Seethe Ramudi Katnam Today Episode: సీత తన అక్క మధుమితను పుట్టింటికి తీసుకొస్తాను అని తన తల్లిదండ్రలకు చెప్తుంది. దీంతో శివకృష్ణ ఇంటి దగ్గర అందరూ సీత, మధుమితల కోసం ఎదురు చూస్తుంటారు. ఇంకా రాలేదు ఏంటా అని ఆలోచిస్తూ ఉంటారు. మహాలక్ష్మి ఎందుకు వచ్చిందని ఆలోచిస్తూ ఉంటారు. ఇక మధు ఇంటికి వస్తే ఏం అనొద్దు అని అందరూ శివకృష్ణకు చెప్తారు.
శివకృష్ణ: మీరందరూ నా గురించి ఏమనుకుంటున్నారు. మీ అందరికీ నా కోపమే కనిపిస్తుంది కానీ దాని వెనక ఉన్న నా బిడ్డల మీద ప్రేమ తెలీడం లేదా.. అమ్మేమో నేను తనకి సుమతిని దూరం చేశాను అంటుంది. మీరేమో మధుని దూరం చేశాను అంటున్నారు. ఆ మధు ఏమో నేను తన కన్న తండ్రినే కాదు అంటుంది. ఆఖరికి సీత కూడా నన్నే తప్పు పడుతుంది. అసలు నేను మీకు అర్థం కావడం లేదో మీరు నాకు అర్థం కావడం లేదో తెలీడం లేదు. ఇంతలో సీత వస్తుంది.
సీతతల్లి: సీత మధు ఎక్కడే.. మధు నీతో రాలేదా..
సీత: అక్క నాతో రాలేదు. మా అత్తయ్యతో వెళ్లిపోయింది అమ్మ మా అత్తయ్య గారింటికి..
శివకృష్ణ: ఏం జరిగింది సీత..
సీత: అక్కకు మన మీద నమ్మకం పోయింది నాన్న. అక్క ఏమందో తెలుసా అని జరిగింది చెప్తుంది. ఆ ఇంట్లో అక్కకు విలువ గౌరవం ఉండవు అని చెప్పినా వినకుండా వెళ్లిపోయింది.
బామ్మ: తప్పు మనదేనే మధుకి మనం ధైర్యం కలిగించలేకపోయాం.
సీతతల్లి: సాయం చేయమని వస్తే తరిమి తరిమి కొట్టాం అది ఇంక మనల్ని ఎలా నమ్ముతుంది.
శివకృష్ణ: పోతే పోనివ్వండి.. అయిన వారిని పరాయివాళ్లగా పరాయి వాళ్లని అయిన వాళ్లగా చూస్తే ఎవరు ఏం చేస్తారు. దాని ఖర్మ అదే అనుభవిస్తుంది వదిలేయండి..
సీత: వదిలేసే పరిస్థితి లేదు నాన్న మా అత్తయ్య మరో ప్లాన్‌తో అక్కని మా ఇంటికి తీసుకెళ్లింది. అక్కకు సాయం చేసే ఉద్దేశం మా అత్తగారికి లేదు నన్ను మోసం చేయడానికి అక్కని తీసుకెళ్లింది. మొదటి నుంచి మా అత్తకి నేను అంటే ఇష్టం లేదమ్మా. మా పెళ్లి అవ్వక ముందు జరిగిన ఒక సంఘటనను మనసులో పెట్టుకొని మా అత్తయ్య నామీద పగ పెంచుకుంది. నన్ను ఎప్పటికీ కోడలిగా అంగీకరించను అని చెప్పింది. నన్ను ఆ ఇంటి నుంచి పంపించేసి అక్కని కోడలిగా చేసుకోవాలి అనుకుంటున్నారు. అందరూ షాక్ అయిపోతారు. నన్ను తప్పించి అక్కని మామ భార్యగా చేయాలి అనుకుంటున్నారు.
శివకృష్ణ: ఏమంటున్నావ్ సీత మధుని రామ్‌కి భార్యని చేయడం ఏంటి. నీకు రామ్‌కి పెళ్లి అయింది కదా..
