Jabardasth June 28th Episod Promo: ఎప్పటిలాగే ఈ వారం కూడా బుల్లితెర ప్రేక్షకులను బాగా అలరించబోతుంది ‘జబర్దస్త్’ కామెడీ షో. తాజాగా ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది.
రాం ప్రసాద్ లెక్కలు - టీమ్ మెంబర్స్ కు చిక్కులు
‘జబర్దస్త్‘ తాజా ప్రోమో ఆటో రాం ప్రసాద్ స్కిట్ తో మొదలయ్యింది. రాం ప్రసాద్ జమీందారుగా కనిపించాడు. “లెక్కలన్నీ బాగానే ఉన్నాయారా?” అని తన గుమస్తాను అడుగుతాడు. “అన్నీ బాగానే ఉన్నాయి” అని గుమస్తా చెప్తాడు. “కృష్ణగాడు వచ్చాడు. 3,600 ఇచ్చాడా?” అని అడుతాడు. “ఇచ్చాడు” అని చెప్తాడు. అప్పారావు వచ్చి 17,750 ఇచ్చాడా?” అని అడుగుతాడు. “ఇచ్చాడు” అని చెప్తాడు. “దుర్గారావు వచ్చి 8,030 రూపాయాలు ఇచ్చాడా?” అని అడుగుతాడు. “ఇచ్చాడు” అని చెప్తాడు. “మొత్తం మూడు కలిపితే ఎంత?” అని అడగడంతో గుమస్తా షాక్ అవుతాడు. అప్పుడే తన స్కిట్ లోకి రోహిణి ఎంటర్ అవుతుంది. “నిన్ను చిన్న లెక్క అడుగుతా చెప్తావా?” అంటాడు రాం ప్రసాద్. “చెప్తా” అంటుంది రోహిణి. “నేను హోటల్ కు వెళ్లి ఓ ప్లేట్ ఇడ్లీ పట్టుకొచ్చా. నాలుగు ఇడ్లీలు ఇచ్చాడు. రెండు నీకు, మరో రెండు వాడికి ఇచ్చాను. ఇప్పుడు నా దగ్గర ఏం ఉంటాయి?” అని అడుగుతాడు. “ఏం ఉండవు” అని రోహిణి చెప్తుంది. “చట్నీ ఉంటుంది” అంటూ ఫన్ చేస్తాడు ప్రసాద్.
భార్య భయంతో వణకాలి అంటున్న రాఘవ
రాఘవ స్కిట్ భార్య భర్త చెప్పు చేతుల్లో ఉండాలి అన్నట్లగానే సాగింది. “కాఫీ టేస్ట్ అనేది పంచదారలో, కాఫీ పౌడర్ లో ఉండదు. భార్య భర్తను చూస్తూ వణుకుతూ వచ్చి ఇచ్చే విధానంలో ఉంటుంది” అని చెప్పడంతో అందరూ నవ్వుతారు. “నేను చదువుకోవాలి అనుకుంటున్నానండీ” అంటూ భార్య రాఘవతో అనడంతో “చదివి ఏం పీకుతావ్” అంటాడు. “ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు” అని పెద్దలు చెప్పారు అంటుంది. “కుష్బూ మేడం, రష్మి గారు బాగా చదువుకున్నారు కదా.. మరి బయట జనరేటర్ ఎందుకు పెట్టారు? వెలగమను ఇక్కడ” అనడంతో షోలో నవ్వులే నవ్వులు. “భార్య చలికాలంలో కాదు.. భర్త ఎప్పుడు వస్తే అప్పుడు వణకాలి” అంటు ఫన్ జెనరేట్ చేస్తాడు రాఘవ.
ట్విన్స్ తో ప్రేమ- కన్ఫ్యూజ్ అయిన తాగుబోతు రమేష్, నూకరాజు
కవల పిల్లలు అయిన అక్కా చెల్లెళ్లతో నూకరాజు, తాగుబోతు రమేష్ ప్రేమలో పడతారు. వాళ్లు ట్విన్స్ అనే విషయం తెలియక ఇద్దరూ కన్వ్యూజ్ కావడం, ఒకరి కోసం మరొకరు తమ ప్రేమను వదులుకోవాలి అనుకోవడం అందరినీ నవ్విస్తుంది. ఇక బుల్లెట్ భాస్కర్ జడ్జీలు కుష్బూ, కృష్ణ భగవాన్ ను ఇమిటేట్ చేస్తారు. ఆయన ఇమిటేషన్ కు కృష్ణ భగవాన్ 5 మార్కుల బోర్డు చూపించడంతో వద్దు అంటూ భాస్కర్ దండం పెట్టడం నవ్విస్తుంది.
ఆకు కోసం కొట్లాడిన ఫైమా, సత్య ఫైటింగ్
“మీ చెట్టు ఆకు మా ఇంట్లో పడింది” అంటూ పైమా సత్యకు కంప్లైట్ చేస్తుంది. “అది మీ ఇంట్లో పడింది కాబట్టి నీ ఆకే” అంటూ సత్య కోపంగా చెప్తుంది. “దీనికి మాటలో చెప్తే అర్థం కాదు” అంటూ సత్యను పైమా కొడుతుంది. వెంటనే సత్య భర్త భాస్కర్ వచ్చి గొడవను ఆపే ప్రయత్నం చేస్తాడు. “ఆడవాళ్ల గొడవలోకి నువ్వు ఎందుకు వచ్చావురా?” అంటూ భాస్కర్ ను కూడా పైమా కొట్టడంతో అందరూ నవ్వుతారు.
ఇమ్మాన్యుయేల్ డబుల్ మీనింగ్ పంచులు- రియాజ్ జగన్ ఇమిటేషన్
“నేను తాగి ఇంటికి ఎప్పుడు వస్తానే?” అంటాడు ఇమ్మాన్యుయేల్. “మీరు తాగితే ఇంటికి వస్తారో? రారో తెలియదు” అంటుంది వర్ష. “మరి ఎందుకే ఇంత అందంగా తయారయ్యావు” అంటూ డబుల్ మీనింగ్ పంచులు వేస్తాడు. “నువ్వు నాకు అవసరం లేదు ఇంట్లో నుంచి వెళ్లిపో” అంటాడు. “వద్దులే నాన్నా, అమ్మే కదా, పోనీయ్ లే” అంటాడు రియాజ్. “వద్దురా” అంటాడు ఇమ్మూ. “ఉండనియ్ లే అమ్మా, ఉండనియ్ లే అమ్మా, ఉండనియ్ లే అమ్మా” అంటూ రియాజ్.. జగన్ ను ఇమిటేట్ ఇచేస్తాడు.
Read Also: ‘మట్కా’ కోసం రామోజీ ఫిలిం సిటీలో వింటేజ్ వైజాగ్ సెట్, వామ్మో.. ఖర్చు అన్ని కోట్లా?