Naga Panchami Today Episode : మంటల్లో పంచమి, మోక్షలు చిక్కుకుంటారు. మోక్ష బయటకు వచ్చి పంచమి వైపు డోర్ తీయడానికి చాలా ఇబ్బంది పడతాడు. చివరకు అతి కష్టం మీద పంచమిని బయటకు తీస్తాడు. కరాళి తన దివ్య దృష్టితో చూసి తప్పించుకుందని అనుకుంటుంది.


మోక్ష: పంచమి ఇలా చూడు నీకు ఏం కాలేదు. 


రాళి: ఎన్ని ప్రయత్నాలు చేసినా పంచమి తప్పించుకుంటుంది. అయినా వదిలి పెట్టను. ఏదో విధంగా పంచమిని నాశనం చేసేతీరుతా. 


శబరి: అలా చూడకపోతే మంటలు ఆర్పొచ్చుకదా.


జ్వాల: ఏ వీళ్లు కూడా మంటల్లో కాలిపోవాలా..


చిత్ర: ఆ బిడ్డ ఎఫెక్ట్ అప్పుడే తెలిసిపోతుంది. ఈరోజు కారు కాలిపోయింది. రేపు ఇళ్లే కాలిపోతుంది.


జ్వాల: ఏదో ఒకటి అయ్యే వరకు మీరు పట్టించుకోరా అత్తయ్య. ఆ సోదావిడ చెప్పినట్లు మొదటి ఎఫెక్ట్ మీ చిన్న కొడుకుకే. 


మరోవైపు మోక్ష రెగ్యులర్‌గా కలుస్తున్న సైంటిస్ట్ థామస్ అనే ఫారిన్ సైంటిస్ట్‌కు పంచమి రిపోర్ట్ పంపిస్తాడు. ఆయన పంచమి గర్భంలోని బిడ్డ మీద స్టడీ చేస్తాడు. ఇద్దరూ వీడియో కాల్‌లో మాట్లాడుకుంటారు. 


థామస్: ఇట్స్ ఏ వండర్..ఇలాంటి కేసును రీసెర్చ్ చేయడం చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది. 


సైంటిస్ట్: పుట్టబోయే బిడ్డ పాములా పుడితే ఇష్టరూప శక్తులు అన్నీ వస్తాయి. పాముగా మనిషిగా ఏ రూపం కావాలి అంటే ఆ రూపంలోకి ఈజీగా మారిపోవచ్చు.


థామస్: ఇది మనకు చాలా ముఖ్యమైన కేసు. రెగ్యులర్‌గా రిపోర్ట్స్ పంపించండి. ఆ పిండంలోని డీఎన్ఏ మనం తెలుసుకుంటే అద్భుతాలు సృష్టించొచ్చు. నేను అనుకున్నది జరిగితే ఆ పుట్టబోయే బిడ్డ వల్ల అద్భుతాలు చేయొచ్చు. ఆ జాతి పాముల వల్ల వయసును కంట్రోల్ చేయొచ్చు. పాము మనిషి రక్తం కలిసిన రక్తంతో అద్భుతాలు సృష్టించవచ్చు. ఆ డీఎన్‌ఏతో చాలా వ్యాధులకు వాక్సిన్ కనిపెట్టొచ్చు. ఇది మిలియన్లు కురిపించే డీఎన్ఏ అవుతుంది. ఇది టాప్ సీక్రెట్. ఇప్పుడు ఆ పిండానికి మనం రేట్ ఫిక్స్ చేయలేం. ఇండియాకు వచ్చి మాట్లాడుతా..


వైదేహి: ఇప్పుడు జరిగిన అగ్ని ప్రమాదం ఏదో ప్రమాదం వల్ల జరిగింది అని మేం అనుకోలేం మోక్ష.


రఘురాం: నువ్వు తృటిలో తప్పించుకున్నావో మోక్ష. నీకు ఏమైనా జరిగి ఉంటే నేను మీ అమ్మ తట్టుకోగలమా. చెప్పు మోక్ష. 


వైదేహి: మీకు పుట్టబోయే బిడ్డ వల్ల నీకు ప్రమాదం ముంచుకొస్తుంది. 


మోక్ష: మీరు అంతా అటు తిరిగి ఇటు తిరిగి మా బిడ్డ మీదకే వస్తున్నారు. ఇది నాకు ఏమాత్రం నచ్చడం లేదు.


