Satyabhama Today Episode : మహదేవయ్య ఇంట్లో తన ఇద్దరు బిడ్డలు నందిని, క్రిష్‌ల నిశ్చితార్థానికి పెళ్లికి   ఏర్పాట్లు జరుగుతుంటాయి. భైరవి దగ్గరుండి అన్ని పనులు పురమాయిస్తుంటుంది. ఇంతలో భైరవి వదిన ఒకామె వచ్చి అన్నీ పనులు నువ్వే చూసుకుంటున్నావ్ వదిన ఆడపెళ్లివాళ్లు లేరా అని అడుగుతుంది. లేనిపోనివి తగిలిస్తుంది. నీ కొడుకు నీ చేయి జారిపోయాడు అని ముందుంతా నీకు కష్టాలు రాబోతున్నాయని భైరవికి ఎక్కిస్తుంది. 


భైరవి: పెళ్లి ముందు వరకు అది నా కొడుకుని మాయ చేసుండొచ్చు. కుడి కాలు లోపల పెట్టి అత్తింటికి వచ్చిన తర్వాత నా మాట వినకుంటే దాని కాలు విరక్కొడతా. నల్లిని నలిపినట్లు నలిపేస్తా. సుఖంగా కాపురం చేయనిస్తానా ఏంటి. 
క్రిష్: అద్దంలో తనని తాను చూసుకొని సత్య ఫొటో చూసుకుంటూ.. సంపంగి నీకు నాకు ఈ జన్మకే బంధం కాదు. మనద్దరిదీ ఎన్నెన్నో జన్మల బంధం. కాదు అంటావా.. కాదు అని ఎలా అంటావ్‌లే. నా ప్రాణం నీ దగ్గర ఉంటే నీ ప్రాణం ఇక్కడ నా దగ్గర ఉంటే. ఇంకొక్క దినం ఆగితే మన రెండు ప్రాణాలు ఒక్కటి అవుతాయి. మన ఇద్దరి జీవితాలు ఒక్కటవుతాయి. అంటూ క్రిష్ సత్య ఫొటోను చూసి మురిసిపోతే ముద్దులు పెట్టుకుంటుంటే... బాబీ తన ఫ్రెండ్స్ వచ్చి సంపంగి అంటూ పాటలు పాడి ఆటపట్టిస్తారు. 
బాబీ: అన్న ఒకప్పుడు అన్న నడిచొస్తే మాస్ నిల్చొంటే మాస్ అని పాడే వాళ్లం అన్న అలాంటిది ఎలా అయిపోయావ్ అన్న.. ఒకప్పుడు అన్న కళ్లలో రోషం కనిపించేది ఇప్పుడు వదిన కనిపిస్తుంది అన్న.
క్రిష్: రేయ్ ఊరుకోండి..
రేణుక: చిన్నా ఏంటి ఇలానే ఉన్నావ్.. రేపు నీ పెళ్లి నువ్వు పెళ్లి కొడుకువి.. కాసేపట్లో నలుగు పెడతారు. ఈ పట్టుపంచె కట్టుకో..
క్రిష్: సరే వదిన. 


మరోవైపు సత్య ఫ్యామిలీ మహదేవయ్య ఇంటికి వస్తుంది. రాగానే ఇంటి ముందు రౌడీలను చూసి భయపడతారు. శాంతమ్మ వారిని చూసి సెటైర్లు వేస్తుంది. ఇక ఓ పాప వచ్చి వదిన వాళ్లు వచ్చారు అని క్రిష్‌కి చెప్తారు. క్రిష్‌ పరుగులు తీస్తాడు. మరోవైపు భైరవి సత్య ఫ్యామిలీని చూసి నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. ఇక భైరవి వదిన వీళ్లు తీరిగ్గా వస్తుంటే మగపెళ్లి వారు అనుకున్నాను అంటుంది.


