Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మి రేవతికి మంచి సంబంధం చూశాను అని పెళ్లి చేస్తామంటే రేవతి వద్దని చెప్తుంది. సీత వచ్చి పిన్ని పెళ్లికి నేను కూడా వెయిటింగ్ అని అంటుంది. సీత రేవతిని ఒప్పుకోమని అంటుంది. రామ్ కూడా రేవతికి ఒప్పుకోమని చెప్తాడు. రేవతి ఏదో మాట్లాడుబోతే సీత సైగ చేస్తుంది. దాంతో రేవతి ఏం చెప్పుకుండా వెళ్లిపోతుంది. దానికి సీత ఏమీ చెప్పుకుండా వెళ్లిపోతే ఓకే అని అర్థమని అక్కడున్న వారికి చెప్పి పెళ్లి చూపులకు అంతా ఏర్పాట్లు చేసుకోమని అంటుంది. కుదిరితే వాళ్లకి ఇవాళే రప్పించమని చెప్తుంది.


అర్చన: కొంప తీసి ఆ సీత మనల్ని మోసం చేయడం లేదు కదా మహా.
మహాలక్ష్మి: నేను అదే ఆలోచిస్తున్నా. 
జనార్థన్: అదేం అయిండదు మహా. సీతకి కూడా రేవతి ఇష్టం కదా. 
మహాలక్ష్మి: సీత ఏం చేసినా ఈ పెళ్లి ఆపలేదు. పెళ్లి కొడుకుని రిజెక్ట్ చేయడానికి కూడా రేవతికి కారణం ఉండదు. పెళ్లి వాళ్లకి చెప్పి రప్పించండి.
రేవతి: సీత.. రేపు నేను పెళ్లి చూపుల్లో ఎలా కూర్చొను నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.
సీత: పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతావా పిన్ని. జీవితాంతం ఇలాగే ఉండిపోతావా.
రేవతి: నా ప్రేమ గురించి నీకు ఇంతకు ముందే చెప్పాను సీత. నా మనసులో ఆయనకు తప్ప మరో మనిషికి చోటు లేదు.
సీత: గుర్తుంది పిన్ని నీ ప్రేమ అందరికీ గుర్తు చేయాలి అనే ఇలా చేశాను. 
రేవతి: ఎవరైతే నాకు ఈ రోజు పెళ్లి చేయాలి అని చూస్తున్నారో వాళ్లే ఆ రోజు నా పెళ్లి అవ్వకుండా చేశారు. ఆయన్ని అవమానించి తరిమేశారు. ఆయన్ని తప్ప వేరే వాళ్లని నేను పెళ్లి చేసుకోను. 
సీత: నువ్వు ప్రేమించిన మనిషితోనే నీ పెళ్లి జరగాలి అని నేను కోరుకుంటున్నాను పిన్ని. కానీ నువ్వు ప్రేమించిన మనిషితో కాకుండా వేరే ఎవరితో నీ పెళ్లి చేసినా తప్పు అని వాళ్లు తెలుసుకోవాలి. ఇంకో సారి నీ పెళ్లి ప్రస్తావన తీసుకురావడానికి వాళ్లు భయపడేలా నేను చేస్తా. అందుకు నేను వాళ్లతో మాట్లాడను. నీతోనే మాట్లాడిస్తాను. పెళ్లి చూపుల్లో మీరే చేస్తారుగా.
రేవతి: నా వల్ల నువ్వు సమస్యల్లో పడొద్దు సీత. 
సీత: నిన్ను నన్ను వేరు చేయాలి అని చూస్తున్నారు. కాని మీ పెళ్లి మీరు కోరుకునే వ్యక్తి తోనే జరుగుతుంది. రేపు మన ప్లాన్‌కి అందరి మైండ్ పోతుంది. 


జలజ, మధులు బట్టలు మడత పెడుతుంది. సూర్య వచ్చి ఆకలి వేస్తుంది అన్నం పెట్టమని అడుగుతాడు. మధు అన్నం వేసి తీసుకెళ్లి సూర్య ముందు పెడితే సూర్య ప్లేట్ విసిరేస్తాడు. కొందరి చేతులతో పెడితే విషంలా ఉంటుందని అని తన వదినను పిలిచి వడ్డించమని అంటాడు. వదినా నువ్వు వడ్డిస్తే తింటాను లేదంటే బయటకు వెళ్లి భిక్షం పెట్టుకుంటా అని అంటాడు. దాంతో జలజ వడ్డించి తెస్తుంది. ఇక మధు కింద పడేసిన అన్నం ఎత్తుతుంది. సూర్య అన్న వస్తే జలజ జరిగింది చెప్తాడు. తన అన్న సర్ది చెప్తే మేం కలుస్తాం అని నాకు నమ్మకం లేదు అని అంటాడు. ఇక మధు కూడా ఫైర్ అవుతుంది. ప్రతీ క్షణం తనని అవమానిస్తున్నాడని తన చేతకాని తనాన్ని తన మీద రుద్దు తున్నాడని తిడుతుంది. దాంతో సూర్య మధుని ఇంటి నుంచి వెళ్లిపోమని అంటాడు. అవసరం అయితే మహాలక్ష్మి ఇంటికి వెళ్లిపో అని అంటాడు. సూర్య అన్న ఇద్దరిని ఆపి సూర్యని తినమని చెప్తాడు. సూర్య మధుని తిడుతూ జలజ చేతి వంట బాగుందని అంటాడు. దాంతో మధు అది తను వండిన వంటే అని అంటుంది. 


ఇక జలజ మీరిద్దరూ కొట్టుకునే బదులు విడిపోండి అని అంటుంది. జలజను తన భర్త తిడతాడు. ఇక సూర్య కూడా మేం కలిసి ఉండమని అంటాడు. మరోవైపు మహాలక్ష్మి పెళ్లి వాళ్లకి అడ్రస్ చెప్పి రమ్మని చెప్తుంది. అందరికి చెప్పి హడావుడి చేస్తుంది. మర్యాదలు బాగుండాలి అని జనార్థన్ చెప్తాడు. ఇక రామ్, సీతలు కూడా అక్కడికి వస్తారు. విద్యాదేవి రేవతిని రెడీ చేస్తుందని అంటుంది. ఇంతలో పెళ్లి వాళ్లు వస్తారు. సీత హడావుడిని చూసి అర్చన తనకు ఏదో అనుమానం ఉందని అంటుంది. దాంతో మహాలక్ష్మి సీత, రేవతి ఏం ప్లాన్ చేసినా నా ప్లాన్ నాకు ఉందని అంటుంది. చలపతికి రేవతికి పెళ్లి చూపులు అని తెలిసి షాక్ అయిపోయి పెద్దగా అరుస్తాడు. పెళ్లి చూపులకు రేవతి ఒప్పుకుంది అని తెలిసి షాక్ అవుతాడు. 


విద్యాదేవి, రేవతి మాట్లాడుకుంటారు. విద్యాదేవి రేవతితో ఎందుకు ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదని అంటుంది. దానికి రేవతి తనకి తానే శిక్షించుకున్నాను అని అంటుంది. దానికి విద్యాదేవి మనసులో నీ సమస్య నేను పరిష్కరిస్తాను రేవతి అని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: నీ తండ్రి ఎవరు అని శౌర్యని ప్రశ్నించిన పారిజాతం.. దీప, కార్తీక్‌లు కలవకుండా జ్యోత్స్న మరో ప్లాన్!