Satyabhama Serial Today Episode  : సత్య, క్రిష్‌లు గొడవ పడతారు. లోపల కసి పెట్టుకొనే నన్ను కొట్టావని క్రిష్ అంటాడు. దీంతో సత్య అలాంటి ఆలోచనే ఉండి ఉంటే ఇన్ని రోజులు నీతో కలిసి ఉండేదాన్ని కాదని అంటుంది. దీంతో క్రిష్ ఎవరు కలిసి ఉండమన్నారని ప్రశ్నిస్తాడు. 


క్రిష్: నీ కాళ్లు పట్టుకొని బతిమాలానా.. బలవంతంగా నిన్ను పీటల మీద కూర్చొపెట్టి తాళి కట్టానా.. చేసింది అంతా నువ్వే కదా.. నేను నీ జీవితం నాశనం చేయడం కాదు నువ్వే నా జీవితం నాశనం చేశావు. 


సత్య: చూడు నేను నీకు చాలా సార్లు చెప్పాను. నేను నీ మీద మోజుతో నిన్ను పెళ్లి చేసుకోలేదు. నా కుటుంబాన్ని ఏం చేస్తావనే భయంతోనే చేసుకున్నాను. 


క్రిష్: ఏయ్ ఊరుకో. ఎప్పుడూ అదే మాట. నేను ఎప్పుడూ మీ ఫ్యామిలీ జోలికి రాలేదు. సరే అదే నిజం అనుకుందాం ఇప్పుడు మాటిస్తాను. మీ ఫ్యామిలీ జోలికి రాను వదిలేస్తావా.. నన్ను వదిలేస్తావా.. నాకు విడాకులు ఇస్తావా.. నిన్నే అడిగేది ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా అన్నావ్ కదా విడాకులు ఇస్తావా..


సత్య: ఇస్తాను. ఈ క్షణంలోనే ఇస్తాను. 


క్రిష్: ఓ ఆల్రెడీ డిసైడ్ అయ్యావన్నమాట.


సత్య: అయ్యాను. నువ్వు రెచ్చిపోతే నేను ఎందుకు వెనక్కి తగ్గుతాను. 


క్రిష్: మస్త్ ఖుషీ అనిపిస్తుంది. నెత్తి బరువు దిగిపోయినట్లుంది. నిన్ను ప్రేమించినందుకు నాకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నావ్. ఇప్పుడు నువ్వు నాకు నచ్చిన పని చేస్తున్నావ్. 


సత్య: నువ్వు కూడా నాకు నచ్చిన పని చేశావ్. నా సమస్యకు ఇంత తొందరగా పరిష్కారం దొరుకుతుందని అనుకోలేదు. రావణాసురుడి చెర నుంచి విడుదలవుతున్న సీతమ్మలా ఉంది నా పరిస్థితి.


క్రిష్: ఆలస్యం లేకుండా మంచి లాయర్‌ని చూస్తా విడాకులు తీసుకోకుండా రెడీగా ఉండు.


సత్య: నువ్వు కష్టపడక్కర్లేదు. నేనే చూస్తా. మా ఫ్రెండ్ వాళ్ల నాన్న లాయర్. రేపటి నుంచి నువ్వు ఎవరో నేను ఎవరో ఎవరి బతుకులు వాళ్లవి. 


మరోవైపు విశ్వనాథం ఏడుస్తుంటాడు. విశాలాక్షి భర్తని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. అల్లుడితో మాట్లాడమని చెప్తుంది విశాలాక్షి. దీంతో విశ్వనాథం క్రిష్ అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలని అంటే చేతులు పట్టుకొని క్షమాపణ చెప్పమని విశాలాక్షి అంటుంది. ఇక సత్య గురించి విశ్వనాథం అడిగితే సత్య, అల్లుడు ఉదయం నుంచి బయటకు రాలేదని విశాలాక్షి చెప్తుంది. విశ్వనాథం సత్య వాళ్ల గదికి వెళ్తాడు. అక్కడ ఎవరూ ఉండరు. 


విశ్వనాథం: గదిలో ఎవరూ లేరు విశాలా.


విశాలాక్షి: అదేంటి ఇంత పొద్దున్న చెప్పకుండా ఎక్కడికి వెళ్తారు.


నందిని: చెంప దెబ్బ కొడితే మా అన్న ఎట్లా ఊరుకుంటాడు అనుకుంటారు. మా అన్న కోపం మీకు తెలీదు కాళ్లు చేతులు విరక్కొట్టడానికే తీసుకెళ్లి ఉంటాడు.


విశ్వనాథం: అమ్మా..


హర్ష: ఏయ్ నోర్ముయ్.. అమ్మా దాని మాటలు మీరు పట్టించుకోకండి. ఇంట్లోనే ఎక్కడో ఉంటారు చూడమ్మ. 


