Krishna Mukunda Murari Today Episode ముకుంద సర్జరీ చేయించుకొని ముఖం మార్చుకుంటుంది. తన కొత్త ముఖాన్ని తడిమి తడిమి చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. మరోవైపు మురారి, కృష్ణలు ఆదర్శ్‌ మధ్యలో లేవడంతో హోమం తాము చేస్తుంటారు. 


ముకుంద: ఆ ముకుంద ఇక గతం ఇప్పుడు ఇక కొత్త అధ్యాయం స్టార్ అవ్వబోతుంది. మురారి, కృష్ణ కాసుకోండి. 
శ్రీనివాస్: ముకుంద.. అని పిలిచి కూతురు ముఖాన్ని చూసి షాక్ అయిపోతాడు. ముకుంద నువ్వేనా నమ్మలేకపోతున్నాను అమ్మ.
ముకుంద: నమ్మలేకపోతున్నావు కదా నాన్న నేనే ముకుంద అని కొంచెం కూడా అనుమానం రాలేదు కదా.. నన్ను కన్నవాడివి నీకే అనుమానం లేదు అంటే ఇంక వాళ్లకి ఎలా వస్తుంది. సక్సెస్ నాన్న నా ప్లాన్ వంద శాతం సక్సెస్ అవ్వబోతుంది.
శ్రీనివాస్: లేదు నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది. నువ్వు నా ముకుందవి కాదు ఎక్కడ నా ముకుంద. 
ముకుంద: నాన్న ఏమైంది నీకు సర్జరీ చేయి ముఖం మార్చుతారు అని తెలుసుకదా ఇంకా అదే ముఖం ఉంటుందా ఏంటి. మారిపోయింది నాన్న ఇంకా ఆ ముఖం లేదు. 
శ్రీనివాస్: గొంతు ఇది నా కూతురు గొంతు కాదు. రూపం మార్చుకుంటే గొంతు మారిపోతుందా.. అందుకే నువ్వు నా కూతురువి కాదు అంటున్నా.
ముకుంద: పిచ్చి నాన్న అది నీ అనుమానం అది కూడా మార్చేశారు. రూపమే కాదు నా గొంతు కూడా మారిపోయింది. మురారి రూపం మారిపోయింది. కానీ మనం గొంతు వల్లే కదా కనిపెట్టాం. ఇప్పుడు నా విషయంలో అది జరగకూడదు. 
శ్రీనివాస్: మళ్లీ ఒకసారి ఆలోచించు తల్లీ.. రూపం మారింది కదా కొత్త జీవితం ఒకసారి ఆలోచించు. 
ముకుంద: ఎందుకు అంటే నా బతకు నా మనసు అంతా మురారి చుట్టూ ఉన్నాయి నాన్న. ఇంతకు తెగించింది వెనకడుగు వేయడానికి కాదు. నన్ను వెనక్కి లాగొద్దు నాన్న. చూడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా.. నా చావుకి కృష్ణే కారణం అని చెప్పి కృష్ణని అరెస్ట్ చేయించడం. 
శ్రీనివాస్: తను చాలా మంచిది అమ్మ నేను అలా చేయలేను.
ముకుంద: ఏది అడిగినా చేస్తాను అని మాట ఇచ్చావు నాన్న. ఇచ్చిన మాట తప్పుతావా..
శ్రీనివాస్: ఇంకేమైనా అడుగు చేస్తాను ఇది చేయను. ఇది ధర్మం కాదు.
ముకుంద: ఏది ధర్మం ఏది న్యాయం.. నేను మురారికి సొంతం చేసుకోవడమే ధర్మం. అయినా నేను ఏమైనా ఆ కృష్ణని అరెస్ట్ చేయించమని అడిగానా మురారిని సొంతం చేసుకోవడానికి కృష్ణని పావులా వాడుకుంటా అంటే. 
శ్రీనివాస్: సరే అమ్మ నువ్వు ఇంత పట్టు పడితే ఏం చేస్తాను. 


శ్రీనివాస్ తన చిన్ననాటి స్నేహితుడు హోంమినిస్టర్‌ దగ్గరకు వెళ్లి సాయం చేయమని అంటాడు. అతను సరే అంటాడు. దీంతో శ్రీనివాస్ ఓ పోలీస్ ఆఫీసర్‌ని అరెస్ట్ చేసి చితక్కొట్టాలి అని చెప్తాడు. తన కూతురు జీవితంతో ఆడుకున్నాడు అని మురారి గురించి మొత్తం చెప్తాడు. దీంతో హోం మినిస్టర్ ఆ విషయాన్ని ఓ ఇన్‌స్పెక్టర్‌కు చెప్పమని హోం మినిస్టర్ అంటాడు. 


మరోవైపు రేవతి ముకుంద వల్ల పచ్చగా ఉన్న ఫ్యామిలీ అల్లకల్లోలం అయిందని బాధపడుతుంది. ఇంతలో కృష్ణ, మురారిలు వచ్చి శ్రీనివాస్ వాళ్ల ఇంటికి వెళ్తామని చెప్తుంది. రేవతి వద్దు అని చెప్తుంది. ఇంతలో పోలీసులు వచ్చి మురారిని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్తారు. 


