Seethe Ramudi Katnam Today Episode: సీతకు రామ్ జాగ్రత్తలు చెప్తాడు. ఇక మధుమిత, రేవతి, చలపతి అక్కడికి వస్తారు. మీ అత్తయ్యకి భలే షాక్ ఇచ్చావని రేవతి సీతతో అంటుంది. ఇక వాళ్ల మాటలు ప్రీతి చాటుగా వింటుంది. ప్రీతిని సీత చూస్తుంది. కావాలి అనే ప్రీతిని రెచ్చగొట్టేలా చేస్తుంది.
మధు: ఒంట్లో ఇప్పుడు ఎలా ఉంది సీత వికారం తగ్గిందా..
సీత: తగ్గింది అక్క కానీ పుల్లపుల్లగా ఏమైనా తినాలని ఉంది.
చలపతి: నేను తీసుకొస్తాను సీత చింతపండు, మామిడి కాయలు..
సీత: మీ ఇష్టం బాబాయ్, ఆవకాయ పచ్చడి అయినా పర్లేదు..
రేవతి: నేను తీసుకొస్తా..
మధు: అమ్మానాన్నలకు ఈ విషయం చెప్పు సీత హ్యాపీగా ఫీలవుతారు.
సీత: ఇప్పుడు కాదు అక్క తర్వాత చెప్తా దానికి ఇంకా టైం ఉంది.
ప్రీతి: సీతకు అన్నయ్య జాగ్రత్తలు చెప్తున్నాడు పిన్ని. అందరూ కంగ్రాట్స్ చెప్తున్నారు. సీత పుల్లగా ఏమైనా తినిలని ఉందని చెప్తుంది.
జనార్థన్: చెప్పాను కదా మహా రామ్ మారిపోయాడు అని.
అర్చన: ఎంతైనా రామ్ మొదటి సారి తండ్రి అవ్వబోతున్నాడు కదా ఆ మాత్రం ఫీల్ అవుతాడు.
గిరిధర్: వదిన మధు కూడా ఇక సీతకే సపోర్ట్ చేస్తుంది. సేవలు చేస్తుంది.
మహాలక్ష్మి: ఆపుతారా.. అసలే నేను టెన్షన్‌తో చచ్చిపోతుంటే మీరు నా బీపీ ఇంకా పెంచుతున్నారేంటి. ఇంకా ఆ డాక్టర్ రాలేదు ఏంటి.
ఇంతలో డాక్టర్ వస్తే సీతని టెస్ట్ చేయమని చెప్తుంది మహాలక్ష్మి. అర్చన సీతని పిలుస్తుంది. అందరూ కిందకి వస్తారు. సీత మామిడి కాయ తింటూ కనిపిస్తుంది.
సీత: ఏంటి అత్తయ్య మీకు బీపీ ఇంకా తగ్గలేదా డాక్టర్ వచ్చింది.
మహాలక్ష్మి: డాక్టర్ వచ్చింది నాకోసం కాదే నీ కోసం.
డాక్టర్: సారీ ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ కాదు.
రామ్: తను ప్రెగ్నెంట్ ఏంటి. మీరు వచ్చి తను ప్రెగ్నెంట్ కాదు అని చెప్పడం ఏంటి.
అర్చన: సీత వాంతులు చేసుకుంది కదా అందుకే మహా డాక్టర్‌ని పిలిపించింది.
డాక్టర్: అవి ప్రెగ్నెంట్ వాంతులు కాదు ఏదో ఫుడ్ పాయిజిన్ అయి ఉంటుంది.
రామ్: అవును తనకు ఫుడ్ పాయిజన్ అయింది.
మహాలక్ష్మి: మరి ఇందాక వేరేలా చెప్పావేంటి రామ్.
రామ్: నేను ఏంటి చెప్పాను.
జనార్థన్: భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి అన్నావు కదా.
రామ్: అంటే నిన్న నైట్ మీతో చెప్పకుండా నేను సీత బయటకు వెళ్లాం డాడీ. సీత ఐస్‌క్రీమ్‌లు ఏవేవో తిన్నాది అందుకే అలా అయిందని నేను అలా చెప్పాను.
