Krishna Mukunda Murari Today Episode : మురారి గదిలో రిపోర్ట్స్ చూసి భవాని కుప్పకూలిపోతుంది. ఫైల్ పట్టుకొని కోపంతో కిందకి వెళ్తుంది. కృష్ణ అంటూ గట్టిగా అరుస్తుంది. అందరూ అక్కడికి వస్తారు. కృష్ణ ఏమైందా అని కంగారు పడుతుంది. ముకుంద మాత్రం కృష్ణని ఇన్ని రోజులు నెత్తిన పెట్టుకున్న అత్తయ్యే ఈరోజు నీ మీద పెద్దపులిలా పడుతుందని అనుకుంటుంది. 


కృష్ణ ఏమైంది అత్తయ్య అని అడిగితే భవాని ఎంత మోసం చేశావే అని చెంప మీద కొడుతుంది. అందరూ షాక్ అవుతారు. మీరా నవ్వుకుంటుంది. 


రేవతి: అక్కా కొట్టాల్సిన వారిని వదిలేసి దాన్ని ఎందుకు కొడతారు. అది ఏం తప్పు చేసింది. 


భవాని: ఏం తప్పు చేసినా ఈ ఫైల్ చూడు నీకే తెలుస్తుంది. 


ఆదర్శ్: ఫైల్ చూసి షాక్ అయిపోతాడు. వెటకారంగా నవ్వుతూ.. ఈ రిపోర్ట్ చూస్తే ఇన్నాళ్లు ఈ కృష్ణ మనల్ని పిచ్చొళ్ని చేసినందుకు మీకు కూడా పిచ్చొక్కుతుంది. లేదంటే నాలాగా పిచ్చొడిలా నవ్వుకుంటారు. పిన్ని నీ కొడుకు చేసినదానికి షాక్‌లో ఉంటే నీ కోడలు చేసిన నిర్వాకానికి ఏమైపోతావో. ఆస్కార్ రేంజ్‌లో వీళ్ల పెర్మామెన్స్. తల్లి కాబోతుంది అని తెగ సంబరపడిపోతున్నారు కదా పిన్ని అదంతా ఒట్టి నాటకం. ఏం లేదు అంతా వట్టిదే.  


రేవతి: రేయ్ ఏం మాట్లాడుతున్నావురా. 


ఆదర్శ్‌: నిజం పిన్ని అసలు ఈ కృష్ణ తల్లే కాదు. ఇప్పుడే కాదు ఈ జన్మలో తనకి పిల్లలు పుట్టే ఛాన్సే లేదు. కానీ తల్లిని కాబోతున్నట్లుగా వారసుడిని ఇవ్వబోతున్నట్లు మా అమ్మని మాయ చేశారు. మరి మా అమ్మకు కోపం రాదా.


రేవతి: ఏంటే ఇది వాడు చెప్పేది నిజమా. ఈ రిపోర్ట్ నిజమేనా. నువ్వు కూడా మోసం చేశావా కృష్ణ. నిన్ను కన్నబిడ్డలా చూసుకున్నా కదా. నువ్వు నన్ను మోసం చేశావు అన్న నిజం ఈ గుండె తట్టుకోలేకపోతుంది. దీని కంటే చావు హాయిగా ఉంటుందేమో. 


భవాని: చూడు చూడు.. ఎందుకు ఇంత పని చేశావ్. మాకు ఎందుకు లేనిపోని ఆశలు కల్పించావ్. మాకు ఎందుకు ఇంత మోసం చేశావు. పిల్లలు పుట్టకపోతే బయటకు పంపేస్తానా అంత కసాయిదానిలా కనిపిస్తున్నానా నేను. నువ్వు పిల్లల్ని కని నా చేతిలో పెడితే సంతోషిస్తాను కానీ ఇలా మోసం చేస్తే. పెద్దత్తయ్య నాకు పిల్లలు పుట్టే యోగం లేదు అని ఒక్కమాట చెప్తే జాలి పడి నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసేదాన్ని కదే. కానీ ఈరోజు నువ్వు నా గుండెల్ని ముక్కలు చేశావు కదే. 


కృష్ణ: మనసులో ఎంత పని చేశావ్ ముకుంద. ఏ నిజం బయట పడకూడదు అనుకున్నానో అది బయటపెట్టేలా చేశావ్. తన బిడ్డకు ఏసీపీ సార్ తండ్రి అని చెప్పి మళ్లీ నాకు పిల్లలు పుట్టరని ఏ ధైర్యంగా చెప్పింది. ఇంత జరిగినా నేను ఎందుకు మౌనంగా ఉండాలి సరోగసీ గురించి చెప్పేస్తా. 


