Satyabhama Today Episode లాయర్ మహదేవయ్యతో మాట్లాడుతూ ఉంటే క్రిష్, సత్యలు తమ విడాకుల గురించి మాట్లాడుతున్నారని అనుకుంటారు. క్రిష్ ఇంట్లో విషయం తెలిసిపోయిందనుకొని కేసు తొందరగా తేల్చమని లాయర్‌తో చెప్తాడు. ఇంతలో రుద్ర ల్యాండ్ కేసు గురించి నీకు ఎలా తెలుసుని క్రిష్‌ని అడిగితే క్రిష్ కవర్ చేస్తాడు.  


లాయర్: ఇంక నేను ఇక్కడే ఉంటే వీళ్లు నన్ను ప్రాణాలతో ఉండనిచ్చేలా లేరు. నేను బయల్దేరుతా.


క్రిష్: బాపు లాయర్‌ని గేటు వరకు విడిచిపెట్టి వస్తా.. ఇదిగో లాయర్ అంకుల్. 


లాయర్: నేను పులి నోట్లో తల పెట్టానని నాకు ఇప్పుడే అర్థమైంది బాబు. 


క్రిష్: ఆరు నెలల వరకు మా విడాకులు గురించి ఇంట్లో తెలీకూడదు.


లాయర్: అసలు ఈ ఇంటి వైపే నేను రాను బాబు. ఆ పెద్దాయనకు తెలిస్తే నా ప్రాణాలు తీసేస్తాడు.


క్రిష్: కేసు తొందరగా తేల్చకపోతే ఆ పని నేనే చేస్తా. 


విశ్వనాథం: బాధ్యతని బరువు అనుకొని పారిపోతున్నావ్ హర్ష. నందిని నీ బాధ్యత. కావాలని కోరి పెళ్లి చేసుకున్నావ్. ఇప్పుడు నువ్వే తనని వదిలేస్తే ఎలా. తను నీ మాట వినేలా నువ్వే చేసుకోవాలిరా.


హర్ష: మా జీవితాలు ఎప్పటికీ ట్యాలీ కావు నాన్న. తనకి నేను లైఫ్ పార్టనర్ అనే విషయం మరిచిపోయి ప్రవర్తిస్తుంది. ఎన్ని అని భరించాలి. నా వాళ్లని ఇబ్బంది పెడుతుంది. 


విశ్వనాథం: ముందు నీ గురించి ఆలోచించు తర్వాత నీ వాళ్ల గురించి ఆలోచించు. ఆ అమ్మాయికి నచ్చచెప్పు. నీ చెల్లి తన భర్తని మార్చుకుంది. నీ చెల్లి చేసిన పని నువ్వు ఎందుకు చేయలేవురా. నేను నిన్ను తప్పు పట్టడం లేదురా. నీ కాపురం బాగు పడాలి అని తపన పడుతున్నా. ఒకరి మనకి నచ్చకపోతే వాళ్లు ఏం చేసినా నచ్చదు. అదే మనకి ఒకరు నచ్చితే వాళ్లు ఏం చేసినా నచ్చుతుంది. నందినిని ఇష్టపడటం మొదలు పెట్టు. నీ వెనకాల మేం నిలబడతాం. 


హర్ష: ప్రయత్నిస్తాను నాన్న. 


మరోవైపు క్రిష్, సత్యల గిల్లిగజ్జాలు మొదలవుతాయి. ఇద్దరం కలిసి ఒకే రూంలో ఉండటం కష్టమని సత్య అంటుంది. దీంతో క్రిష్ నీకు సంసారం నాలెడ్జ్ కంటే జనరల్ నాలెడ్జే ఎక్కువ అని సెటైర్లు వేస్తాడు. ఇక సత్య లాయర్ నుంచి అగ్రిమెంట్ తీసుకొని వచ్చి క్రిష్‌కి చూపిస్తుంది. 


క్రిష్: మనం ఆరు నెలల్లో ఎలా అయినా విడిపోతాం మరి అలాంటప్పుడు ఈ ఆరు నెలలు అయినా అడ్జస్ట్ అయి కలిసి ఉండొచ్చు కదా. 


సత్య: అడ్జస్ట్ అంటే..


క్రిష్: ఆ అడ్జస్ట్ కాదు. విడిపోయే వరకు ఈ గొడవలు లేకుండా ఉందామని. 


