Krishna Mukunda Murari Today Episode ముకుంద మీద మురారికి అనుమానం వచ్చి మాట్లాడటానికి పిలుస్తాడు. ఈ టైంలో మాట్లాడటానికి ఎందుకు పిలిచాడా అని ముకుంద టెన్షన్ పడుతూ వస్తుంది. ఎందుకు పిలిచావని మురారిని అడుగుతుంది.  


మురారి: ఎవరు ఎంత నటిస్తే ఏం లాభం అనుకున్నది జరగలేదు కదా. అదే ఇంట్లో వాళ్లని సంతోషంగా ఉంచుదామనుకున్నాం అది జరగలేదు అంటున్నా. ఆవిడ ఎవరో వచ్చి సరోగసీ అంటూ డిస్ట్రబ్ చేసింది. 
ముకుంద: ఏం చేస్తాం మురారి గారు అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది. మీరు కృష్ణ ఒక బిడ్డని కని మీ పెద్దమ్మకి ఇస్తాను అనుకున్నారు కానీ అది జరిగిందా. జరగకూడనిది జరిగి సరోగసికి వెళ్లాల్సి వచ్చింది. 
మురారి: అనుకోకుండా జరిగేవి మన చేతుల్లో ఉండవు మీరా. కానీ కొందరు అనుకొని చేసే పనులే చిరాకు కోపం తెప్పిస్తాయి. ఆ వచ్చినావిడ అడ్రస్ తప్పి ఇక్కడికి రాలేదు. కావాలనే ఎవరో గుట్టు రట్టు చేయడానికి పిలిపించినట్లుంది. 
ముకుంద: మనసులో.. కనిపెట్టేశాడా ఏంటి. 
మురారి: అడ్రస్ నువ్వే చూశావు కదా ఆ అడ్రస్ నీకు గుర్తుందా. నీకు ఆ అడ్రస్ గుర్తుంటే బాగుండేది. ఇప్పుడే వెళ్లి అడిగేదాన్ని ఆ అడ్రస్‌కు నిజంగానే ఎవరైనా సరోగసీ కోసం వచ్చారా లేదా అని. లేదంటే ఇక్కడ ఫంక్షన్‌కు డిస్ట్రబ్ చేయడానికి వచ్చాందా అని తెలిసిపోయేది.
ముకుంద: ఏంటి గుచ్చి గుచ్చి అడుగుతున్నాడు.
మురారి: సరోగసీ కోసం వెళ్లినప్పుడు ఆ మదర్ ఎవరో డాక్టర్‌ని అడిగాం. అలా చెప్పకూడదు రూల్స్ ఒప్పుకోవు అని చెప్పారు. ఒకరి కోసం మరొకరికి తెలీకుండా అంత సీక్రెట్‌గా చేస్తారు ఆ ప్రాసెస్. అలాంటిది ఆ అమ్మాయి నేనే సరోగసీ మదర్‌ని అని నేరుగా వచ్చేసింది అంటే ఎవరో కావాలనే చేశారు. అసలు ఈ విషయం నీకు నాకు కృష్ణకు తప్ప ఇంకెవరికీ తెలీదు. నేను ఎలాంటి మొహమాటం లేకుండా అడుగుతున్నా నువ్వే చెప్పావు కదా. ఇంకెవరికీ ఈ విషయం తెలీదు. ఎవరికీ ఇలా చేయాల్సిన అవసరం లేదు.
ముకుంద: అంటే నాకు ఆ అవసరం ఉంది అనుకుంటున్నారా. ఈ ఇంట్లో సంతోషం దూరం చేయాలని నేను అనుకుంటానా..
మురారి: నేను కృష్ణ ఈ నిజం ఎవరికీ తెలీకూడదని జాగ్రత్త పడుతున్నాం ఇక మిగిలింది మీరే.
ముకుంద: చాలు ఆపండి ఇంత చీప్‌గా ఆలోచిస్తారు అనుకోలేదు. కృష్ణకు ఇలా అవ్వడం చూసి మీ బాధని పంచుకోవాలి అనుకోవడం నేను చేసిన తప్పు అయింది కదా.. అయినా ఎవర్నో తెప్పించాల్సిన అవసరం నాకు ఏంటి. దీని వల్ల నాకు ఏం వస్తుంది. 
మురారి: మీరా సారీ నేను టెన్షన్‌లో అడిగేశా.
ముకుంద: అయినా సరోగసీని జాగ్రత్తగా ఉంచుతారు అని ఎవరు చెప్పారు. కొంతమంది సరోగసీ మదర్‌ని ఇంటికి తెచ్చుకొని డెలివరీ అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకొని తర్వాత పంపిస్తారు. బిడ్డ పుట్టాక ఏ గొడవలు జరగకూడదు అని అలా సీక్రెట్‌గా ఉంచుతారు. కానీ నమ్మకంతో మదర్‌ని ఇంటికి తెచ్చుకుంటారు. ఈ రోజు వచ్చిన ఆవిడని కూడా అలా తెప్పించుకున్నారేమో ఆవిడ పొరపాటున వచ్చిందేమో. నాకు విషయం తెలుసు కదా అని నన్నే విలన్‌ని చేసేస్తారా. (ప్లాన్ సక్సెస్ ఇప్పట్లో మురారికి నా మీద డౌట్ రాదు. కృష్ణ విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలు)


