Satyabhama Today Episode సత్య, క్రిష్‌లు లాయర్‌ని కలిసి ఇంటికి వస్తారు. తమ విడాకుల గురించి చెప్పకూడదని ఆరు నెలల వరకు అన్యోన్యంగా ఉన్నట్లు నటించి తర్వాత చెప్పాలని సత్య క్రిష్‌తో అంటుంది. ఇక సత్య క్రిష్‌లు ఇంటికి వెళ్లే సరికి అందరూ ఎదురుగా ఉంటారు. ఇద్దరూ గుడికి వెళ్లామని అబద్ధం చెప్తారు. 


క్రిష్: సంపంగి ఒక్క సారి అందరి ముఖాలు చూడు. టెన్షన్‌లో ఉన్నట్లు ఉన్నారు కదా ఎందుకు అట్లా.
విశాలాక్షి: గుడికి వెళ్లినట్లు చెప్పలేదు ఏం బాబు.
క్రిష్: సత్య నువ్వు చెప్పలేదా.
సత్య: లేదండి మీరు చెప్పారు అనుకున్నా. 
క్రిష్: ఈ కన్ఫ్యూజనే వద్దు అంటున్నా.. చూడు మనం ఏమై పోయామో ఎక్కడికి పోయామో అని ఎంత కంగారు పడుతున్నారో. సారీ అత్తమ్మ.
శాంతమ్మ: మీరు నిజంగానే గుడికే వెళ్లారా బాబు. 
క్రిష్: సత్య ఇంక దాచుకోవడం ఎందుకు ఓపెన్‌గా మాట్లాడేసుకుందాం. చూడు మామయ్య భార్య భర్త చెంప పగలగొట్టడం అంటే చిన్న విషయం కాదు. మామూలు అవమానం కాదు. ఇంత గొడవ జరిగాక ఏ మొగుడు పెళ్లాలు కలిసి ఉండాలి అనుకోరు. అవసరం అయితే ఆరు నెలల్లో విడిపోదాం అనుకుంటారు. కానీ లోకంలో ఉన్న అందరు భార్య భర్తలు వేరు క్రిష్‌ సత్యలు వేరు. మా నడుమ చెప్పలేనంత ప్రేమ ఉంది. నమ్మలేనంత నమ్మకం ఉంది. దేవుడు కూడా విడదీయలేని అంత గట్టి బంధం ఉంది. అన్నింటినీ మించి జీవితాంతం విడదీయలేని ప్రేమ ఉంది. మేం ఇంతకు ముందే ఒక అగ్రిమెంట్‌కి వచ్చాం. ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా జీవితంలో ముందుకు సాగాలి అని. అందుకు నా స్టైల్‌లో ప్రమాణం చేస్తానని సత్య చేతికి ముద్దు పెడతాడు. ఇక సంధ్య క్రిష్‌కి కూడా ముద్దు పెట్టమని అంటుంది. దీంతో తప్పక సత్య కూడా ముద్దు పెడుతుంది. 
విశ్వనాథం: అల్లుడు గారు ఇంత వరకు నా కూతురు అదృష్టవంతురాలు అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలుసుకున్నాను ఈ లోకంలో నా కూతురు మాత్రమే అదృష్టవంతురాలు అని. 


మరోవైపు సత్య అత్తింటికి వెళ్లడానికి బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. ఇక విశ్వనాథం కూతురు దగ్గరకు వస్తాడు. దీంతో సత్య తన కోసం బెంగ పెట్టుకోవద్దు అని తాను అక్కడ సంతోషంగా ఉంటాను అని అంటుంది. దీంతో విశ్వనాథం కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఏమైందని సత్య అడిగితే దేవుడే అల్లుడిలా వచ్చినట్లు ఉందని అంటాడు. ఇంతలో విశాలాక్షి అక్కడికి వస్తుంది.