సీత: మీరు అలా చెప్తే వీళ్లు నాకు కడుపు వచ్చింది అనుకున్నారు మామ.
రామ్: మీకు అలా అర్థమైందా సారీ డాక్టర్ ఇక మీరు వెళ్లొచ్చు. మీరు అలా ఎలా అనకుంటారు పిన్ని.
ప్రీతి: ఇందాక కూడా నువ్వు తనకి జాగ్రత్తలు చెప్పావు కదా అన్నయ్య..
రామ్: అవును తనకు వాంతులు అయ్యాయని అలా చెప్పాను.
అర్చన: మరి సీత మామిడి కాయ తింటుంది.
సీత: నేను టిఫెన్ తినలేదు కదా చిన్నత్తయ్య. అకలేసి తింటున్నాను.
గిరిధర్: అంటే మీరిద్దరూ కలిసి మమల్ని ఫూల్స్‌ని చేశారు అన్నమాట.
సీత: మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకున్నారు. అందరి కంటే అత్తయ్య ఎక్కువ టెన్షన్ పడ్డారు.
రామ్: చూశావా నైట్ నువ్వు అడ్డమైన గడ్డి తినడం వల్ల అందరూ ఇలా అర్థం చేసుకున్నారు.
రేవతి: ఏంటి సీత ఇది నిజంగా నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు అని ఎంత హ్యాపీగా ఫీలయ్యామో తెలుసా..
సీత: అత్తయ్యతో సరదాగా కాసేపు ఆడుకుందాం అని మీతో కూడా అసలు విషయం చెప్పలేదు పిన్ని.
మధు: నువ్వు ఇలాంటి పనులు చేయబట్టే ఆవిడకు నీ మీద కోపం సీత. అనవసరంగా నేను ఎగ్జైట్ అయ్యాను.
సీత: మహాలక్ష్మి ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటే.. అత్తయ్య గుండెలో మంటగా ఉందా.. పచ్చి వెలక్కాయ గొంతుకి అడ్డం వచ్చిందా. కాళ్ల కింద నేల కదిలిపోయి కళ్లు బయర్లు కమ్మాయా.. ఎదో ఒకటి మాట్లాడండి అత్తయ్య మీ బాధ బయటకు కక్కేయండి.
మహాలక్ష్మి: ఏంటే తమాషాగా ఉందా నాతోనే నాటకాలు మొదలు పెట్టావా..
సీత: చాలా కంగారు పడ్డారు. బీపీ పెరిగి పోతారు ఏమో అని భయపడ్డాను. మా అక్కకు నా గురించి నాకు మా అక్క గురించి కల్పించి చెప్తారు. నేను మామ కలిసి లేమని మా మధ్య సక్యత లేదు అని మా అక్కకు చెప్తారు. మీరు అలా చేశారు కాబట్టే నేను ఇలా చేయాల్సి వచ్చింది. ఈ సీతతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది.
మహాలక్ష్మి: నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ముందు ముందు నువ్వే చూస్తావే..
సీత: ఇంత జరిగినా నా గురించి మీకు తెలియకపోవడం షేమ్ అత్తయ్య. నన్ను మరీ అంత తక్కువ అంచనా వేయకండి అత్తయ్య. ఈరోజు నేను మీకు చెప్పిన అబద్ధం భవిష్యత్‌లో నిజం అవుతుంది. నాకు బాబో పాపో పుడితే మీ చేతిలో పెడతాను.
మహాలక్ష్మి: నా కంఠంలో ప్రాణం ఉండగా రామ్ బిడ్డలకు నిన్ను తల్లిని అవ్వనివ్వను. ఈ ఇంట్లో అందరి తల రాతలు రాసేది నేనేనే.
సీత: ఆ తలరాతను నేను తిరగరాస్తా..
మహాలక్ష్మి: మీ అక్కని నీకు శత్రువుని చేస్తా తన చేతే నిన్ను ఈ ఇంట్లో నుంచి పంపేలా చేస్తా..
సీత: చూద్దాం మీ ఆరాటం నెగ్గుతుందో నా పోరాటం నెగ్గుతుందో..