మరోవైపు కృష్ణ ఫంక్షన్‌లో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో మురారి వస్తాడు. ఆ అమ్మాయి గురించి ఆలోచించొద్దని చెప్తాడు. దీంతో కృష్ణ మీ ముందు కూడా నన్ను నటించమంటారా అని ప్రశ్నిస్తుంది. 


కృష్ణ: నేను పిల్లల్ని కనలేకపోయినా దేవుడు వేరే దారి చూపించాడని సంతోషించేలోపే జరుగుతున్న ఒక్కో సంఘటనకి కాళ్లూ చేతులు వణికిపోతున్నాయి. ఇందాక పెద్దత్తయ్య ఏమన్నారో తెలుసా. ఎవరైనా తొమ్మిది నెలలు మోసి బిడ్డను కావాలి అనుకుంటారు కానీ ఇలా సరోగసీ ద్వారా కావాలి అనుకుంటారా అని అన్నారు. అక్కడ చూస్తే సరోగసీ కోసం మాట్లాడేశాం. అంతా చేశాక పెద్దత్తయ్యకు నచ్చకపోతే ఏంటి పరిస్థితి.
మురారి: ఏం అవ్వదు కృష్ణ. ఆరోగ్యం బాగున్నవారే వేరే కారణాలతో సరోగసీ ద్వారా బిడ్డల్ని కని సొంత బిడ్డగా చూసుకుంటే నీకు ఆ అవకాశం లేక ఇలా చేస్తే ఏం కాదు. పెద్దమ్మకు నిజం తెలీక ఇలా మాట్లాడుతుంది. తెలిస్తే ఒప్పుకుంటుంది. నువ్వు కంగారు పడకు. 
కృష్ణ: సరే కానీ రేపు మనం డాక్టర్ వైదేహి దగ్గరకు వెళ్లాలి. 


ఉదయం కృష్ణ హడావుడిగా ముగ్గు పెట్టడానికి వెళ్తుంటే భవాని అపుతుంది. ఇంట్లో ఏ పని చేయొద్దని చెప్పా కదా అని తిడుతుంది. డెలివరీ అయ్యే వరకు ఏ చిన్న పని చేయించొద్దని చెప్పాను కదా అయినా ఎందుకు చేయిస్తున్నావని రేవతిని తిడుతుంది. పని చేసినా పర్లేదు అని మురారి అంటే భవాని మురారిని కూడా తిడుతుంది. కృష్ణ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా భవాని ఒప్పుకోదు. 


ముకుంద: మేడం మీరు ఊరికే టెన్షన్ పడుతున్నారు. మెట్లు ఎక్కి తిరగడం కాదు కదా పరుగెత్తినా, దూకినా కూడా ఏం కాదు కాబట్టి కృష్ణ ఏం చేయాలి అనుకుంటే అది చేయొచ్చు. 
భవాని: షట్‌అప్ ముకుంద. నీకు అసలు ఏం తెలుసని మాట్లాడుతున్నావ్. పెళ్లి అయిందా పిల్లల్ని కన్నావా. అసలే అది తింగరి అది చేయొచ్చు ఇది చేయొచ్చు అంటే ఎగబడి మరీ చేస్తుంది. ఎవరూ ఏం మాట్లాడకుండా నేను చెప్పింది చేయండి అంతే. 


ముకుందని భవాని తిట్టడంతో ఆదర్శ్ మండిపోతాడు. కృష్ణ వైపు చూస్తూ రగిలిపోతాడు. ఇక రజినితో సంగీత కృష్ణ మంచిది అంటే రజిని తిడుతుంది. ఇక సంగీత కృష్ణని పొగిడి ముకుందని తిడుతుంది. దీంతో రజిని అలా అనకే ముకుంద నీకు ఆదర్శ్‌కి పెళ్లి చేస్తానని చెప్పిందని అంటుంది. దీంతో నా పెళ్లి చేయడం కాదు అది ఆదర్శ్‌ని పెళ్లి చేసుకోకుండా ఉంటే చాలని సంగీత అంటుంది. దీంతో రజిని ఆలోచనలో పడుతుంది.


మరోవైపు ముకుంద దగ్గరకు ఆదర్శ్‌ వెళ్లి సాయంత్రం ఫ్రీగా ఉండమని షాపింగ్‌కు వెళ్దామని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: నర్శింహే దీప భర్త అని తెలుసుకున్న పారిజాతం.. దీప తన గోడు అత్తకి చెప్తుండగా వినేసిన సుమిత్ర!