Seethe Ramudi Katnam Today Episode ప్రీతి ఉషలు మహాలక్ష్మికి కాల్ చేసి సీత, రామ్‌లకు విద్యాదేవి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసిందని చెప్తుంది. మహాలక్ష్మి కారు వెనక్కి తిప్పిస్తుంది. విషయం అర్చన వాళ్లకు చెప్తుంది. మరోవైపు రామ్ పూలు స్వీట్స్ తీసుకొని ఇంటికి వస్తాడు. సీత రెడీ అయి గదిలో ఉంటుంది. రామ్ సైలెంట్‌గా వచ్చి సీతని హగ్ చేసుకుంటాడు.
మహాలక్ష్మి: జనా ఇంకా ఫాస్ట్‌గా వెళ్లు. త్వరగా ఇంటికి వెళ్లాలి. ఆ దారుణాన్ని ఆపాలి.
అర్చన: ఆ టీచర్‌కి ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తుంది మహా.
మహాలక్ష్మి: ఇది టీచర్ ఒక్కదాని ప్లాన్ అయిండదు. సీత కూడా ఐడియా ఇచ్చుంటుంది.
జనార్థన్: ఫంక్షన్ గురించి మనం ఎవరికీ చెప్పలేదు కదా మహా. వాళ్లే విని ఇలా ప్లాన్ చేసుంటారు.
అర్చన: వాళ్లు ఏం చేసినా మహాకు తెలీకుండా ఇలా చేయడం తప్పు బావ.
మహాలక్ష్మి: రామ్ ఆఫీస్‌లోనే ఉండాలి అని ఎక్కువ వర్క్ ఇచ్చాను. కానీ తను కూడా వాళ్ల ట్రాప్‌లో పడ్డాడు. రామ్ ఈ పాటికి ఇంటికి వెళ్లిపోయి ఉంటాడు. ఎలా అయినా రామ్ సీతల్ని ఆపాలి. వాళ్లు కలిసిపోతే ఇక అంతే. రామ్ నా మాట కాదు అనడు. కానీ సీత దాని టీచర్ కలిసి కుట్ర చేసి ఉంటారు. వారిద్దరికీ రేవతి చలపతి తోడున్నారు కదా. ఈ నలుగురు కలిసి రామ్‌ని పొల్యూట్ చేసి ఉంటారు.
అర్చన: ముందు ఆ టీచర్‌ని ఇంటి నుంచి పంపేయాలి.
మహాలక్ష్మి: టీచర్ ఒక్కర్తే కాదు రేవతి, చలపతి కూడా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ల నలుగురిని ఇంటి నుంచి గెంటేయాలి.
జనార్థన్: అది జరగాలి అంటే మనం వెళ్లే సరికి రామ్ సీతలు ఒక్కటి కాకూడదు. కానీ ఈపాటికే వాళ్లు ఒకటి అయిపోయి ఉంటే.
మహాలక్ష్మి: నువ్వు ఆ మాట అనకు జనా. నా గుండె ఆగిపోతుంది.
రామ్ స్నానం చేసి వచ్చి సీత దగ్గరకు వెళ్లి జుట్టుతో సీత మీద నీటిని వేసేస్తాడు. సీతని హగ్ చేసుకొని ప్రేమగా ముద్దు పెట్టుకుంటాడు. తన వెంట తెచ్చిన మల్లెపూలు సీతకు పెడతాడు. స్వీట్ తినిపిస్తాడు. ఇంతలో మహా వాళ్లు ఇంటికి వచ్చేస్తారు. రామ్ సీత ఎక్కడ అని ప్రీతి, ఉషలను అడుగుతారు. రామ్ వచ్చి గంట అయిందని ప్రీతి చెప్తుంది. మహాలక్ష్మి రామ్‌ని పిలవాలి అని వెళ్తుంటే రేవతి అడ్డుకుంటుంది. ఈ టైంలో వాళ్లని ఇబ్బంది పెట్టడం తప్పని అంటుంది. విద్యాదేవి కూడా వస్తుంది. చలపతి, విద్యాదేవి మహాలక్ష్మిని వెటకారంగా మాట్లాడి తను రామ్, సీతలను ఇబ్బంది పెట్టదని అంటుంది. ఇంట్లో ఎవరూ రామ్, సీతలను ఇబ్బంది పెట్టరని సంస్కారవంతులని అంటుంది. మహాలక్ష్మి వీళ్లు ఇలా ఇరికించేశారు ఏంటని అనుకుంటుంది.
సీత, రామ్‌లు ఒకరికి ఒకరు పాలు తాగించుకుంటారు. విద్యాదేవి మహాలక్ష్మిని వెటకారంగా పొగిడి అందరినీ గదుల్లోకి వెళ్లిపోమని అంటారు. ప్రీతి వస్తుంటే మహాలక్ష్మి ప్రీతికి కాల్ అడ్డంగా పెట్టి పడిపోయేలా చేస్తుంది. కావాలనే పెద్దగా ప్రీతికి ఏదో అయిందని పెద్ద పెద్దగా అరుస్తుంది. అది విన్న రామ్ పిన్ని అరుస్తుందని ప్రీతికి ఏదో అయిందని పరుగున కిందకి వస్తాడు. రామ్ ప్రీతిని గదిలోకి తీసుకెళ్లి పడుకోబెడతాడు. సీత కూడా కిందకి వచ్చేస్తుంది. మహాలక్ష్మి కావాలనే కాలు అడ్డుపెట్టి పడేలా చేసిందని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.