మధు: సీత తన గదిలో ఉంటే.. నువ్వు చేసింది కరెక్ట్‌గా లేదు సీత మహాలక్ష్మి గారిని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు. ఆమె విషయంలో నువ్వు దారుణంగా ప్రవర్తిస్తున్నావ్.
సీత: ఆవిడ మంచిది కాదు అక్క. ఆవిడ గురించి నీకు తెలిసిన ప్రతీ మాట పచ్చి అబద్ధం.
మధు: నాకు అలా అనిపించడం లేదు. ఈ రెండు రోజుల్లో ఆవిడ ఎంత మంచిదో తెలిసిపోయింది.
సీత: ఆవిడ నీతో మంచిగా మాట్లాడుతూ గౌరవిస్తున్నారు కాబట్టి నీకు అలా అనిపిస్తుంది.
మధు: ఆవిడ నిజంగా మంచిది కాదు కాబట్టి రామ్‌తో పాటు అందరూ ఎందుకు అంత గౌరవిస్తున్నారు.
సీత: ఈ ఇంట్లో ఆవిడ మాట వినని వారు ఇద్దరు ఉన్నారు. రేవతి, చలపతి బాబాయ్‌లు.. వాళ్లని అడుగు. అక్క ఆవిడ ఓ దురద్దేశంతోనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నన్ను నమ్ము.
మధు: నువ్వు అన్న ఆ దురద్దేశం అంత ఈజీగా అయ్యేది కాదు కదా..
సీత: తాను అనుకున్నది చేయడానికి అమె ఎంతకు అయినా తెగిస్తుంది. నీ జీవితం బాగుండాలి అని చెప్తున్నా ముందు ముందు ఆవిడ వల్ల నీకు చాలా ఇబ్బందులు వస్తాయి.
మధు: నువ్వు ఇంతలా చెప్తుంటే నీ మాట వినాలి అనిపిస్తుంది. మరోవైపు నువ్వు అనవసరంగా ఆమె మీద నిందలు వేస్తున్నావు అని రామ్ మాటలు తలచుకుంటుంటే తెలుస్తుంది. సరే సీత నువ్వు నా మంచి గురించి చెప్తున్నావ్ కదా మరి దానికి ఆధారాలు కావాలి కదా..
సీత: సరే నేను ఆధారాలతో నీకు చూపిస్తాను. మా రిషెప్షన్‌లో నన్ను తప్పించి నీవి, రామ్ గారి ఫొటోలు ఆల్బమ్ చేశారు. నేను కోపంతో నీ ఫొటోలు కట్ చేశాను. నువ్వు వెళ్లు ఆల్బమ్ అడుగు అందులో ఆల్బమ్ కట్ చేసి ఉంటుంది. దాన్ని నిలదీయ్ అప్పుడే నీకు నిజం తెస్తుంది.
మధు: సరే సీత ఆల్బమ్ కోసం అడుగుతా అందులో ఫొటోలు కట్ చేసి ఉంటే అప్పుడు ఆవిడ సంగతి చెప్తా.. పద వెళ్దాం..
మధు: రిసెప్షన్ ఫొటోలు వచ్చాయి అంట కదా నేను ఒకసారి ఆ ఆల్బమ్ చూస్తాను.
చలపతి: చచ్చింది గొర్రె సీత కట్ చేసిన ఫొటోలు మధు చూస్తే అప్పుడు ఉంటుంది.
మహాలక్ష్మి: ఇప్పుడు ఆ ఆల్బమ్ ఎందుకు మధు.
రామ్: ఏ ఆల్బమ్ పిన్ని.
సీత: మన రిసెప్షన్ ఆల్బమ్..
మధు: సీత ఏదో చెప్పింది అందుకే ఆ ఆల్బమ్ చూస్తే నిజం ఏంటో తెలుస్తుంది.
అర్చన: సీత ఏదో చెప్పింది అని నువ్వు నమ్మకు మధు తను ఎప్పుడు ఏదో చెప్తుంది.
జనార్ధన్: ఇప్పుడు ఆల్బమ్ గురించి ఎందుకు వదిలేయండి.
సీత: చూశావా అక్క నువ్వు ఆల్బమ్ చూస్తాను అంటే చూపించము అంటున్నారు. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.