Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode  : శ్రీధర్ ఎందుకు వెళ్లిపోయాడని అడిగితే ఇక్కడే ఉంటే ఆయన రహస్యం బయట పడుతుందని వెళ్లిపోయాడని కార్తీక్ అంటారు. కార్తీక్‌కు నిజం తెలిసిపోయిందేమో అని దీప షాక్ అయి కార్తీక్‌ను చూస్తుంది. దీప ఎందుకు అలా చూస్తుంది ఏమైనా చెప్పాలి అనుకుంటుందా అని అనుకుంటాడు.


జ్యోత్స్న: వీళ్లిద్దరు ఎందుకు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. 


సుమిత్ర: ఏంట్రా ఆ రహస్యం.


కార్తీక్: ప్రతి మగాడి జీవితంలో కొన్ని రహస్యాలు ఉంటాయి అత్త. 


దీప: వీళ్ల నాన్న గురించి కార్తీక్ బాబు తెలిసినట్లే మాట్లాడుతున్నారు ఏంటి.


జ్యోత్స్న: బావ ఏంటి తనని అలా చూస్తున్నాడు. 


పారిజాతం: ఓరేయ్ మనవడా నా అల్లుడు శ్రీరామ చంద్రుడురా. నువ్వు లేనిపోని అనుమానాలు మాకు పెట్టకు. అసలే కాంచన చూడు ఎంత టెన్షన్ పడుతుందో. 


కాంచన: నేను ఏం కంగారు పడను అమ్మ. నిజంగా నా భర్త శ్రీరామచంద్రుడే.


శివనారాయణ: ఓరేయ్ మనవడా ఆ సీక్రెట్ చెప్పారా.


కార్తీక్: చెప్పేస్తున్నా.. ధూమపానం ఆరోగ్యానికి హానికరం.


కాంచన: మీనాన్న ఎప్పుడో సిగరెట్ మానేశారు కదరా. 


దశరథ్: అందుకేనమ్మా వాడు తెలివిగా మగాడి జీవితంలో కొన్ని రహస్యాలు ఉన్నాయి అని చెప్పాడు. 


దీప: సిగరెట్ కాల్చిన దానికే మీరు ఇంత బాధ పడితే మీ జీవితం కాల్చాడు అని తెలిస్తే ఎలా తట్టుకుంటారమ్మా. 


కార్తీక్: దీప వెనకే వెళ్లి.. మీరు నాతో ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా. నేను లోపల వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు మీరు నన్ను చూశారు మిమల్ని చూస్తే మీరు నాతో ఏదో చెప్పాలి అనుకుంటున్నారు. 


దీప: మనసులో.. అవును బాబు చెప్పాలి అనుకున్నా కానీ చెప్పలేకపోతున్నా. మీ నాన్న గారి గురించి తెలిస్తే ఆవిడ ఏమైపోతారో. 


కార్తీక్: ఇప్పుడు కూడా మనసులో ఏదో మాట్లాడుకుంటున్నారు. అది నాకు సంబంధించిన విషయం అయితే నాకు చెప్పండి. వేరే వాళ్లది  అయినా నాకు చెప్పండి నేను సాల్వ్ చేస్తా.


దీప: మనసులో.. వీళ్ల నాన్న గారి గురించి ఈయనతో చెప్పడం మంచిదేనా. ఏం లేదు బాబు. మీ అమ్మగారికి మీ నాన్న గారు అంటే చాలా ఇష్టం చాలా నమ్మకం. 


కార్తీక్: అంతే కాదు ప్రాణం కూడా. మా నాన్న అంటే నాకు గౌరవం. భర్తలందరూ మానాన్నలా ఉంటే అందరు ఆడవాళ్లు అదృష్టవంతులు. మరోవైపు జ్యోత్స్న కార్తీక్, దీప మాట్లాడుకోవడం చూసి రగిలిపోతుంది. ఇంత సేపు ఏం మాట్లాడుకుంటున్నారా అని అనుకుంటుంది. తల్లిని జాగ్రత్తగా చూసుకోమని దీప కార్తీక్‌తో చెప్తుంది. ఇక కార్తీక్ పాట బాగా పాడావని దీపని పొగుడుతాడు. 


