Seethe Ramudi Katnam Serial Today Episode సీత పుట్టింటిలో ప్రీతి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా ప్రారంభమవుతుంది. అందరూ అక్కడికి చేరుకుంటారు. నా మేనకోడలి పెళ్లి నా ఇంట్లో జరగడం సంతోషంగా ఉందని శివకృష్ణ అంటే దానికి మహాలక్ష్మీ నీ చెల్లి పెళ్లి నీ ఇష్ట ప్రకారం జరగలేదు అని తన పిల్లల పెళ్లి నీ ఇష్టప్రకారం చేయాలని అనుకుంటున్నావ్ అంతే కదా అని అంటుంది.
సీత: ప్రీతికి పెళ్లి కొడుకు నచ్చాడు. పెళ్లి కొడుకుకి ప్రీతి నచ్చింది. మన రెండు కుటుంబాలు కలిసిపోయావి. మనసులు కలవడం ముఖ్యం కానీ పెళ్లిలో ఆడంబరాలు ముఖ్యంకాదు.
మహాలక్ష్మీ: ఆ మాట నాకు తెలుసు సీత. అందరం కలిసి ప్రీతి పెళ్లి చేయాలనే మాటకు నేను కట్టబడి ఉన్నాను కానీ కన్యాదానం నేను చేయను. సుమతినే చేయాలి సుమతి ఇక్కడికి రావాలి.
అర్చన: మగపెళ్లి వాళ్లు అడిగింది అదే.
గిరిధర్: సుమతి వదిన రాకపోతే మగపెళ్లి వాళ్ల దగ్గర మన పరువు పోతుంది.
సీత: ఎవరి దగ్గర ఏం పరువు పోదు అన్నీ టైంకే జరుగుతాయి. రావాల్సిన వాళ్లు తప్పకుండా వస్తారు.
అర్చన: సీత ధైర్యం ఏంటో అర్థం కావడం లేదు మహా సీత వాలకం చూస్తుంటే సుమతి అక్కని తీసుకొస్తుందని అనిపిస్తుంది.
మహాలక్ష్మీ: ఎలా తీసుకొస్తుంది. సుమతి పోలీసుల నుంచి తప్పించుకొని పరారైంది. సుమతి కనిపిస్తే పోలీసులు కాల్చేస్తారు. ఈ టైంలో సుమతి బయట తిరగదు. ఎక్కడో సేఫ్‌గా దాక్కొని ఉంటుంది. ఇక రెండో విషయం సుమతి విద్యాదేవి ఒకరే అని సీతకు కచ్చితంగా తెలీదు. ఇద్దరూ ఒకరే అని సీత ఎలాంటి ఆధారాలు చూపించలేదు. దానికి అంత తెలివి లేదు టైం లేదు.
అర్చన: ఏమో మహా సీత చివరి నిమిషంలో ఏదో ఒక వండర్ చేస్తుంది.
మహాలక్ష్మీ: అంత సీన్ సీతకు లేదు రేవతి పెళ్లి విషయంలో మనం ఓడిపోయాం ప్రీతి పెళ్లి విషయంలో గెలవాలి. ప్రీతి రాకేశ్‌కే సొంతం.
ప్రీతిని లలిత రెడీ చేస్తుంది. అందంగా ఉన్నావని పొగుడుతుంది. సీత కూడా ప్రీతి దగ్గరకు వెళ్లి ప్రీతికి పెళ్లి కల వచ్చేసిందని అంటుంది. ప్రీతి మాత్రం డల్‌గా ఉంటుంది. సీతతో వదినా నీ మాట నమ్మి వచ్చాను పెళ్లి ఆగిపోతే మా అమ్మ రాకపోతే నేను పీటల మీదే చనిపోతానని అంటుంది. సీత మాట ఇచ్చిందంటే నెరవేరి తీరుతుందని శివకృష్ణ అంటాడు. ఈ పెళ్లి జరగాలి అంటే మా అమ్మ రావాలి అని రామ్ అంటాడు. సీత మాత్రం అత్తమ్మ వస్తుంది పెళ్లి జరుగుతుందని అంటుంది. మరోవైపు మహాలక్ష్మీ సీఐకి కాల్ చేసి పెళ్లి మండపానికి రమ్మని చెప్తుంది.
లేట్ అయితే ప్రీతి పెళ్లి అయిపోతుందని సుమతి వచ్చేలా ఉందని సీత కాన్ఫిడెంట్‌గా ఉందని సుమతి వస్తే మీరు అడ్డుకుంటే పెళ్లి ఆగుతుందని త్వరగా పోలీసుల్ని రమ్మని మహాలక్ష్మీ చెప్తుంది. ఇక పంతులు వచ్చి పెళ్లి తంతు ప్రారంభిస్తాడు. మరోవైపు పెళ్లి వాళ్లు వస్తారు. హేమంత్ తల్లి సుమతి గారు వచ్చారా అని అడిగితే సీత కన్యాదానం టైంకి మా అత్తమ్మ వస్తుందని అంటుంది. అందరూ సీతని తలా మాట అంటే దానికి సీత అందరూ నా మాట నమ్మండి అత్తమ్మ కచ్చితంగా వస్తుందని చెప్పి పెళ్లి తంతు ప్రారంభించమని అంటుంది. దాంతో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు పీటల మీద కూర్చొంటారు. పంతులు అబ్బాయి కాళ్లు కడగటానికి అమ్మాయి తల్లిదండ్రులు రావాలని పంతులు చెప్తారు.
దాంతో సీత నేను ఇప్పుడు మా మహాలక్ష్మీ అత్తయ్యతో వెళ్లి సుమతి అత్తమ్మను తీసుకొస్తాను అని మహాలక్ష్మీని తీసుకొని వెళ్తుంది. మరోవైపు పోలీసులు రాకుండా రోడ్డుకు అడ్డంగా రాళ్లు వేసి ఉంటాయి. సీఐ మిగతా పోలీసులకు రాళ్లు తీయమని చెప్తారు. పెళ్లికి టైం అయిపోతుందని సీఐ కంగారు పడతారు. ఇక సీత మహాలక్ష్మీని బయట ఉన్న తన చీరల వ్యాన్ దగ్గరకు తీసుకెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.