Seethe Ramudi Katnam Today Episode : గుడి నుంచి ఇంటికి వచ్చాక గుడిలో జరిగిన వాటి గురించి మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక సీత మహాలక్ష్మి దగ్గరకు వచ్చి తనను తన మామని విడదీయాలి అనుకుంటే ఆ దేవుడు ఊరుకోడని అంటుంది. దేవుడు తన పక్షాన ఉన్నాడని అందుకే మీ కుట్రలు ఫలించలేదని అంటుంది.


మహాలక్ష్మి: నా మాటలు చాటుగా విని నా  ప్లాన్ చెడగొట్టావు. రామ్ సాయంతో సూర్యని తీసుకొచ్చి పూజలో కూర్చొపెట్టావు. అంత మాత్రానా దేవుడు నీ వైపు ఉన్నాడని ఎలా చెప్తావే.


సీత: అవన్నీ నా ప్రయత్నాలు.. చేసింది నేనే అత్తయ్య.. అది ఒకే కానీ. ఈ ముత్యాల హారం మా మెడలోనే పడింది ఎందుకు. ఈ హారం పొరపాటున నా మెడలో పడలేదు. దైవ సంకల్పం వల్ల పడింది. ఇక నుంచి అయినా నన్నూ నా భర్తని విడిదీయాలి అన్న ఆలోచిన మానుకో. లేదంటే ఎదురు దెబ్బలు తింటారు.


మహాలక్ష్మి: నిన్ను చావు దెబ్బ కొట్టే వరకు నేను వదలనే. నీ వెనక ఆ వంద దేవుళ్లు ఉన్నా నేను అనుకున్నది సాధిస్తా. 


సీత: నేను చెప్పాల్సింది చెప్పా ఇక మీ ఇష్టం. మీరేం చేసినా మా జంటను విడదీయలేరు. 


మహాలక్ష్మి: దొంగ ఎత్తుకెళ్లిన ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది. దాన్ని సీతారాముల మెడలో పడేలా ఎవరు విసిరారు. ఒకవేళ సీతే దొంగని ఏర్పాటు చేసి ఆ హారం తన మెడలో పడేలా చేసిందా.. అంటే సీత కూడా నాలాగే ఆలోచిస్తుంది. నాతో పోరాడాలి అంటే నాలాగే ఆలోచించాలి. అది నన్ను పూర్తిగా చదివేసిందా. సీతకు అంత తెలివి ఉందా.. సీత కాకపోతే తన తండ్రి ఈ పని చేశాడా. తన పోలీస్ బుద్ధి చూపించాడా..


మరోవైపు సీత ముత్యాల హారాన్ని దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుంటుంది. మరోవైపు కల్యాణం గురించి శివకృష్ణ ఇంట్లో అందరూ మాట్లాడుకుంటారు. ఇక సుమతి తన భర్త జనార్థన్ అని మహాలక్ష్మి తన ఫ్రెండ్ అని అన్ని చెప్పేస్తానని అనుకుంటూ బయటకు వెళ్తుంది. 


సుమతి: అన్నయ్య నేను మీకు ఓ విషయం చెప్పాలి.


శివకృష్ణ:  అంతకంటే ముందు నేను నీకు ఓ విషయం చెప్పాలి. నిన్ను నువ్వు మా ఇద్దరి కూతుళ్ల గురించి అడిగావు కదా. 


లలిత: ఆ ఇద్దరమ్మాయిలు అల్లుళ్లు ఈరోజు గుడికి వచ్చారు.


నీలవేణి: నువ్వు మా దగ్గర ఉండి ఉంటే నువ్వు సీత, మధులను చూసేదానివి వదినా.


సుమతి: నేను వాళ్లిద్దరినీ చూశాను. దూరం నుంచి చూశాను అన్నయ్య. మీ వియ్యంకుడిని కూడా చూశాను. మధుమిత భర్త జైలులో ఉన్నందకు బాధగా ఉన్నా.. సీత ఒక పెద్దింటికి కోడలు అయినందుకు నాకు సంతోషంగా ఉంది. ఒక మంచి కుటుంబంలో సీత అడుగు పెట్టింది.


శివకృష్ణ: నువ్వు అనుకున్నంత మంచి కుటుంబం కాదు సుమతి వాళ్లది. అసలే నువ్వు కష్టాల్లో ఉన్నావని నీకు మా కష్టాల గురించి చెప్పాలి అనుకోలేదు. నా ఇద్దరు కూతుళ్లు నువ్వనుకున్నంత సంతోషంగా లేరమ్మ.  


సుమతి: ఏమంటున్నావ్ అన్నయ్య.