శ్రీధర్ కావేరిని కలుస్తాడు. ఇద్దరూ ఓ రెస్టారెంట్‌లో కేక్ తింటూ మాట్లాడుతారు. శ్రీధర్ కావేరిలకు కూతురు ఉంటుంది. ఆమె కోచింగ్ కోసం డబ్బులు ఇస్తాడు శ్రీధర్. ఎక్కడికీ రాకుండా డబ్బులు ఇచ్చి వెళ్లిపోతే ఎలా అని డాడీ ఎప్పుడు వస్తారని పాప అడుగుతుందని చెప్పి కావేరి బాధ పడుతుంది. ముగ్గురం కలిసి బయటకు వెళ్దామని అడుగుతుందని అంటుంది. దానికి శ్రీధర్ వచ్చేవారం ముగ్గురం కలిసి బయటకు వెళ్తున్నాం అని చెప్తాడు. రెండో పెళ్లి గురించి తన కూతురికి తెలిస్తే ఎలా అని కావేరి అడుగుతుంది. కాంచనతో నిజం చెప్పమని కావేరి చెప్తుంది. అలా చెప్పలేను అని శ్రీధర్ అంటాడు. దాంతో కావేరి డబ్బుని శ్రీధర్ చేతిలో పెట్టి తన కూతురికి ఇవ్వమని చేతిలో పెట్టి వెళ్లిపోతుంది. 


దీప హోటల్‌ దగ్గరకు వస్తుంది. దీప డల్‌గా ఉండటం చూసి కడియం నర్శింహ ఏమైనా అన్నాడా అని అడుగుతాడు. లేదు అని దీప అంటుంది. వాడు ఏమైనా అంటే కార్తీక్ బాబు ఊరుకోడు అని అంటాడు. దీప ఆలోచనలో పడుతుంది. ఇక శౌర్యని ఇంటికి తీసుకొస్తానని దీప వెళ్తుంది.  


జ్యోత్స్న: ఇప్పటి వరకు బావకి నాతో సమయం గడపడానికి ఇష్టం లేదు అని అనుకున్నా కానీ నాతో మాట్లాడటం కూడా ఇష్టం లేదు అని ఈరోజు అర్థమైంది. దీపతో అయితే భలే మాట్లాడుతాడు. నాతో అయితే అడిగిన దానికి సమాధానం చెప్పడు. 


పారిజాతం: నువ్వు మాట్లాడొచ్చు కదా. నీకు అంత ఇగో ఎందుకే. నువ్వు దూరం పెడితే వాడు అవుట్ హౌస్‌కి వెళ్లిపోతాడు.


జ్యోత్స్న: గ్రానీ...


పారిజాతం: నీ బావ నీ మెడలో మూడు ముళ్లు వేసే వరకు నువ్వే ముడి వేసుకొని తిరగాలి. వగలో పొగలో ఏదో ఒకటి చూపించి నీ వైపు తిప్పుకోవాలి. అత్త మాటచ్చింది బావ ఎక్కడికి పోతాడు అనుకుంటే మగాడి దగ్గర ఇలాంటివి ఉండవు. నువ్వు కాస్త జాగ్రత్త పడటం మంచిది. పెళ్లి అయిపోతే నీకు నచ్చినట్లు నువ్వు ఆడుకోవచ్చు. శౌర్య బావ దగ్గరకు వెళ్లాి అనుకుంటుంది. కార్తీక్ మాత్రం దీపని తలచుకొని దీప దగ్గరకు వెళ్లి టీ తాగాలి అనుకుంటాడు. ఇంతలో జ్యోత్స్న అక్కడికి వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్ : తిలోత్తమను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండమని ఇంట్లో వాళ్లకి చెప్పిన విశాలాక్షి.. మళ్లీ వచ్చిన ఆత్మ!