Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode పారిజాతం జ్యోత్స్న దగ్గరకు వెళ్తుంది. అంతా అయిపోయిందని, నువ్వు అనుమానించినట్లే కార్తీక్, దీపలు కొత్త మీటింగ్ పాయింట్ వెతుకున్నారు అని జ్యోత్స్నతో పారు చెప్తుంది. జ్యో షాక్ అయిపోతుంది. అక్కడా ఇక్కడా చూస్తే ఎవరికైనా అనుమానం వస్తుందని నీ బావ డైరెక్ట్‌గా తన ఇంట్లోనే పెట్టుకున్నాడని చెప్తుంది. 


పారిజాతం: మీ అత్తకి బాలేదు అని నీకు తెలుసా. కానీ దీపకు తెలుసు. సాయానికి నీకు పిలిచాడా. కానీ దీపని పిలిచాడు. ఇప్పుడు కాంచనకు కోడలు నువ్వో దీపో కూడా నాకు అర్థం కావడం లేదు. 
జ్యోత్స్న: గ్రానీ... నువ్వు చెప్పేది వింటుంటే నాకు మండిపోతుంది. అది నా జీవితంలో నిప్పులు పోస్తుంది. 
పారిజాతం: నువ్వు హోటల్‌కి వెళ్లి వార్నింగ్ ఇచ్చావ్ కదా దాని కౌంటరే ఇది.
జ్యోత్స్న: దీప వచ్చి వంట చేస్తే అత్త ఎందుకు ఊరుకుంది. అత్తకు నువ్వు అయినా చెప్పాలి కదా.
పారిజాతం: కాంచన కొడుకుమాట తప్ప ఇంకెవరిదీ వినదు కదా. 
జ్యోత్స్న: మరి నువ్వు ఎందుకు అక్కడికి వెళ్లావు.(పారిపాతం తినడానికి వెళ్లాను. వంటలు బాగున్నాయి అని అంటే) గ్రానీ నీకు ఏమైంది. మ్యాటర్ ఇంత సీరియస్‌గా ఉంటే నువ్వు జోకులు వేస్తున్నావ్. 
పారిజాతం: అక్కడికి వెళ్లగానే నా మతి పోయింది. ఆటలో అరటి పండు అయిపోయింది నా పరిస్థితి. నేను వెళ్లింది నీ పెళ్లి ముహూర్తాలు పెట్టించడానికి. మనది అనుకున్న సీటులో ఎవరో వచ్చి రుమాలు వేసేలా. నువ్వు ఆ ఇంట్లో పాలు పొంగించేలోపు అది వచ్చి ఎసరు పొంగించి వెళ్లిపోయింది. ఇన్నాళ్లు నాకు దీప అంటే కోపం ఉండేది. ఇప్పుడు భయం పట్టుకుంది. 
జ్యోత్స్న: ఎందుకు.
పారిజాతం: ఆ ఇంట్లో పాలు కూడా అదే పొంగించేస్తుంది అనుకో. అదే కానీ జరిగితే.. విషయం అంత వరకు వెళ్లకూడదు అంటే ఇప్పుడే ఆ దీపను ఒక దులుపు దులిపేయాలి.
జ్యోత్స్న: అవసరం లేదు. నిన్న దీపను బావ ఇంటి దగ్గర దింపినప్పుడే ఆలోచించాల్సింది. ఇప్పుడు ఇలా జరగడం మనకు మంచిదే. దీప ఇంటికి వెళ్తుందని తెలిసింది. ఇప్పుడు అక్కడ కూడా కలవకుండా చేయాలి. నువ్వు ఇంట్లో చేయాల్సింది ఇంట్లో చేయ్ నేను వాళ్లని ఆపుతా.


కాంచన: కార్తీక్ నిన్న మీ తాతయ్య పారు వచ్చారురా. వచ్చే ముహూర్తాలలో నీ పెళ్లి చేద్దాం అన్నారు. నేను సరే అన్నాను. కానీ ఎప్పుడు ఏంటి అనేది నీ ఇష్టం. వాళ్లకి నేను సరే అని చెప్పనా.
కార్తీక్: వద్దమ్మా. నాకు కొంచెం టైం కావాలి. 
కాంచన: ఎప్పుడూ అదే చెప్తావారా .అసలు నీకు జ్యోత్స్న మీద ఉన్న అభిప్రాయం చెప్పరా. నువ్వేం చెప్తావో వినాలి అని ఉంది. అంటే నా ఉద్దేశం ఇప్పుడు పెళ్లి చేసుకుంటావా. రెస్టారెంట్ అయిన తర్వాత చేస్తావా అని.