సత్య: అంత లేదు.. ఎప్పటిలా మనం అందరి ముందే భార్యభర్తలం. బెడ్ రూంలో నువ్వెవరో నేను ఎవరో. ఇక నుంచి ఒకే బెడ్ మీద పడుకోవడం కూడా వద్దు. 


క్రిష్: అంటే.. 


సత్య: అంటే మన బెడ్‌లు వేరు వేరు అవ్వాలి. 


క్రిష్: అదెట్లా జరుగుతుంది. విడదీయడం కష్టం.


పంకజం: ఏంటి విడదీయడం బాబు.


క్రిష్: నువ్వెందుకు వచ్చావ్.


పంకజం: మీ గదిలో పందిరి మంచం రిపేర్‌కు వచ్చింది. అందుకే ఈ మంచం వేయించారు అయ్యగారు. అది చెప్పడానికి వచ్చా.


క్రిష్: చెప్పావు కదా వెళ్లు ఇక్కడికి. నీ కోరిక తీరినట్లు ఉంది. ఈ మంచి రెండుగా వేరు చేయొచ్చు.


సత్య: మంచాలే కాదు ఎవరి సామాను వారి వైపు పెట్టుకోవాలి. 


క్రిష్: అంటే ఒకే ఇంట్లో రెండు కుంపటిలా. 


సత్య: నువ్వు ఏమైనా అనుకో మన ఇద్దరం ఈ గదిలో వేరు వేరుగా ఉండాల్సిందే.


సత్య, క్రిష్‌లు ఒకర్ని ఒకరు ఏడిపించుకుంటూ ఎవరి సామాన్లు వారు తమ తమ ప్లేస్‌లలో సర్దుకుంటారు. ఒకరి ప్లేస్‌లోకి ఒకరు రా కూడదని అనుకుంటారు. ఇక సత్య స్వీట్స్ తీసి క్రిష్ అడిగినా ఇవ్వకుండా మా అత్తగారికి ఇస్తాను అని చెప్తుంది. 


మరోవైపు భైరవి కోడలు ఇంటికి వచ్చి ఇంకా సత్య తనని కలవలేదని ఫీలవుతుంది. ఇక పంకజం రెచ్చగొడుతుంది. ఇంతలో సత్య స్వీట్స్ పట్టుకొని వస్తుంది. భైరవి ఫీలైపోతుంది. ఇక స్వీట్స్ ఇచ్చారని అందిస్తుంది. ఇక పనికిమాలిన పుకార్లు ఎవరో పనికి మాలిన వాళ్లు చెప్పుంటారని అంటుంది. నిప్పు లేనిదే పొగ రాదు అని భైరవి అంటే పొగ రావాలి అనుకున్న వారే నిప్పు పెడతారు అని అంటుంది. ఇక పంకజం లేని పోనివి భైరవికి తగిలిస్తుంది. సత్యని ఇంటి నుంచి గెంటేస్తే నందిని ఇంటికి వస్తుందని అంటుంది. 


మరోవైపు నందిని తనకు చికెన్ స్మెల్ వస్తుందని ఈ ఇంట్లో తాను తప్ప ఇంకెవరు చికెన్ తింటారని అనుకుంటుంది. ఇంతలో హర్ష కేఎఫ్‌సీ చికెన్ తీసుకొని వస్తాడు. నందిని చికెన్ ఎర వేసి హర్ష తనని లొంగదీసుకోవాలి అనుకుంటున్నాడని అనుకుంటుంది.


హర్ష: చికెన్ చూడగానే పరుగెత్తుకుంటూ వచ్చి లాక్కుంటావ్ అనుకున్నా.


నందిని: ఎవర్ని నిన్నా చికెన్‌నా..


హర్ష: అబ్బో జోకులు కూడా బాగానే వేస్తున్నావే.  


నందిని: మనసులో.. సడెన్‌గా ఈయనకు ఏమైంది కొత్త భాష మాట్లాడుతున్నాడు. 


హర్ష: ఏంటి ఆలోచిస్తున్నావ్.


నందిని: మీ మగాళ్లు.. మొగుడులు ఇంత జాదూగాలా అని ఆలోచిస్తున్నా. ఇంట్లో అందరి ముందు నా మీద అరుస్తావ్. బెడ్ రూంలో కాళ్లు పట్టుకుంటావ్ అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ట్విస్ట్ అదుర్స్ కదా.. సరోగసీ మదర్ ముకుంద అని తెలుసుకున్న మురారి.. కృష్ణకు సాయం చేయమన్న రజిని!