Seethe Ramudi Katnam Today Episode : విద్యాదేవి జడ్జిగా ఉంటాను అంటే మహాలక్ష్మి ఒప్పుకోదు. విద్యాదేవి సీత వైపు ఉంది కాబట్టి సీతనే గెలిపించాలి అని చూస్తుందని అంటుంది. ఇక మువ్వాహాస్ అయితే బెటర్ అని మహా వైపు వారు అంటారు. చలపతి, రేవతి మువ్వాహాస్ తప్పుడు తీర్పు ఇస్తే పరిస్థితి ఏంటి అని అడుగుతారు. దానికి మువ్వాహాస్ తాను తాగుతాను తప్ప తప్పుడు తీర్పు ఇవ్వను అని అలా ఇస్తే నటరాజు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని నాకు తెలుసని అంటాడు.
 
విద్యాదేవి: నాట్యం మొదలైతే నాకు ముగ్గురు ఒకటే న్యాయమైన తీర్పు ఇస్తాను.


గిరిధర్: అంటే మా మాస్టారు అన్యాయమైన తీర్పు ఇస్తారనా. ఆయన నిజాయతీనే సంకిస్తున్నారా.


మహాలక్ష్మి: జడ్జిగా ఎవరు ఉన్నారో ఓటింగ్ పెటుకుందాం ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్లే జడ్జిగా ఉంటారు. మహ అలా చెప్పగానే ఓటింగ్ ప్రారంభమవుతుంది. మువ్వాహాస్‌కు 7 ఓట్లు పడతారు. విద్యాదేవికి 6 ఓట్లు వస్తాయి. రామ్‌ గదిలో ఉండటంతో పిలిచి మరో ఓటు వేయిస్తాం అంటే సీత వద్దు అని మువ్వాహాస్‌నే జడ్జిగా ఉండమని అంటుంది.


మువ్వాహాస్: ముందుగా సీత, ప్రీతి, ఉష ముగ్గురూ నాట్యం చేస్తారు. వారిలో ఎవరు బాగా చేయరో వాళ్లు తప్పుకుంటారు. తర్వాత మిగతా ఇద్దరి మధ్య పోటీ ఉంటుంది. ఇక మొదలు పెట్టండి.


సీత, ప్రీతి, ఉషలు తమ గురువులకు దండం పెట్టి పోటీలు ప్రారంభిస్తారు. గదిలో రామ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. మొదటి రౌండ్‌లో కన్నులతో చూసేది అంటూ ముగ్గురూ నాట్యం చేస్తారు. మధ్యలో ఉష తడబడుతుంది. దీంతో మువ్వా హాస్ మాస్టార్ ఉషని అవుట్ అని చెప్తారు. పది నిమిషాల తర్వాత సీత, ప్రీతిల మధ్య పోటీ ఉంటుందని చెప్తాడు. 


ఉష: సారీ పెద్దమ్మ.


మహాలక్ష్మి: ఇట్స్ ఓకే.. ప్రీతి నువ్వు బాగా నాట్యం చేసి సీతని ఓడించాలి. ఏమైనా తేడా అనిపిస్తే తన కాళ్లతో కాళ్లు పెట్టి కారం కళ్లలో పడేలా చేయ్. 


ప్రీతి: సరే పిన్ని.


మరోవైపు శివకృష్ణ ఫ్యామిలీ పోటీల గురించి టెన్షన్ పడుతుంటారు. అందరికీ కాల్ చేశామని ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు అని అంటాడు. ఇంతలో శివకృష్ణకు సాంబ ఫోన్ చేస్తాడు. పోటీలు మొదలయ్యాయి అని మొదటి రౌండ్‌లో ముగ్గురు అద్భుతంగా డ్యాన్స్ చేశారని ఉష పాప ఓడిపోయిందని అంటాడు. ఇప్పుడు రెండో రౌండ్ ప్రారంభమవుతుందని అందులో సీత, ప్రీతిలు పోటీ పడతారని చెప్తాడు. పోటీ అయ్యాక ఫోన్ చేస్తాను అని సాంబ చెప్తాడు. రెండో రౌండ్‌లోనూ సీత గెలవాలి అని శివకృష్ణ ఇంట్లో అందరూ దేవుడిని మొక్కుకుంటారు. 