సీత: వాళ్ల దృష్టిలో అసలు అది పెళ్లే కాదు నాన్న. నేను వాళ్ల కోడలినే కాదు. మామ మొదటి ఇష్టపడింది అక్కను. వాళ్లు కోడలిగా చేసుకోవాలి అనుకున్నది కూడా అక్కనే. వాళ్లు ఇప్పటికీ ఆ ఉద్దేశంతోనే ఉన్నారు. అనుకోకుండా నాకు మామకు పెళ్లి జరిగింది. దాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే రిసెప్షన్‌లో అక్కను రప్పించి సూర్య బావని రానివ్వకుండా చేశారు. రిసెప్షన్‌లో నన్ను పిచ్చి దాన్ని చేశారు. మధు అక్క తన కోడలు అని ప్రచారం చేశారు. కావాలనే నన్ను తప్పించి అక్కని రామ్‌గారిని పక్క పక్క నిల్చోపెట్టి ఫొటోలు తీశారు. ఆ ఫొటోలు పేపర్లలో వచ్చేలా చేశారు. అక్కడ అందరికీ మామ భార్య నేను కాదు అక్క.
శివకృష్ణ: ఎంత పెద్ద ప్లాన్ చేశారు. ఈ విషయం రామ్‌కి తెలుసా.. నేను చెప్పినా ఆయన నమ్మడం లేదు. వాళ్ల పిన్నినే ఆయన నమ్ముతారు.
సీతతల్లి: ఇంత జరుగుతున్నా ఎందుకే నువ్వు మాతో ఒక్కమాట కూడా చెప్పలేదు.
సీత: మిమల్ని బాధ పెట్టాలి అనుకున్నాను. ఈ సమస్యను నేనే పరిష్కరించాలి అనుకున్నాను. తను అనుకున్నది సాధించడం కోసం మా అత్తయ్య గారు ఎంతకైనా తెగిస్తారు నాన్న. ఆవిడకు ఇంట్లో అందరి సపోర్ట్ ఉంది. ఆవిడ చెప్తే మా ఆయన గుడ్డిగా నమ్మేస్తారు. తిరిగి నన్నే అంటారు. ఈ రోజు కూడా పెద్ద ద్రోహం చేశారు. అక్కకు అవేం తెలీకుండా ఆవిడతో వెళ్లిపోయింది. అక్కని మార్చేసి మామకి ఇచ్చి పెళ్లి చేస్తారు. అటు సూర్య బావ, ఇటు నేను అన్యాయం అయిపోతాం నాన్న. ఈ సమస్యను నేను పరిష్కరించుకుంటాను..
శివకృష్ణ: లేదు సీత అది నీ వల్ల కాదు. మధు ఆ ఇంట్లో ఉంటే మీ అత్తయ్య అన్నంత పని చేస్తుంది. మేం వచ్చి తనకి బుద్ధి చెప్తాం. పదండి వెళ్దాం..
మధుని తీసుకొని మహాలక్ష్మి తన ఇంటికి వస్తుంది. ఇక సెక్యూరిటీ వాళ్లు మధుమితని ఇంటికి తెచ్చారు అంటే కొత్త యుద్ధం జరుగుతుంది అని.. ఏం జరిగినా మనం సీతమ్మ వైపే ఉందామని అనుకుంటారు. ఇక మహాలక్ష్మి మధుని గుమ్మం దగ్గరే ఆపి అర్చన, ప్రీతి వాళ్లని పిలుస్తుంది. అర్చనకు హారతి తీసుకురమ్మని అంటుంది. అర్చన మధుమితకి హారతి ఇస్తుంది. మధుని కుడి కాలు పెట్టమని చెప్పి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. అందరూ మధుతో ప్రేమగా మాట్లాడుతారు. రామ్ కూడా వస్తాడు. మధు ఒంటరి అయిందని సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతున్నారు అని అందుకే ఇక్కడ ఉంటుంది అని మహాలక్ష్మి చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.