విశాలాక్షి సత్యకి ఫోన్ చేయమని హర్షకు చెప్తుంది. హర్ష కాల్ చేస్తే స్విఛ్ ఆఫ్ వస్తుంది. ఇక హర్ష, నందిని గొడవ పడతారు. దాంతో విశ్వనాథం ఇద్దరినీ వారిస్తాడు. దీంతో హర్ష చుట్టుపక్కల చూసి వస్తాను అని వెళ్లాడు.


ఇక క్రిష్‌, సత్యలు లాయర్ దగ్గరకు వస్తారు. లాయర్ ఎదురుగా కూడా సత్య, క్రిష్‌లు గొడవ పడతారు. లాయర్ తల పట్టుకుంటాడు. నచ్చ చెప్పాలని ట్రై చేస్తాడు. పెళ్లయిన పదిరోజులకే ఇలా తన్నుకు చచ్చే జంటను నేను ఎక్కడా చూడలేదని లాయర్ అంటాడు. 
                 
క్రిష్: అరే ఇప్పుడేం చూశావ్. ఫస్ట్ నైట్ మా రూంకి వచ్చుండాల్సింది. మస్త్ సీన్ చూసేవాడివి. 


లాయర్: శివశివ మీ ఫస్ట్ నైట్ రోజు నేను మీ రూంలోకి రావడం ఏంటి నాయనా ఏం మాట్లాడుతున్నావ్.


క్రిష్: ఓ లాయర్ అంకుల్ అంత సీన్ లేదు. ఆ రాత్రి నీ కూతురు ఏం చేసిందో తెలుసా. నేను మొగుడినే కాదు. నేను కట్టింది తాళే కాదు అని శివతాండవం చేసింది. నన్ను రూమ్‌నుంచి బయటకు గెంటేసింది. అయినా ఇప్పటికీ ఆమెను భరిస్తున్నా.


సత్య: అదే నోటితో నువ్వు చేసిన ఘనకార్యం చెప్పు. ఈయన గారి గురించి చెప్పాలి అంటే ఒక గంటకాదు ఒక రోజు సరిపోదు. 


క్రిష్: ఇగో లాయర్ నువ్వేం చేస్తావో నాకు తెలీదు రేపటి కల్లా నాకు విడాకులు కావాలి. 


లాయర్: బాబు విడాకులు రావాలి అంటే ఆరు నెలలు పడుతుంది. 


క్రిష్: ఆరు నెలలా.. నేను ఒక్క నిమిషం కూడా ఈ శివంగిని భరించలేను. ఇక్కడే వదిలేసి పోతున్నా.


లాయర్: ఓరినీ కోపం తగలెయ్య ఇక్కడ వదిలేసి వెళ్లిపోవడం ఏంట్రా. కూర్చో నేను చెప్తాను.. చూడండి విడాకులు కావాలి అంటే కనీసం ఆరు నెలలు అయినా కలిసి కాపురం చేయాలి.


క్రిష్: విన్నావు కదా కలిసి కాపురం చేయాలి అంట పద నడు.


సత్య: ఏయ్ కాపురం అంటే నువ్వు అనుకున్న కాపురం కాదు. ఒకే ఇంట్లో కలిసి ఉంటాం అంతే కదా అంకుల్.


క్రిష్: ఆ ఇంత దానికి ఒకే ఇంట్లో కలిసి ఉండటం ఎందుకు ఎవరి ఇంట్లో వాళ్లు ఉంటాం.


లాయర్: దానికి జడ్జీ ఒప్పుకోరు.


క్రిష్: ఆ జడ్జీ సాబ్‌కి ఇలాంటి పెళ్లాం దొరకాల్సింది అప్పుడు తెలిసేది నా బాధ. 


సత్య: తప్పుదు అంటే ఏం చేస్తాం తప్పక ఒకే ఇంట్లో ఆరు నెలలు కలిసి ఉంటాం. అంకుల్ ఈ విషయం మా ఇంట్లో వాళ్లకి తెలీకూడదు. 


సత్య, క్రిష్‌లు ఇద్దరూ విడాకుల పేపర్ల మీద సంతకాలు పెడతారు. సంతకం పెట్టడానికి క్రిష్ ఆలోచిస్తూ పెడతాడు. తర్వాత క్రిష్ చిరాకుగా వెళ్లిపోతాడు. ఇక లాయర్ సత్యకు నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తారు. 


మరోవైపు ఇంట్లో అందరూ సత్య, క్రిష్‌ల కోసం ఎదురు చూస్తుంటారు. ఇంతలో సత్య క్రిష్‌లు ఇంటికి వస్తారు. విషయం ఇంట్లో తెలీకుండా చూడాలని సత్య అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్: సరోగసి కోసం రచ్చచేస్తా అంటూ అడ్డంగా బుక్కైన ముకుంద.. భవాని మాటలకు కుమిలిపోయిన కృష్ణ!