శివకృష్ణ: నీ పెద్ద మేనకోడలు మధుమితకి ఇవాళ నువ్వు చూసిన మహాలక్ష్మి గారి అబ్బాయి రామ్ సంబంధం వచ్చింది. కానీ మధు మమల్ని కాదు అని సూర్యని ప్రేమ పెళ్లి చేసుకుంది. మేం బలవంతంగా సీతకి రామ్‌తో పెళ్లి చేశాం. ఆ పెళ్లి మహాలక్ష్మికి ఇష్టం లేదు. సీతని కోడలిగా తనని ఒప్పుకోలేదు. పెళ్లి అయిన నాటి నుంచి గొడవలే.


లలిత: మధు ప్రేమించి పెళ్లి చేసుకున్న సూర్య డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. వాళ్ల పెళ్లి రోజు తర్వాత గొడవల వల్ల మధు మమల్ని నమ్మకుండా మహాలక్ష్మి ఇంటికి వెళ్లి అక్కడే ఉంటుంది. 


సుమతి: సీత భర్త రామ్ మంచోడు. కానీ అతని సవతి తల్లి పెద్ద దుర్మార్గురాలు. కుట్రలు కుతంత్రాలు చేస్తుంది.


లలిత: సీతని రామ్‌ భార్యగా ఒప్పుకోకుండా తను మొదటి చూసిన మధునే రామ్‌కి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటుంది. సీతని ఎలా అయినా ఆ ఇంట్లో నుంచి గెంటేయాలి అనుకుంటుంది.


శివకృష్ణ: ఆ ఇంట్లో అందరూ మహాలక్ష్మి మాట వింటారు. రామ్‌కి మహాలక్ష్మి మాట అంటే వేదం. సీత ఒక్కదాయే పోరాటం చేస్తుంది.


సుమతి: మనసులో.. అంటే మహాలక్ష్మి చెడ్డదా.. నన్ను నమ్మించి మోసం చేసిందా. తను మేక తోలు కప్పుకున్న పులా. మహాలక్ష్మి ఇంత చెడ్డది అని తెలీకుండా మీతో ఆ విషయం చెప్పాలి అనుకున్నా మీరు చెప్పింది అంతా విని నేను ఎలా చెప్పగలను. నా భర్త పిల్లల కోసం తన జీవితాన్నే త్యాగం చేసింది. కానీ అన్నయ్య వాళ్లు మహా చాలా చెడ్డది అని దారుణమైనది అని చెప్తున్నారు. నేను చూసిన మహా నిజమైనదా.. అన్నయ్య చెప్పింది నిజమా.. అంతా మహాలక్ష్మిని కలిసి తెలుసుకుంటాను. 
 
మహాలక్ష్మి: (సుమతికి వాయిస్ మెసేజ్ పంపుతుంది. చాలా విషయాలు మాట్లాడాలి అని అడ్రస్ పెట్టి అక్కడికి రమ్మని పిలుస్తుంది.) చనిపోయిన సుమతి నాకు మెసేజ్ చేయడం ఏంటి. సుమతి పేరుతో వేరే ఎవరైనా చేశారా.. ఇది సీత పని అయ్యుంటుందా లేక ఆ రంగా పనా అని నెంబరుకి కాల్ చేస్తుంది. నెంబరు ఆఫ్ ఇస్తుంది. దీంతో మహా కచ్చితంగా అక్కడికి వెళ్లాలని బయల్దేరుతుంది. 


మరోవైపు సీత ముత్యాల హారం చూసి మురిసిపోతుంది. ఇంతలో రామ్ వస్తాడు. దేవుడే ఆ కానుక ఇచ్చాడని ఇక నుంచి తమకు ఏ కష్టాలు రావని అంటుంది. ఇక రామ్ ఆఫీస్‌కు వెళ్తానని అంటాడు. ఇంతలో సీత ఆ హారం తాకి దండం పెట్టుకొని వెళ్లమని రామ్‌కి చెప్తుంది. రామ్ బ్యాగ్ తగిలి ముత్యాల హారం తెగిపోతుంది. దీంతో సీత కంగారు పడుతుంది. తన మనసు కీడు శంకిస్తుందని రామ్‌ని బయటకు వెళ్లొద్దని చెప్తుంది. రామ్ నమ్మనని బయటకు వెళ్తాడు. మహాలక్ష్మి సుమతి చెప్పిన అడ్రస్‌కు వస్తుంది. సుమతి కూడా అక్కడికి వస్తుంది. అయితే మహా దగ్గరకు రౌడీ రావడం చూసి సుమతి దగ్గరకు వెళ్లదు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: బ్రహ్మముడి సీరియల్: తల్లీ కొడుకులకు పంగనామం పెట్టిన స్వప్న.. నిజం తెలుసుకోవడానికి ఆఫీస్‌కు కావ్య పరుగులు.. రెండు రోజులే గడువు!