విశాలాక్షి: ఏ భార్య అయినా తన భర్తని కొడితే ఏ మగాడు ఊరుకోడు. తప్పు తనదైనా పురుషాహంకారంతో రెచ్చిపోతాడు. కానీ క్రిష్ అలా కాదు. నిన్ను పెళ్లి చేసి అత్తారింటికి పంపించాం అనుకోలేదు. రౌడీకి భార్యగా చేసి నరకంలోకి పంపాం అనుకున్నాం.
విశ్వనాథం: కానీ నువ్వు మాటిచ్చినట్లు నీ భర్తని నీకు అనుగుణంగా నువ్వే మార్చుకున్నావ్. మా వరకు తీసుకురాలేదు. మార్చడం నీ గొప్పతనం అయితే నువ్వు చెప్పినట్లు మారడం అల్లుడి గారి గొప్పతనం.
సత్య: మనసులో.. మీరు అనుకున్నట్లు మేం కలిసి ఉండలేం నాన్న. విడాకులు తీసుకుంటున్నాం ఆ విషయం మీకు చెప్తే మీరు తట్టుకోలేరు. 
విశ్వనాథం: ఒకవేళ అల్లుడు గారు ముందులా ఉండి ఉంటే ఏం జరిగేదో ఒక్కసారి ఆలోచించు. నిన్ను ఏడిపించుకుని తినేవాడు. అలా జరిగిఉంటే నీ బతుకు మరో సారి దెబ్బతినేది. మామూలుగానే ఆ మహదేవయ్య నోటికి అద్దు పద్దూ ఉండదు. అతని చేతిలో రివాల్వర్ పని చేస్తుంది తప్ప బుర్ర పని చేయదు. ఆ తల నొప్పులు అవమానాలతో చెల్లి పెళ్లి చేయగలమా. ఇదంతా జరగకుండా మనల్ని కాపాడిన దేవుడు ఎవరో తెలుసా అమ్మ మా అల్లుడుగారే. విడాకులు తీసుకోవాలి అన్న ఆలోచన ఆయనకు రాకపోవడమే మన అదృష్టమే తల్లి. ఒక విధంగా తగ్గి నువ్వు మంచి పని చేశావ్ అమ్మ. నువ్వు రెచ్చిపోయి విడాకులు తీసుకుందాం అని ఉంటే చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. మీరు ఇద్దరూ ఎప్పుడూ ఇలా కలిసి ఉంటేనే మేం సంతోషంగా ఉంటాం. 


ఇంతలో క్రిష్‌ వచ్చి వెళ్దమని అంటాడు. సత్య వాళ్లు ఇంటికి వచ్చేస్తారు. ఇక సత్య క్రిష్‌ని పిలిచి ఈ ఇంట్లో కూడా విడాకుల గురించి చెప్పొద్దని అంటుంది. ఇద్దరూ ఇంట్లోకి వచ్చేసరికి లాయర్ మహదేవయ్య వాళ్లతో మాట్లాడుతూ ఉంటాడు. అతన్ని చూసి క్రిష్ సత్య ఇద్దరూ షాక్ అయిపోతారు. తమ విడాకుల గురించి చెప్పడానికి వచ్చేరేమో అని టెన్షన్ పడతారు. 


క్రిష్‌: ఓరి నాయనో ఇప్పుడు గానీ నేను లోపలికి వచ్చాను అంటే నాకు రాం భజనే. నేను రాను దేవుడో.
సత్య: ఓయ్ నువ్వు రాకుండా నేను ఎలా వెళ్లేది. 
లాయర్: మీరు మీ అబ్బాయి లానే మాట్లాడుతారు ఏంటి అండీ ఆరు నెలలు ఆగాల్సిందే.
మహదేవయ్య: ఏమైనా చెప్పు లాయరూ.. కథ ఈడదాకా వచ్చిన తర్వాత ఆరు నెలలు ఆగాలి అంటే కష్టం. 
క్రిష్‌: దేవుడా ఈ విషయం ఎవరికి తెలీకూడదు అనుకున్నానో వాళ్లకే తెలిసిపోయింది.
సత్య: మీనాన్న ఈ క్షణంలోనే విడాకులు ఇప్పించేసేలా ఉన్నారు. ఇప్పుడెలా మా ఇంట్లో ఏం చెప్పుకోను.
క్రిష్‌: నువ్వు ఏం అయినా చెప్పుకో నేను జారుకుంటా. 
మహదేవయ్య: రేయ్ చిన్నా..
క్రిష్‌: అయిపోయిందిరా కథ. బాపు చూసేశాడు.. పోయి పోయి బిందెలో  తల ఇరుక్కున్నట్లు అయింది. 
లాయర్: వీళ్లిద్దరూ ఏంటి వీళ్లతో మహదేవయ్యకు సంబంధం ఏంటి. 
మహదేవయ్య: లాయరూ నా చిన్న కొడుకు కోడలు. 
లాయర్: దేవుడా ఈ సీమ టపాకాయ్‌ గాడు మహదేవయ్య కొడుకా. తెలిసో తెలీకో వీడికి నేను విడాకులు ఇప్పిస్తా అన్నానా. ఇప్పుడు ఇక్కడ నన్ను వీడు ఎలా ఇరికిస్తాడో. నేను గాని వీళ్ల విడాకుల కేసు టేకప్ చేశానని తెలిస్తే నా మొండెం మలేషియా పార్శిల్ చేసేస్తాడు.


మరోవైపు క్రిష్‌ విడాకుల గురించే అనుకొని మాట్లాడేస్తాడు. ఇంతలో రుద్ర ల్యాండ్ కేసు గురించి నీకు ఎలా తెలుసురా అని అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ఆ పని చేసింది నువ్వే కదా? ముకుందని నిలదీసిన మురారి.. అత్తకి అడ్డంగా దొరికిపోయిన కృష్ణ!