసుకొచ్చి మీ అమ్మసుమతి అని చెప్తుంది. అందరూ సంతోషంగా సుమతితో కలిసిపోతారు. సుమతి పిల్లల్ని హగ్ చేసుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: క్రిష్ మీ కన్న కొడుకు అని నాకు తెలుసు చిన్న మామయ్య: చక్రవర్తిని నిలదీసిన సత్య