హర్ష: మీరు అనుకున్న దానిలో తప్పేం లేదు ఆంటీ. మేం మగపెళ్లివాళ్లమే. నేను ఈ ఇంటికి కాబోయే అల్లుడిని.
భైరవి: ఈ సరసాలు సరదాలు నా వల్ల కాదు. లేట్‌గా రావడమే కాకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారేంటి. మీరు వియ్యం తీసుకుంటున్నది మహదేవయ్య కుటుంబంతో అని మర్చిపోవద్దు. మేం ఉన్నది మీకు సేవలు చేయడానికి కాదు. మర్యాదలు చేయడానికి కాదు. నా కొడుకు ఇష్టపడి పెళ్లి చేసుకుంటాను అన్నాడు కదా అని మీరు ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటాను అంటే కుదరదు. ఇక్కడ మీ లెక్కలు నడవవ్.. మా లెక్కలే నడుస్తాయి. ఈడ జరగబోయేది నీ పెళ్లే కాదు నీ చెల్లి పెళ్లి కూడా. ఫ్యాంట్ షర్ట్‌ మీదకు గుంజుకొని నడుం వంచి పని చేయాలి. 
హర్ష: అది కాదు అండీ.. అంటే సత్య ఆపేస్తుంది. 
విశాలాక్షి: క్షమించండి రావడం ఆలస్యం అయింది ఏమీ అనుకోవద్దు.
క్రిష్: సత్య.. కొత్తగా కనిపిస్తున్నావ్.. ఒక్క రోజు ఒక్క రోజు ఆగితే నీ చేయి నా చేతిలో ఉంటుంది. నువ్వు నా పక్కన ఉంటావ్. ఇద్దరం వేరే లోకంలో ఉంటాం. 
భైరవి: అది రేపు కదా చిన్నా ఇప్పుడు ఈ లోకంలోకి రా. చుట్టూ చాలా మంది ఉన్నారు జర చూసుకో.
క్రిష్: ఏంటమ్మా ఇది కాబోయే కోడల్ని ఇక్కడే నిలబెట్టి మాట్లాడుతున్నావు.
భైరవి: వచ్చుడు లేటు అయిందని జరంత మాట్లాడుతున్నా.
క్రిష్: జరంత లేటు అయితే ఏమవుతుంది అమ్మా.. అందుకే నిలబెట్టి క్లాస్ పీకుతున్నావా.. మా అమ్మ తీరే ఇంత.. మీరు పట్టించుకోకండి. నువ్వు జల్దీ రెడీ అయిపో ఫంక్షన్‌కి మొత్తం అరేంజ్ చేశాం. నీ కోసం గ్రాండ్ డ్రస్ కూడా తెచ్చా. 
భైరవి: ఇదిగో అంతా నీ ఇష్టమేనా.. తిప్పుకుంటూ తిప్పుకుంటూ వాళ్లు ఆరాం వచ్చారు. ఏదైనా నలుగులు అయ్యాకే..
క్రిష్: ఆ మాట నవ్వుకుంటూ చెప్తావేంటి అమ్మా.. రండి మీకు రూం చూపిస్తా..
భైరవి: నువ్వు చూపించడం ఏంట్రా.. నువ్వు పెళ్లి కొడుకువి. అవి చేయడానికి చాలా మంది ఉన్నారు. 
క్రిష్: సత్యని జాగ్రత్తగా చూసుకో.. 


భైరవి రేణుకని పిలుస్తుంది. రేణుక విశాలాక్షి వాళ్లకి నమస్కారం పెడితే నవ్వులు ఏంటని భైరవి తిడుతుంది. సత్య వాళ్లకి రూం చూపించమని అంటుంది. 


రేణుక: ఈడ ఇట్లనే ఉంటుంది. మనమే అన్నీ దులిపేసుకొని పోవాలి. రండి మీ గది చూపిస్తా.. మరోవైపు గుండె నిండా గుడి గంటలు సీరియల్ హీరో హీరోయిన్లు వస్తారు. రాగానే రౌడీలను చూసి వాళ్లు కూడా సెటైర్లు వేసుకుంటారు. తర్వాత సత్య వాళ్లు బ్యానర్లు చూసి అది రైట్ ప్లేస్ అని లోపలికి వెళ్తారు. ఇక కావాలి అనే బాలు భార్య రౌడీలను రెచ్చగొడుతుంది. వాళ్లేమో బాలు మీద కత్తి పెడతారు. అది చూసి తను ఎంజాయ్ చేస్తుంది. తర్వాత ఇద్దరూ లోపలికి వస్తారు. సత్య ఏదో ఆలోచిస్తూ ఉంటుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read:  కేతిక శర్మ : ఎండలో కేతిక శర్మ అందాల రచ్చ - ఈ స్టన్నింగ్‌ లుక్‌కి కుర్రకారు మతిపోవాల్సిందే