శబరి: మోక్ష చెప్పింది నిజం. ఏమైనా అరిష్టాలు జరిగితే దానికి ఏం చేయాలో ఆలోచించండి. అంతేకానీ పుట్టని బిడ్డమీద నిందలు వద్దు. 


మోక్ష: మా బిడ్డ విషయంలో మేం రాజీ పడం. మీ భయాలతో మాకు పనిలేదు. నా బిడ్డ వల్ల నాకు ఏమైనా జరుగుతుందని నాకు భయం లేదు. అలాంటప్పుడు మీకు నా గురించి అనవసరం. ఈ టాపిక్ గురించి ఇదే చివరి మీటింగ్ కావాలి. రా పంచమి. 


జ్వాల: ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోండి. అత్తయ్య.


మోక్ష: పంచమి నాకు ఏమైనా అవుతుందని నువ్వు భయపడుతున్నావా.


పంచమి: అవును కానీ మన బిడ్డ వల్ల కాదు ఆ కరాళి వల్ల. 


అవును మోక్షాబాబు గురువుగారి మాటలు నమ్మి మీ అమ్మగారిలా నేను భయపడింది నిజమే. కానీ అనుకోకుండా కారు కాలిపోవడం లాంటివి చూశాకా ఇదంతా ఆ కరాళి మాయే అని నాకు బాగా అర్థమైంది.


మోక్ష: కానీ ఇంట్లో అందరూ ఇది మన బిడ్డ వల్లే అని అనుకుంటున్నారు.


పంచమి: మీరేం భయపడకండి మోక్షాబాబు నా బిడ్డకు ఏం కాకుండా నేను చూసుకుంటా. మనం భయపడాల్సింది ఇంట్లో వాళ్ల గురించి కాదు. ఆ కరాళి శక్తులకు మనం మన బిడ్డ బలి కాకుండా చూసుకోవాలి.


మోక్ష: అందుకు ఏం చేయాలో ఆలోచిద్దాం పంచమి. కానీ నేను మన బిడ్డ గురించి కొందరు డాక్టర్లతో మాట్లాడాలి.


పంచమి: మరో విషయం మోక్షాబాబు. నా కడుపున పుట్టబోయేది నా కన్న తల్లి అని మీకు తెలుసు. నాగాంశతో పుట్టినప్పుడు ఆ బిడ్డకు విష లక్షణాలు ఉండొచ్చు.


మోక్ష: దీని గురించి నాకు ముందే తెలుసు పంచమి అందుకే ఒక ప్రొఫెసర్తో కలిసి విరుగుడు కనిపెట్టే పనిలో ఉన్నాను. 


పంచమి: ఎలాంటి అవాంతరాలు ఎదురైనా తట్టుకొని ఎదుర్కొడానికి నేను సిద్ధంగా ఉన్నాను.


మోక్ష: నీ మాటలు విన్నాక నాకు కొండంత ధైర్యం వచ్చింది పంచమి. నేను ఈ విషయాలు మాట్లాడటానికి వెళ్తా. ఒకటి రెండు రోజులు ఇంటికి రాకపోయినా నువ్వు దిగులు పడకు. 


పంచమి: నాకేం పర్లేదు అండి. మీరు జాగ్రత్తగా వెళ్లి రండి. 


మోక్ష వెళ్లిపోతాడు. పంచమి ఏడుస్తూ ఉంటుంది. వైదేహి పంచమి కోసం భోజనం తీసుకొని వచ్చి గోరు ముద్దలు తినిపిస్తుంది. పంచమి ఎమోషనల్ అవుతుంది. మీ ఇద్దరి ప్రేమ ముందు నేను ఓడిపోయాను అని వైదేహి అంటుంది. మోక్ష అదృష్టవంతుడని అంటుంది. మీ బిడ్డ కూడా మంచిగా పుడుతుందని అంటుంది. పంచమికి తన బిడ్డకు ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటాను అని అంటుంది. దీంతో పంచమి అత్త చేతులు పట్టుకొని ఎమోషనల్ అవుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: రామ్, మధులతో కల్యాణం జరిపించనున్న మహా ప్లాన్ తెలుసుకున్న సీత.. కొడుకు కోడలిని చూసి మురిసిపోయిన సుమతి!