రెండో రౌండ్ ప్రారంభమవుతుంది. ప్రీతి, సీతలు భరత వేదమున అంటూ డ్యాన్స్ చేస్తారు. ఇద్దరు పోటా పోటీగా అద్భుతంగా డ్యాన్స్ చేస్తారు. మధ్యలో మహాలక్ష్మి సైగ చేయడంతో ప్రీతి సీత కాళ్లలో కాలు పెట్టి సీత పడిపోయేలా చేస్తుంది. తర్వాత కారం పళ్లెం తన్న సీత కళ్లలో కారం పడేలా చేస్తుంది. దీంతో సీత కళ్లు మంట అంటూ విలవిల్లాడిపోతుంది. మువ్వాహాస్ పోటీ నిలిపేస్తారు. మహా వాళ్లు సీత ఓడిపోయిందని ప్రీతి గెలిచింది కదా అని అంటారు. 


విద్యాదేవి: ఇది అన్యాయం సీతని కింద పడేసి కళ్లలో కుంకుమ పడేలా చేసింది ప్రీతి. 


రేవతి: అవును సీతని ప్రీతి మోసంతో గెలివాలి అనుకుంది.


మహాలక్ష్మి: మోసం ఏంటి పోటీలో ఇలాంటివి జరగడం సహజం.


అర్చన: ప్రీతి కావాలని ఏం చేయలేదు. పొరపాటున జరిగింది అంతే.


విద్యాదేవి: కావాలని చేసినా పొరపాటు జరిగినా ఇది పోటీలకు విరుద్ధం. 


జనార్థన్: న్యాయం ఏంటో మీరే చెప్పండి మాస్తారూ.


మువ్వాహాస్: పోటీలో ఇలా జరగడం దురదృష్టకరం. జరిగిన దాన్ని పొరపాటుగా భావించి ప్రీతిని క్షమిస్తున్నాను. సీతకు 15 నిమిషాలు టైం ఇస్తున్నా ఈలోపు మళ్లీ డ్యాన్స్ చేస్తే ఓకే లేదంటే ప్రీతినే విన్నర్‌గా ప్రకటిస్తాను. సీతను తీసుకెళ్లి రెడీ చేయండి.


విద్యాదేవి: థ్యాంక్యూ మాస్టార్.


మహాలక్ష్మి:  సీత ఓడిపోయినట్లు డిక్లర్ చేయొచ్చుకదా మాస్టార్ ఎందుకు సీతకి టైం ఇచ్చారు. 


మువ్వాహాస్: అలా జరగదు నేను ముందే చెప్పాను పోటీలో న్యాయమైన తీర్పు ఇస్తాను అని అన్యాయం చేస్తే నటరాజు నా రెండు కాళ్లు తీసేస్తాడు.


విద్యాదేవి సీతని గదిలోకి తీసుకెళ్తుంది. సీత ముఖం కడిగి తీసుకొస్తాను అని అంటుంది. మహా ప్రీతిని పొగుడుతుంది. ఇక జనార్థన్ మాత్రం తనకి ఇలా చేయడం అన్యాయం అనిపిస్తుందని అంటాడు. ప్రీతి మాత్రం తనకు న్యాయం అనిపిస్తుందని మధు తనకు వదినగా కావాలి అని అంటుంది. 


మరోవైపు శివకృష్ణ వాళ్లు టెన్షన్ పడుతుంటారు. చలపతికి శివకృష్ణ కాల్ చేస్తాడు. చలపతి జరిగింది చెప్తాడు. సీత గెలవడం కష్టమన్నట్లు చెప్తాడు. దాంతో రేవతి వచ్చి చలపతి దగ్గర ఫోన్ తీసుకొని సీత గెలిచే వరకు వాళ్లకి ఏం చెప్పొద్ద అని అంటుంది. మరోవైపు సీత కళ్లు తెరవలేను అని ఏడుస్తుంది. కళ్లు భగ్గుమంటున్నాయి అని తెరవలేకపోతున్నాను అని ఏడుస్తుంది. సీతకి విద్యాదేవి ధైర్యం చెప్తుంది. ఇంతలో విద్యాదేవి ఇప్పుడే వస్తాను అని వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: బావని బుట్టలో వేసుకోమని జ్యోత్స్నకి సలహా ఇచ్చిన పారు.. శ్రీధర్, కావేరిలకు ఓ కూతురు కూడానా హవ్వా!