Seethe Ramudi Katnam Today Episode సీత, రామ్‌లు మాట్లాడుకోవడం చూసి సీతే తన కోడలు అని సుమతి మురిసిపోతుంది. అందరితో పాటు సీత, రామ్‌లు చేసే కల్యాణాన్ని చూడాలి అనుకుంటుంది. పంతులు సీతా రాముల కల్యాణం విశిష్టతను చెప్తాడు. ఇక కలశంలో వేసిన చిట్టీల్లో ఒక చిట్టీ తీసి అందులో పేరు ఉన్న జంట కల్యాణం చేస్తుందని ఆ జంటకు ఓ ముత్యాల హారం బహుమతిగా ఇస్తామని చెప్తారు. 


పంతులు: ఆ ముత్యాలహారం విశిష్టత ఏంటి అంటే పోయిన ఏడాది సీతారాముల తలంబ్రాల్లో వాడిన మత్యాలను తీసి హారంగా గుచ్చాం. వాటిని ఈ ఏడాది మొదటి జంటకు కానుకగా ఇస్తాం. మరోవైపు ఓ వ్యక్తి పూజకు వచ్చిన ఆడవాళ్ల నగలు ముత్యాల హారం దొంగతనం చేసేయాలి అనుకుంటాడు.
సుమతి: మనసులో.. ఆ రోజు ముత్యాల కోసం డబ్బులు ఇచ్చి ఈ సంప్రదాయానికి తెర తీసింది మేమే అది ఈయనకు గుర్తుందో లేదో.
జనార్థన్: మనసులో.. ఆ రోజు సుమతితో వచ్చి ముత్యాల కోసం మొదటిగా డబ్బులు ఇచ్చింది నేనే. సుమతి చనిపోయాక ఆ ఆచారాన్ని కంటిన్యూ చేయలేకపోయాను.
అర్చన: ఆ ముత్యాల హారం కచ్చితంగా మన మధుకే వస్తుంది కదా మహా.
మహాలక్ష్మి: అందులో ఏ డౌట్ లేదు. కలశంలో ఏ చిటీ తీసిన రామ్, మధుల పేర్లే వస్తాయి. 
సీత: సీతే రాముడి కట్నం. రాముడే సీత ధైర్యం.
మహాలక్ష్మి: నవ్వవే కాసేపట్లో నీ నవ్వు మాయం అవుతుంది. నిన్ను ఈ రోజు నిన్ను ఏడిపించకపోతే నా పేరు మహాలక్ష్మే కాదు. 
సుమతి: స్వామి మీకు ముత్యాల తలంబ్రాలు ఇచ్చే సంప్రదాయాన్ని మొదలు పెట్టింది నేను నా భర్త ఈ ముత్యాల హారాన్ని నా కొడుకు కోడలికి దక్కేలా చూడు స్వామి. 


పంతులు కలశం నుంచి చిట్టీ తీస్తాడు. అందులో మధుమిత, సూర్య అని చదువుతాడు. దాంతో మధుతో పాటు మహాలక్ష్మి, శివకృష్ణ కుటుంబాలు అందరూ షాక్ అయిపోతారు. 


జనార్థన్: ఏంటి మహా రామ్, మధుల పేర్లు వస్తాయి అనుకుంటే మధు, సూర్యల పేర్లు వచ్చాయి ఏంటి.
మహాలక్ష్మి: మధు నీ పేరు  సూర్య పేరు నువ్వు రాశావా.
మధు: లేదండి.
మహాలక్ష్మి: మరి ఎవరు రాశారు.
సీత: నేను రాశాను. అక్కా బావల పేర్లు నేనే కలశం రాశాను. అక్కా బావల చేతుల మీద కల్యాణం జరగడం చూస్తాం.
సుమతి: నా కోడలు సీత తన పేరు రామ్  పేరు రాయకుండా వేరే ఎవరి పేరో ఎందుకు ఇచ్చింది.
మహాలక్ష్మి: మనసులో.. ఇది ఎలా జరిగింది. మనీ ఇచ్చాను కదా.
సీత: అత్త చిటీలో మా అక్క బావల పేర్లు ఎలా వచ్చాయి అనుకుంటున్నావా అంతా ఆ సీతా రాముల దయ.
మహాలక్ష్మి: మర్యాదగా ఏం చేశావో చెప్పు.
సీత: మీరు చెప్పిన వాళ్లు మా అక్క మామల పేర్లే రాశారు. కానీ నేను మా అక్క బావల పేర్లు ఉన్న కలశం పెట్టేశా. ఎలా ఉంది ఈ సీత ప్లాన్. మీరు మా అక్క పక్కన మామని కూర్చొపెట్టాలి అనుకున్నారు కానీ నేను బావని కూర్చొపెట్టాలి అనుకున్నా.
మహాలక్ష్మి: మీ అక్క పక్కన కూర్చొడానికి సూర్య ఇక్కడ లేదు కదా. జైలులో ఉన్నాడు కదా.
సీత: సినిమా ఇంకా అవ్వలేదు అత్త.
సుమతి: (సీత మధుమిత కష్టాల్లో ఉంది అని బావ జైలులో ఉన్నాడని అందుకే వారితో కల్యాణం జరిపించాలి అనుకున్నాను అని చెప్పడంతో )అంటే నా కోడలికి ఆమె అక్క అన్నమాట. అక్క బావల గురించి అంత ఆలోచించిన నా కోడలి మనసు ఎంత మంచిదో.  
సీత: మీ అందరికి ఓ అనుమానం రావొచ్చు మా బావ జైలులో ఉన్నాడు కదా ఎలా కల్యాణంలో కూర్చొంటాడు. అనుకుంటున్నారా కాసేపట్లో మా బావ జైలు నుంచి ఇక్కడికి రాబోతున్నాడు. అదిగో మా బావ వచ్చాడు.


పోలీసులు సూర్యని తీసుకొని గుడికి వస్తారు. మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. మధు కూడా అలా చూస్తూ ఉండిపోతుంది. జైలు  సూపరిండెంట్‌ని కలిసి పర్మిషన్ అడిగామని సీత చెప్తుంది. ఇక సూర్యని తీసుకెళ్ల మధుమిత పక్కన నిల్చొపెడుతుంది. సుమతి సీత బంగారం అనుకుంటుంది. ఇక అందరూ సీత, రామ్‌లను పొగిడేస్తారు.  


ఇంతలో దొంగ ముత్యాల హారాన్ని దొంగిలించేస్తాడు. ఇక సుమతికి తన కూతుళ్లు, అల్లుళ్లని పరిచయం చేద్దామని లలిత అంటే ఇది సమయం కాదు వద్దు అని శివకృష్ణ అనేస్తాడు. ఇక అందరూ దొంగ వెంట పడతారు. సుమతి వాడి మీదకు కర్ర విసిరి దొంగని పట్టుకుంటుంది. వాడిని కొట్టి ముత్యాల హారాన్ని తీసుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ఆ పని చేసింది నువ్వే కదా? ముకుందని నిలదీసిన మురారి.. అత్తకి అడ్డంగా దొరికిపోయిన కృష్ణ!