కృష్ణ:  ఏం తప్పు చేశారని మా ఏసీపీ సార్‌ని అరెస్ట్ చేస్తున్నారు.
పోలీస్: ముకుంద చావుకు కారణం అయినందుకు. 
మురారి: ఏం మాట్లాడుతున్నారు మీరు. నేను ముకుంద చావుకి కారణం ఏంటి. తను సూసైడ్ చేసుకుంది.
పోలీస్: అందుకు మీరే కారణం కదా.. 
కృష్ణ: మీరు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు తన చావుకి ఎవరూ కారణం కాదు.
ఆదర్శ్‌: ఏమన్నావ్ కృష్ణ. తన చావుకి ఎవరికీ ఏం సంబంధం లేదా.. ఉంది సార్ కానీ మురారి ఒక్కడికే కాదు ఈ కృష్ణకి కూడా. వీళ్లిద్దరూ కలిసి నా ముకుందని చంపేశారు.
రేవతి: ఆదర్శ్ ఏం మాట్లాడుతున్నావు రా. నీ కోపం చూపించే పద్ధతి ఇదా..
మధు: ఆదర్శ్‌ ఆపు మనలో మనకు ఎన్ని అయినా ఉండాలి కానీ ఎవరైనా మన మీదకు వస్తే మనం ఒకటి కావాలి. నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు. 
ఆదర్శ్: మరి వీళ్లు చేసింది కరెక్టా ముకుందని చంపేసి.. నన్ను నాశనం చేశారు. సార్ ఒక్కర్ని కాదు ఇద్దరిని తీసుకెళ్లండి. ముకుంద ఆత్మ హత్యతో వీళ్లిద్దర్ని తీసుకెళ్లండి.
పోలీస్: మురారిని మాత్రమే అరెస్ట్ చేస్తాం. ముకుంద తండ్రి శ్రీనివాస్ తన కూతురు చావుకి ఈ మురారి కారణం అని ఫిర్యాదు చేశారు. ఇక పోలీసులు బేడీలు వేసి తీసుకెళ్తారు. వద్దు అని ఇంట్లో అందరూ ఏడుస్తూ మురారి వెనక వెళ్తారు. కృష్ణ పోలీసుల జీపు వెనక పరుగులు తీస్తుంది. ఇంట్లో అందరూ కృష్ణని ఓదార్చుతారు. 


రేవతి: చూశావా కూతురు పోయిన బాధలో ఉంటారు ఓదార్చుతా అని బయల్దేరావు. ఇప్పుడు ఆయనే నీ భర్త మీద కంప్లైంట్ ఇచ్చాడు.
ఆదర్శ్‌: ఇందులో ఆయన తప్పు ఏముంది. కూతురు చావుకి కారణం అయిన వాళ్లని ఏ తండ్రీ వదలడు కదా..
నందూ: అన్నయ్య నోర్ముయ్ లేదంటే పెద్దొడివి అని చూడను. అన్నయ్యని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే సంబరపడిపోతున్నావు సిగ్గుగా లేదా. 
సుమలత: అవునురా రేపు మురారిది తప్పు లేదు అని తెలిస్తే ఏం చేస్తారు. 
మధు: పదండి వెళ్దాం పోలీస్ స్టేషన్‌కి..
ఆదర్శ్‌: పదండి వెళ్దాం.
కృష్ణ:  నువ్వు ఎందుకు..
ఆదర్శ్‌: నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావ్ కృష్ణ. ముకుంద చావుకి నువ్వు కారణం అని నమ్ముతున్నాను కానీ మురారి అని కాదు. కానీ పోలీసులు ఏవో ఆధారాలు ఉన్నాయి అన్నారు కదా అవేంటో చూసి అవన్నీ నిరాధారమైనవే అనుకో నా ప్రాణం పణంగా పెట్టి అయిన మురారిని బయటకు తీసుకొస్తాను. లేదు నిజంగా మురారి కారణం అనుకో ఆ దేవుడు కూడా కాపాడలేడు. పదండి. 
మురారి: జైలులో నుంచి.. హలో నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు. నేను ఏం తప్పు చేశాను. నేను ఎవరి చావుకి కారణం కాదు. 
కృష్ణ: ఏ ఆధారంతో మా ఏసీపీ సార్‌ని అరెస్ట్ చేశారు. 
రేవతి: ముకుంద తండ్రికి నా కొడుకు మీద కోపం ఉంది అందుకే ఇలా చేశారు. నా కొడుకును వదిలేయండి. 


ఇక పోలీస్ మురారి ఫ్యామిలీకి ముకుంద రాసిన సూసైడ్ నోట్ చూపిస్తారు. తన చావుకి మురారినే కారణం అని ముకుంద రాసిందని పోలీస్ చెప్తారు. ముకుంద అలా రాయదు అని కృష్ణ అంటుంది. లెటర్ చదివిన కృష్ణ కుప్పకూలిపోతుంది. ఆదర్శ్‌కు శోభనం గదిలో నిజం చెప్పమని మురారి చెప్పినట్లు ముకుంద లెటర్ రాస్తుంది. ఆ లెటర్‌ని చదివిన ఆదర్శ్‌ కోపంతో రగిలిపోతాడు. తప్పంతా మురారిదే అని ముకుంద లెటర్‌లో రాస్తుంది. తన చావుకి మురారినే కారణం అని ఉంటుంది. రేవతి ముకుంద పోతూ పోతూ తన కొడుకు జీవితాన్ని నాశనం చేసింది అని ఏడుస్తుంది. ఇక ఆదర్శ్‌ తన పిన్నిని వారించి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.


Also Read: ఇనిమల్‌ టీజర్‌: శ్రుతి హాసన్‌, లోకేష్‌ కనగరాజ్‌ 'ఇనిమల్‌' టీజర్‌ డేట్‌ ఫిక్స్‌