Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today November 18th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్కీ తల్లి కోసం ఎంక్వైరీ స్టార్ట్ చేసిన మిత్ర, లక్ష్మీలు.. ఎలా అడ్డుకోవాలో అని మనీషా టెన్షన్!

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్కీ తన తల్లిదండ్రుల ఎవరో తెలుసుకోమని లక్ష్మీకి చెప్పడంతో లక్ష్మీ, మిత్రలు లక్కీ తల్లి గురించి ఎంక్వైరీ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్కీకి లక్ష్మీ రక్తం ఇస్తుంది. దాంతో మిత్ర లక్ష్మీ విషయంలో పాజిటివ్‌గా ఉంటాడు. ఇక లక్కీ లక్ష్మీతో తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకొని చెప్పమని అంటుంది. దాంతో లక్ష్మీ తెలుసుకుంటానని లక్కీకి మాటిస్తుంది. లక్కీ, లక్ష్మీ మాటలు మిత్ర వింటాడు. మరోవైపు మనీషా ఆ మాటలు విని మనీషా టెన్షన్ పడుతుంది. లక్ష్మీ లక్కీ తల్లి గురించి తెలుసుకోవడం ప్రారంభిస్తే తానే లక్కీ తల్లి అని తెలిసిపోతుందేమో అని దేవయానితో చెప్పుకొని టెన్షన్ అవుతుంది. ఇక లక్కీ లక్ష్మీని తన పక్కనే పడుకోమని చెప్తుంది. దాంతో లక్ష్మీ మిత్రకు విషయం చెప్తే మిత్ర లక్కీతో లక్ష్మీ పడుకోవడానికి ఒప్పుకుంటాడు. ఇక లక్ష్మీ మిత్రని జున్ను దగ్గర పడుకోమని చెప్తుంది. 

Continues below advertisement

దేవయాని: లక్కీ కన్న తల్లి ఎవరో కనిపెడతాను అని లక్ష్మీ మాటిచ్చింది మనీషా. ఈ విషయం లక్ష్మీ ఓ పట్టాన వదలదు. లక్కీ కన్న తల్లి తానే అని లక్ష్మీకి తెలిసిపోతే నీ పని అయిపోయినట్లే మనీషా. భాస్కర్ ద్వారా లక్ష్మీకి విషయం తెలిసిపోతుంది. కాబట్టి నువ్వు భాస్కర్ అడ్డు వీలైనంత త్వరగా తొలగించు మనీషా. మిత్రకు లక్కీ తమ కూతురే అని తెలిస్తే వాళ్లంతా ఒక్కటైపోతారు. నిన్ను లక్ష్మీ మెడ పట్టుకొని గెంటేస్తుంది.
మనీషా: ఇదంతా ఆ భాస్కర్ నోరు తెరిస్తే కదా అవుతుంది ఆంటీ వాడిని పైకి పంపేస్తా.

జున్ను: మిత్ర జున్ను దగ్గరకు వెళ్తాడు. మీరేంటి ఇక్కడికి వచ్చారు నాన్న..
మిత్ర: ఇది నా ఇళ్లు నేను ఎక్కడికైనా వస్తా.
జున్ను: అవును ఇది తాతయ్య ఇళ్లు తర్వాత మీ ఇళ్లు మీ తర్వాత నాది మనం ఎక్కడైనా ఉండొచ్చు. అమ్మ దగ్గరకు వెళ్తా నాన్న.
మిత్ర: వద్దు మీ అమ్మ లక్కీ దగ్గర పడుకుంటుంది నేను ఇక్కడ పడుకుంటా.
జున్ను: అయితే మీరు నా దగ్గర పడుకుంటా థ్యాంక్యూ నాన్న మీరు నాకు చాలా ఇష్టం నాన్న అమ్మ మీ గురించి చిన్నప్పటి నుంచి చెప్తుంది.
మిత్ర: నా గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించే వాడివా మీ అమ్మ ఏం చెప్పేది.
జున్ను: మీ గురించి అమ్మ రోజూ చెప్పేది నాకు మిమల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉండేది. మీరే నా హీరో నాన్న లక్కీలా నేను ఎప్పటికీ మీతోనే ఉంటా. లక్కీ మీరు నేను అమ్మ అందరం కలిసి ఉండాలి అదే నా కోరిక నాన్న అని పడుకుండి పోతాడు. మిత్ర జున్ను నుదిటిపై ముద్దు పెడతాడు.

ఉదయం లక్కీ జున్నుని నిద్ర లేపి పాలు తాగిస్తుంది. ఇక జాను అక్కడికి వస్తే లక్కీ జానుతో లక్ష్మీ అమ్మ తన తల్లిదండ్రులు ఎవరో చెప్తానని ప్రామిస్ చేసిందని అంటుంది. జాను బయటకు వెళ్లి లక్ష్మీతో ఎందుకు లక్కీ కోసం అలా ప్రామిస్ చేశావని అంటే దానికి లక్ష్మీ లక్కీ తన తల్లి కోసం చాలా ఆలోచిస్తుందని లక్కీ, జున్ను ఒకే ఊరిలో ఒకే హాస్పిటల్‌లో పుట్టడం వల్ల ఆ హాస్పిటల్‌కి కాల్ చేసి నాతోపాటు ఎవరు డెలివరీకి వచ్చారో తెలుసుకుంటే లక్కీ తల్లి ఎవరో తెలిసిపోతుందని అంటుంది. జాను, లక్ష్మీలు మాట్లాడటం మనీషా వింటుంది. మరోవైపు మిత్ర మున్నార్ హాస్పిటల్ మ్యానేజర్‌కి కాల్ చేసి భాస్కర్ గురించి అడుగుతాడు. లక్కీ తల్లి గురించి హాస్పిటల్‌కి వెళ్లి ఎంక్వైరీ చేయమని అంటాడు. ఇక వివేక్ మిత్ర మాటలు విని ఇప్పుడు లక్కీ మదర్ గురించి ఎందుకు అని అడుగుతాడు. లక్కీ చాలా బాధ పడుతుందని లక్కీ తల్లి వస్తే లక్కీని తన దగ్గరే ఉండమని బతిమాలు తాను అంటాడు. ఇక మిత్ర మాటలు దేవయాని వింటుంది. 

దేవయాని మిత్ర, వివేక్‌లు మాట్లాడుకున్న విషయం మనీషాకి చెప్తుంది. మనీషా లక్ష్మీ ఎంక్వైరీ స్టార్ చేసిందని అంటుంది. ఏదో ఒకటి చేయమని దేవయాని మనీషాతో చెప్తుంది. ఇక లక్ష్మీ మున్నార్‌లోని హాస్పిటల్‌కి కాల్ చేసి తన డెలివరీ డిటైల్స్ చెప్పి లక్కీ గురించి చెప్పి వివరాలు అడుగుతుంది. ఎనిమిదేళ్ల క్రితం విషయం అంటే కష్టమని నర్స్ అంట్ లక్ష్మీ రిక్వెస్ట్ చేస్తుంది దాంతో నర్స్ వివరాలు చూసి చెప్తానని అంటుంది. ఇక జాను భాస్కర్ అన్నయ్య కాల్ చేశాడు కదా ఏమైందని అడిగితే దానికి లక్ష్మీ నేను వెళ్లే సరికి భాస్కర్ అన్నయ్య వెళ్లిపోయాడని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: చక్రవర్తే క్రిష్ తండ్రి అని తెలుసుకున్న సత్య.. ఇంటి నుంచి వెళ్లిపోయిన మైత్రి!

Continues below advertisement
Sponsored Links by Taboola