Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప, అనసూయలను తీసుకొని కార్తీక్ ఇంటికి వస్తాడు. దీప ఎక్కడికి వెళ్లినా కనిపించకపోయినా మీదే బాధ్యత అని ఇంట్లో వాళ్లకి చెప్తాడు. సాక్షిని జాగ్రత్తగా చూసుకోండని చెప్పి పోలీస్ వెళ్లిపోతాడు. 


రఘురాం: అమ్మా దీప ఈవిడ ఎవరు.
సౌర్య: మా నానమ్మ.
దీప: మా అత్తయ్య అండి మా కోసం వచ్చారు.
సుమిత్ర: మనసులో.. ఆ బాధ్యత లేని మనిషి ఈవిడేనా. 
పారిజాతం: ఏమ్మా నువ్వేం పని మీద వచ్చావ్.
శివనారాయణ: దీప నువ్వు చేసిందేం నాకు నచ్చలేదమ్మా. నేను ఏదో ప్రేమగా సౌర్య మెడలో చైన్ వేస్తే దాన్ని కూడా వదిలేసి వెళ్లిపోతావా. అమ్మా సుమిత్ర నీ చేతులతో పాప మెడలో చైన్ వేయ్.
సుమిత్ర: అమ్మమ్మ ఇలా రా అని చైన్ పాప మెడలో వేస్తుంది. అనసూయ దాన్ని పట్టుకొని చూస్తుంది. కొన్ని బంధాలు ముడి వేసేది కలకాలం ఉండాలి అని తెంపుకొని పోవాలి అని కాదు.
అనసూయ: మనసులో.. సొంత నానమ్మని నేనే దీని చేతికి రూపాయి ఇవ్వను. ఈవిడేంటి బంగారు గొలుసు వేస్తుంది. పైగా ఇది అమ్మమ్మ అని పిలుస్తుంది.
దీప: అత్తయ్య పదండి.
అనసూయ: నువ్వు కనిపించినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చూస్తుంది నిన్నేనా అనిపిస్తుందే. ఈ ఇళ్లేంటి కార్లేంటి. నువ్వేదో ఈ ఇంటి మనిషివి అయినట్లు వాళ్లు అంత ప్రేమగా మాట్లాడటం ఏంటి. పోలీసులు ఏంటి ఈ గొడవలు ఏంటి. నీ బాధ్యతని అతనికి అప్పగించడం ఏంటి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందే.
దీప: అన్నీ వివరంగా చెప్తాను ముందు పద.
అనసూయ: రెండు రోజుల్లో వస్తాను అని చెప్పి వెళ్లిన మనిషి ఫోన్ కూడా చేయడం లేదేంటా అనుకున్నాను. నీకు ఇక్కడ ఇన్ని భోగాలు ఉంటే ఊరు నేను ఏంటి నీకు నువ్వే గుర్తుండవు.


దీప: గుర్తుండకుండానే ఊరు బయల్దేరానా.
అనసూయ: అంటే నీకు నా కొడుకు కనిపించలేదు.
దీప: మనం లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం పదండి..


మరోవైపు బంటు పారిజాతం దగ్గరికి వస్తాడు. పారిజాతం కాషాయం చీర కట్టుకొని నగలు లేకుండా ఉండటంలో బంటు కామెడీ చేస్తాడు. దీంతో పారిజాతం బంటుని తిడుతుంది. తర్వాత తాను అప్పగించిన పని ఏం చేశావని అడుగుతుంది. 


