Seethe Ramudi Katnam Today Episode : మధు, సూర్యలు ఇంటికి వస్తారు. మధు ఇంటి బయటే నిల్చొని చూస్తూ ఉంటే ప్యాలెస్ నుంచి పెంకుటింటికి రావడానికి కష్టంగా ఉందా.. డైజస్ట్ చేసుకోవడానికి కష్టంగానే ఉంటుంది అని అంటాడు. ఇక జలజ సూర్య వాళ్లని చూసి హారతి ఇవ్వడానికి హారతి పళ్లెం పట్టుకొని వస్తుంది. సూర్య కోపంతో హారతి పళ్లెం విసిరేస్తాడు.


జలజ: ఏంటి సూర్య శుభమా అని ఇంటికి వచ్చారని హరతి ఇస్తే విసిరేశావ్. నువ్వు బెయిల్ మీద ఇంటికి వచ్చావ్. నీతో మధు వచ్చింది. ఎన్నో రోజుల తర్వాత ఇద్దరూ కలిశారు. ఇలా ప్రవర్తించావ్ ఏంటి.


సూర్య: ఇది బలవంతపు కలయిక వదినా. తను ఇష్టపడి నాతో రాలేదు. అక్కడ ఉండే పరిస్థితి లేక ఎంతో కష్టంగా నాతో వచ్చింది. నేను బయటకు రావడం కూడా అంత ఈజీగా జరగలేదు. నీకు బెయిల్ ఇస్తాను. మా అక్కని తీసుకొని వెళ్లిపో అని సీత కండీషన్ పెడితే ఇంటికి వచ్చాను. వేరే గతి లేక సీత కండీషన్ ఒప్పుకొని వచ్చాను. ఈవిడ గారికి నేను అంటే ఇష్టం పోయింది. ప్రేమ పోయింది. దాదాపు నాతో సంబంధం తెంచుకుంది. 


జలజ: అవేం మాటలు సూర్య తెంచుకుంటే తెగేది కాదు భార్యభర్తల బంధం అనవసరంగా మధుని అపార్థం చేసుకోకు. 


మధు గదిలోకి వచ్చి వేడికి ఇబ్బంది పడుతుంది. ఇంతలో జలజ అక్కడికి వచ్చి మధుని రెచ్చగొడుతుంది. అనవసరంగా సూర్య దగ్గరకు వచ్చావ్ అని అదృష్టం పోగొట్టుకున్నావ్ అని అంటుంది. మహాలక్ష్మీ గారితో వెళ్లినప్పుడు ఎంతో ఎత్తుకు వెళ్లిపోతావని అనుకుంటే మళ్లీ ఈ దరిద్రానికే వచ్చావ్ అని అంటుంది. ఆ ఇంటి కోడలు కావాల్సిన దానివి మళ్లీ సూర్య భార్యగా ఎందుకు తిరిగి వచ్చావ్ అంతా ఆ సీత వల్లే కదా అని సొంత చెల్లి నిన్ను గెంటేసింది అని అంటుంది. 


సీత రామ్ తన కాలికి కట్టిన గజ్జెలు పట్టుకొని పోటీలో గెలిపించావ్ అని ఆ గజ్జెలతో మాట్లాడి ముద్దు పెట్టుకుంటుంది. రామ్ చూస్తాడు. గజ్జెలకు ముద్దు పెట్టుకోవడం కాదు అని ఎదురుగా ఉన్న తనకి పెట్టాలి అని అంటాడు. ఇక సీత రామ్‌కి ఓ బార్బీ బొమ్మ గిఫ్ట్‌గా ఇస్తుంది. దాని పేరు సీత అని చెప్తుంది. దానికి ముద్దు పెట్టుకోమని అంటుంది. రామ్ దానికి ముద్దు పెట్టుకోగానే అందులో నుంచి  ఐ లవ్‌ యూ మామ అని మాటలు వినిపిస్తాయి. రామ్ సర్‌ఫ్రైజ్‌గా ఫీలవుతాడు. సీతని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. సీత పరుగులు పెడుతుంది. సీతకు ముద్దు పెట్టి సీత ఇచ్చిన బొమ్మ పట్టుకొని కూర్చొంటాడు రామ్.


మరోవైపు శివకృష్ణ సీత గెలిచినందుకు స్వీట్స్ తీసుకొని ఇంటికి వస్తాడు. అందరికీ స్వీట్స్ ఇస్తాడు. మధు ఇంటి నుంచి వెళ్లిందో లేదో అని సీతకి ఫోన్ చేయాలి అనుకుంటే సీతే ఫోన్ చేస్తుంది. ఇక సీత.. మధు బావ సూర్యతో వెళ్లిపోయింది అని అక్కని అపార్థం చేసుకోవద్దు అని అక్కా బావలను మీరే చూసుకోవాలి అని మాట తీసుకుంటుంది. ఇక శివకృష్ణ విద్యాదేవితో మాట్లాడుతాను అని అంటాడు. సీత ఆవిడకు ఫోన్ ఇస్తుంది. శివకృష్ణ విద్యాదేవికి థ్యాంక్స్ చెప్తాడు. ఇక నువ్వు మాట్లాడుతుంటే మా చెల్లి మాట్లాడుతున్నట్లు ఉందని శివకృష్ణ అంటే విద్యాదేవి తనని చెల్లి అని అనుకోమని చెప్తుంది. 


ఇక మహాలక్ష్మీ వాళ్లు అందరూ సీత ఇచ్చిన ట్విస్ట్ గురించి మాట్లాడుకుంటారు. సీత తన అంచనాలను తల కిందుల చేసిందని అంతా విద్యాదేవి వల్లే అని అనుకుంటారు. సీత విద్యాదేవి కలిసి తమని చిత్తు చిత్తుగా ఓడించిందని ఆవిడ ఇంట్లో ఉంటే ఇంకా ఏం చేస్తుందా అని అంటారు. మహా కూడా విద్యాదేవి జనార్థన్‌తో క్లోజ్‌గా మాట్లాడిన విషయం గుర్తు చేసుకుంటుంది. పోటీ అయిపోయింది కాబట్టి ఆవిడను పంపేయాలి అనుకుంటారు. సీత వాళ్ల మాటలు చాటుగా వింటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: మహదేవయ్యను చంపడానికి ప్రయత్నిస్తున్న అజ్ఞాత వ్యక్తి కన్న కొడుకేనా!