కార్తీక్‌కి శౌర్య కాల్ చేసి.. కార్తీక్ రెడీ అయ్యావా. ఈ రోజు ఫాదర్స్ డే కదా నువ్వు రావాలి అంటుంది. కార్తీక్ కుదరదు అంటే నువ్వు రావాలి.. వస్తున్నావ్ అని ఫోన్ పెట్టేస్తుంది. కాంచనకు కార్తీక్ విషయం చెప్తే కాంచన వద్దు అంటుంది. ఇక కార్తీక్ పసి దానికి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని కార్తీక్ అంటే కాంచన సరే అంటుంది. దీప వచ్చి వంట చేసిందని కాంచన చెప్తుంది. కార్తీక్ దీపకు థ్యాంక్స్ చెప్పాలి అని అంటాడు. ఇక కాంచన ఈ తరం గుర్తుండిపోయాలే ఈ పెళ్లి చేయాలని అంటుంది. శౌర్య జ్యోత్స్న వాళ్ల ఇంటికి వస్తుంది. అందరూ హాల్‌లో ఉంటే దశరథ్‌కి చాక్లెట్ ఇచ్చి శివనారాయణకు ఫాదర్స్ డే విషెష్ చెప్పమని అంటుంది. ఇక జ్యోత్స్నకి కూడా చాక్లెట్ ఇచ్చి దశరథ్‌కి విష్ చేయమని అంటుంది. 


జ్యోత్స్న: నేను గుర్తుంచుకోవాల్సిన విషయం నాకు గుర్తు చేసి నన్ను సిగ్గు పడేలా చేశావ్. థ్యాంక్యూ శౌర్య. డాడీ హ్యాపీ ఫాదర్స్ డే.
దశరథ్: సుమిత్ర మనం దీనికి ఇవ్వాల్సింది పోయి శౌర్య మనకు చాక్లెట్స్ ఇచ్చింది కదా. దీనికి మనం చాక్లెట్ బాక్స్ ఇవ్వాలి.
పారిజాతం: శౌర్య హ్యాపీ ఫాదర్స్ డే చెప్పమని మా అందరికీ చెప్పావ్ ఇంతకీ నువ్వు చెప్పావా లేదా.
దీప: నర్శింహ గురించి చెప్పేస్తుందా ఏంటి.. శౌర్య పద స్కూల్‌కి టైం అయింది. స్కూల్‌లో ఫాదర్స్ డే ఫంక్షన్ ఉందండి దానికి తీసుకెళ్లాలి. 
శివనారాయణ: పారిజాతం నీ లిమిట్స్‌లో నువ్వు ఉంటే మంచిది.
పారిజాతం: దానికి తండ్రి అంటే ఎంత ఇష్టమో మీకు అర్థం కావడం లేదా. అంత ఇష్టమైన శౌర్యకి తండ్రి ఎదురుగా లేకపోవడం కష్టమే కదా. ఏ శౌర్య నువ్వు అమ్మని అడగలేదా. వెళ్లిరండి వెళ్లి రండి హ్యీపీగా వెళ్లండి. 
శౌర్య: మేం ఇద్దరం కాదు. ముగ్గురం.
పారిజాతం: నాన్న లేడు కదా.
శౌర్య: కార్తీక్ ఉన్నాడు కదా. ఫాదర్స్ డే ఫంక్షన్‌కి కార్తీక్‌కి రమ్మని ఫోన్ చేశాను వస్తాను అన్నాడు.  
పారిజాతం: చూశారా దీపే కార్తీక్‌కి ఫోన్ చేసుంటుంది.


అందరూ పారిజాతాన్నే తిడతారు. ఇక నర్శింహ దీప మాటలతో లొంగడం లేదు అని తానే తండ్రి అని చెప్పేస్తాను అని అనుకుంటాడు. ఇక జ్యోత్స్న స్కూల్‌ దగ్గరకు వస్తుంది. శౌర్య గార్డెన్ తను అని కార్తీక్‌కి ఎంట్రీ ఉండదని అనుకుంటుంది. దీప శౌర్యలు కూడా ఫంక్షన్‌కి వస్తారు. కార్తీక్‌కి కాల్ చేస్తా అని శౌర్య ఫోన్ అడుగుతుంది. ఇక జ్యోత్స్న కూడా అక్కడికి వచ్చి దీప పక్కనే కూర్చొంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్: లలితాదేవి వింత ప్రవర్తనకు బిత్తరపోయిన నయని, విశాల్.. అసలు ఆవిడ లలితాదేవేనా!