బంటు: అమ్మగారు మొన్న వచ్చినోడు ఎవడో కాదండీ.. ఆ దీప మొగుడు. వాడు క్యాబ్ నడుపుతూ ఉంటాడు. 
పారిజాతం: అమ్మా.. మనింటి వాళ్లే మనతో ఎన్ని డ్రామాలు ఆడుతున్నారురా.. ఆ వచ్చిన వాడు ఎవడో సుమిత్రకు తెలుసు. నేను అడిగితే చెప్పలేదు. పైగా ఆ ముసలాడితో తిట్టించింది. ముందు దాని సంగతి తేల్చాలి. మొగుడు ఉంటే దానికి మన ఇంటికి రావాల్సిన అవసరం ఏంటి. వాడు మనింటికి రావడం ఏంటి. ఈ నిజాలు అన్నీ మనదగ్గర దాయడం ఏంటి. ఎక్కడో ఉన్న మొగుడికి ఇక్కడున్న దీపకి ఇప్పుడొచ్చిన దాని అత్తకి ఏదో మనకు తెలియని కథ ఉందిరా. మొత్తానికి ఏదో జరుగుతుందిరా బంటు. అదేంటో మనం తెలుసుకోవాలి. 
అనసూయ: వచ్చిన దగ్గర నుంచి నా కొడుకు గురించి మాట్లాడుదాం అంటే సౌర్య ఉంది మాట్లాడొద్దు అంటున్నావ్. అన్ని విషయాలు చెప్పావు కానీ అసలు విషయం చెప్పలేదు. సౌర్య వాళ్ల ఇంటికి వెళ్లింది కదా ఇప్పుడు చెప్పు. అసలు నర్శిగాడు కనిపించాడా. ఏమే నీ కంటికి నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా ఇప్పటికి ఇరవై సార్లు అడిగాను చెప్పడం లేదు. ఊరిని అప్పుల్ని నాకు వదిలేసి నువ్వు ఇక్కడ దర్జాగా ఉంటున్నావ్. అక్కడ నా పరిస్థితే పని మనిషి కంటే హీనంగా తయారైంది. ఇళ్లు అయినా కాపాడుకుందామని వచ్చాను. అయినా నువ్వు వాడిని వెతక్కుండా ఈ కొంపలో నీకు పని ఏంటి. 
దీప: నేను తప్పు చేశాను. నీ కొడుకుతో పెళ్లి అనగానే తల వంచి తప్పుచేశాను.
అనసూయ: నర్శిగాడు కనిపించాడా.
దీప: కనిపించాడు.
అనసూయ: మరి నువ్వు ఇక్కడున్నావేంటే.
దీప: నీకు కొడుకు ఉన్నాడేమో కానీ నాకు ఇంక భర్త ఉన్నా లేనట్లే అత్తయ్య.
అనసూయ: వాడు నిన్ను కొట్టాడా.. అప్పుతో సంబంధం లేదు అన్నాడా.. నీతో ఉండనన్నాడా.. మరి ఇంకేం అన్నాడే.. అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఏడుస్తావేంటే. 
దీప: ఏడుపు తప్ప నాకు ఇంకేం మిగల్లేదు అత్తయ్య. 
అనసూయ: వాడేం చేశాడే. 
దీప: రెండో పెళ్లి చేసుకున్నాడు అత్తయ్య. 
అనసూయ: ఏంటి నర్శి గాడు రెండో పెళ్లి చేసుకున్నాడా. అమ్మ వెధవ ఇంత పని చేశాడు. మరి నువ్వు ఎందుకు ఊరుకున్నావ్.
దీప: మొగుడు రెండో పెళ్లి చేసుకుంటే ఏ పెళ్లాం అయినా ఎందుకు ఊరుకుంటుంది అత్తయ్య. నాకు ఎందుకు అన్యాయం చేశావని నిలదీశాను. కట్టుకున్నదానికి ఉంచుకున్నదానికి తేడా తెలీకుండా మాట్లాడిన అతనితో నేను ఏం మాట్లాడను అత్తయ్య. అతనికి భార్య గానీ కూతురు గానీ తల్లి గానీ ఎవరి అవసరం అతనికి లేదు. అతని దారి అతను చూసుకున్నాడు. అక్కడి నుంచి వస్తుంటేనే గుడి దగ్గర సుమిత్ర గారిని కలిశాను. అక్కడి నుంచి మీకు అంతా తెలుసు.
అనసూయ: వాడు నిన్ను అప్పుల్లో వదిలేశాడు అనుకున్నాను గానీ. కష్టాల్లో వదిలేశాడు అనుకోలేదు. అయినా నువ్వు ఎవరో ఒకరి నెంబరు నుంచి నాకు ఫోన్ చేయొచ్చు కదా.
దీప: నాకు ఎవరి నెంబర్లు గుర్తు లేవత్తయ్య. అయినా నువ్వు ఏమన్నావ్. వస్తే నీ మొగుడితో రా లేదంటే డబ్బులతో రా అన్నావు. ఇక్కడ రెండూ లేవు. ఎక్కడికో దూరంగా పోదామనుకున్నాను. కానీ ఏదో సమాధానం చెప్పుకుందామని ఊరికి బయల్దేరాను.
అనసూయ: ఇంక సమాధానం చెప్పుకోవడానికి అక్కడ మనకి ఏం లేదు. చేతుల్లో డబ్బు లేక ఊరిలో అడుగు పెడితే అప్పుల వాళ్లు ఎగిరి తంతారు. వారం రోజులు గడువిచ్చారు. వారంలో డబ్బుతో వెళ్తే ఇళ్లు ఉంటుంది. లేదంటే ఉండదు. అది నా తమ్ముడు కట్టిన ఇళ్లు దాన్ని ఎలా కాపాడుకోవాలో ఏంటో. అవును ఈ ఇంట్లో వాళ్లు నిన్ను ఇదంతా అడిగారా.
దీప: అడిగారు నేను చెప్పలేదు. సుమిత్ర గారు మీకు కూడా అడుగుతారు చెప్పకు అత్తయ్య. 


మరోవైపు శ్రీధర్ తన భార్య కాంచనకు తినిపిస్తాడు. కాంచన ఎమోషనల్ అవుతుంది. తన అన్నయ్య పెళ్లి సంబంధం తెచ్చినప్పుడు నీ భర్త నాలా నిన్ను చూసుకుంటాడని చెప్పారు. దాన్ని మీరు నిజం చేశారని కాంచన అంటుంది. ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. దీపని వెనక్కి తీసుకొని రావడం అన్ని విషయాల్లో కలుగుజేసుకుంటున్నావని.. బాధ్యతలు తీసుకుంటున్నావని తండ్రి దెప్పిపొడుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  


Also Read: 'త్రినయని' సీరియల్: గాయత్రీ పాప వేసుకున్న చున్నీతో పోలీస్ ప్రాణాలు కాపాడిన పెద్దబొట్టమ్మ.. విశాల్ దొరికిపోతాడా!