Trinayani Today Episode లలితాదేవి చేతికి గాయమై పెద్ద కట్లతో ఇంటికి వస్తుంది. ఇక గదిలోకి వెళ్లిన ఆవిడ నుంచి విశాల్‌కి పదే పదే కాల్స్ రావడంతో విశాల్, నయని, హాసినిలు ఆలోచనలో పడతారు. స్నానానికి వెళ్లిన ఆమె ఫోన్ చేయడం, కాల్ చేస్తే లిఫ్ట్ చేయకుండా బిజీ అని మెసేజ్ పెట్టడం ఏంటా అని ఆలోచనలో పడతారు.
నయని: ఇంట్లోనే ఉంటే బిజీ అని మెసేజ్ పెట్టడం ఏంటి.
విశాల్: నయని ఎందుకో నాకు కాస్త కన్ఫూజన్‌గా ఉంది.
ఉదయం ఇంట్లో ఎడమ చేతితో లలితాదేవి ముగ్గు పెడుతుంటే హాసిని రంగులు అద్దుతుంది. ఇక లలితాదేవి వల్లభో గాయత్రీ దేవి ఫొటో తీసుకురమ్మని చెప్తుంది. విశాల్, నయని కూడా వస్తారు. ఏం చేస్తున్నారని అడుగుతారు.
లలితాదేవి: మొన్న ఇంట్లో మా చెల్లి గాయత్రీ దేవి ఆబిద్ధకం చేశారంట కదా. నట్టింట్లో తిలోత్తమ అద్దం ముక్కలు చేసిందని తెలిసింది. చూసుకునే అద్దాన్ని పెద్ద ముత్తయిదువు అయిన తిలోత్తమ విరగ్గొట్టడం వల్ల నా చెల్లి ఆత్మకు శాంతి కలగదు.
నయని: ఆత్మకి శాంతి కలగడం ఏంటి పెద్దత్తయ్య గారు అమ్మగారు పునర్జన్మ ఎత్తారు కదా. పునర్జన్మ ఎత్తినప్పుడు మళ్లీ ఆత్మకు శాంతి కలగాలి అని కోరుకోవడం ఏంటి.
విశాల్: ఎవరైనా అలా అంటే వారించే మీరే అమ్మ ఆత్మకు శాంతి కలగాలి అనడం ఆశ్చర్యంగా ఉంది.
లలితాదేవి: నాన్న విశాల్ నా చెల్లి పునర్జన్మ ఎత్తిందని నిన్ను పెంచిన తిలోత్తమకు తెలీదా. తెలుసు అయినా సరే మొండిగా వర్థంతి జరిపించింది. అది అరిష్టం కదా. అందుకే ఆత్మ విమోచనం, శాంతికి సంబంధించిన వ్యవహారాన్ని సరిదిద్దుకుంటే తప్ప పూర్వజన్మ తాలూకు ఇబ్బందులు తొలగిపోవు.
నయని: ఇప్పుడేం చేస్తారు అమ్మగారు.
లలితాదేవి: చెప్తానుగా. హాసిని నువ్వు వెళ్లి ఐదు నిమ్మకాయలు, పసుపుకుంకుమ, ప్రమిద తీసుకురా. వల్లభ నువ్వు ఆ ఫొటోని ముగ్గు మధ్యలో పెట్టు.
విక్రాంత్: ఇలాంటి రెమిడీ నేను ఎప్పుడూ చూడలేదు.
ఇక లలితాదేవి పసుపు కుంకుమలను గాయత్రీ దేవి ఫొటో మీద గాయత్రీ పాపతో చల్లమని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. విక్రాంత్ పసిపాపతో అలాంటి పనులు చేయించొద్దని అంటాడు. నయని, విశాల్‌లు ఇబ్బంది పడతారు. ఇక విశాల్ పర్లేదు అంటే గాయత్రీ పాపతో నయని పసుపు కుంకుమ చల్లిస్తుంది. ఇంతలో ఇంట్లో పెద్దగా గాలి వీస్తుంది. లలితాదేవి మాత్రం అంతా మంచే జరుగుతుందని అంటుంది. ఇక పాపతో నయని ఫొటో చుట్టూ నిమ్మకాయలు పెట్టిస్తుంది. పాప చేతనే దీప కూడా పెట్టించమని లలితా దేవి చెప్తుంది. వెలిగించే టైంకి ఇంట్లో పెనుగాలి ఆగిపోతుంది.
లలితాదేవి: మనసులో.. ఈ దీపం వెలగ్గానే అసలు విషయం బయట పడుతుంది.
నయని: మనసులో.. విశాలాక్షి అమ్మ తల్లి నాకు ఎందుకో ఈ పరిష్కారం మార్గం మీద అనుమానంగా ఉంది. ఏదైనా తేడా ఉంటే తప్పించు తల్లి.
దీపం వెలిగించే టైంకి ఫొటో చుట్టూ పెట్టిన నిమ్మకాయలు గాల్లోకి లేస్తాయి. అందరూ షాక్ అయిపోతారు. అంతలోనే నిమ్మకాయలు దీపం కుందె మీద పడి నూనె లలితాదేవి ముఖం మీద పడుతుంది. ఇక గాయత్రీ పాప చేతిలోని అగ్గిపుల్ల పడేయడంతో లలితాదేవి ముఖం దగ్గరకు వెళ్లి అగ్గిపుల్ల నిల్చుంటుంది. దాని నుంచి మసి కిందకి పడుతుంది. లలితాదేవి నయనిని తిడుతుంది. నూనె నా మీద పడిందని నిప్పు రవ్వ నా మీద పడితే చనిపోనా అని చనిపోవాలి అని చూస్తున్నావా అని కోప్పడి ఇంటికి వెళ్లిపోతుంది. నయని ఏడుస్తుంది.
విశాల్: నయని పెద్దమ్మ అన్న మాటలకు ఫీలవుతున్నావా.
నయని: పర్లేదు కానీ ఎందుకు అలా మాట్లాడారో అర్థం కాలేదు. తిలోత్తమ అత్తయ్య ఏమైనట్లు. పెద్దమ్మ వస్తున్నారు అని ఎవరికీ తెలీదు కదా మరి ఏమైనట్లు. తిలోత్తమ అత్తయ్య ఇంటి పట్టునే ఉండొచ్చు కదా. ఏమైందో ఎక్కడికి వెళ్లిందో తెలీదు. పెద్దమ్మ గారు రేపు కూడా ఉంటాను అన్నారు.
విశాల్: అలా అయితే తిలోత్తమ అమ్మ రేపు కూడా రాకపోవచ్చు. వస్తే పెద్దమ్మ తన చేతి గురించి ఆరా తీస్తుంది. మనకు ఉన్నంత ఓపిక పెద్దమ్మకు లేదు. పెద్దమ్మ ఇంట్లో ఉంది అని చెప్పకుండా తిలోత్తమ అమ్మను రప్పించాలి. తిలోత్తమ అమ్మ ఇంటికి వచ్చిందని అబద్ధం ఆడుదాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చూస్తావ్ కదా.
వల్లభ గంటలమ్మ దగ్గరకు వెళ్తుంది. తన తల్లి కనిపించడం లేదు అని వల్లభ గంటలమ్మకు చెప్తాడు. దాంతో గంటలమ్మ నువ్వు చూడటం లేదు అని అంటాడు. మీ అమ్మ మీ ఇంట్లోనే ఉంది అని గంటలమ్మ అంటుంది. ఇక లలితాదేవి గురించి గంటలమ్మ అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.