రజిని: నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. కడుపుతో ఉన్న నువ్వు నార్మల్‌గా ఉన్నావ్. మీరా వాంతులు చేసుకుంటుందని అప్పుడే అన్నాను కదా.. అయినా ఇంత దారుణంగా ఎవరినీ మోసం చేయకూడదు కృష్ణ తప్పు.  


భవాని రేవతిని తీసుకొని వెళ్లిపోతుంది. అందరూ వెళ్లిపోతారు. ఆదర్శ్‌ కృష్ణను ఛీ కొడతాడు. కృష్ణ కూలపడి ఏడిస్తే మధు ఓదార్చుతాడు. ఏంటి ఇదంతా అని అడిగితే చెప్తాను అని మధుని తీసుకొని బయటకు వెళ్తుంది. మరోవైపు భవాని రేవతితో కృష్ణ చాలా మోసం చేసిందని బాధపడుతుంది. నిజం తనకి ముందే చెప్పుంటే ప్రపంచం మొత్తం తిప్పి బాగు చేసేదాన్ని అని లేదంటే వేరే ప్రాసెస్ ఫాలో అయ్యేవాళ్లం అని లేదంటే ఎవర్ని అయినా దత్తత తీసుకునేవాళ్లం అని అంటుంది. కృష్ణ కంటే మీరానే బెటర్ అని అంటుంది. రేవతి కృష్ణ తప్పు చేయదని మన మంచి కోరే చేస్తుందని భవానితో చెప్తుంది. 


కృష్ణ మధుతో జరిగినది అంతా చెప్తుంది. మీరానే సరోగసి మదర్ అని చెప్తుంది. నిజం తెలుసుకున్న మధు చిన్న విషయాన్ని చాలా పెద్దది చేశావని అంటాడు. మీరా నువ్వు దాచిన నిజాన్ని అవకాశంగా తీసుకుందని కోప్పడతాడు. పెద్ద పెద్దమ్మని తప్పుగా అర్థం చేసుకున్నావని అంటాడు. భవానితో నిజం చెప్దామని మధు కృష్ణని తీసుకొని లోపలికి వెళ్తే కృష్ణ వద్దు అంటుంది. 


కృష్ణ: నిజం చెప్తే ఆ మీరా నా బిడ్డను చంపేస్తుంది. 


మధు: చంపేస్తుందా ఏం మాట్లాడుతున్నావా కృష్ణ. బిడ్డను చంపేస్తే అది బతకగలదా. ఆదర్శ్‌ కాదు ఈ సారి దాన్ని నేను షూట్ చేసి చంపేస్తా. 


కృష్ణ: నీకు మీరా సంగతి తెలీదు అనుకున్నది సాధించడానికి ప్రాణాలను తీసేస్తుంది. 


మధు: దాని ప్రాణాలు దాని చేతిలో ఉండనిస్తామా ఏంటి. దాని చేతులు కాళ్లు కట్టిపడేసి బిడ్డను కనే వరకు రాత్రి పగలు కాపలా ఉంటాం. ఆ ఆలోచన రావడానికి కూడా గజగజ వణికిలే చేస్తాం. 


కృష్ణ: అది అందరి లాంటిది కాదు మధు వద్దు. 


మధు: నువ్వు భయపడినా నేను మాత్రం చెప్పేస్తా.. పెద్దమ్మ.. పెద్ద పెద్దమ్మ.. 


ముకుంద: మనసులో.. అత్తయ్య తిట్టినందుకు ఏ మూలనో ఏడుస్తూ ఉండకుండా మధుని తీసుకొచ్చింది ఏంటి ఏదో తేడా కొడుతుంది.


మధు: పెద్దమ్మ.. మురారి ఏ తప్పు చేయలేదు. కృష్ణ మీ సంతోషం కోసం తను నరకం అనుభవిస్తుందే తప్పు తను తప్పు చేయాలి అనుకోలేదు.



ముకుంద: మనసులో.. ఇది తెగించి నిజం చెప్పడానికి వచ్చేసింది.


మధు: మీరా కడుపులో బిడ్డకు మురారినే కచ్చితంగా తండ్రి అందులో ఏ డౌట్ లేదు.


భవాని: అంటే మురారి తప్పు చేసినట్లే కదా. అసలు నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావ్.


మధు: మీరా బిడ్డకు తండ్రి మురారినే పెద్దమ్మ. కానీ తను మీరా బిడ్డ కాదు. 


శకుంతల: మతి పోయిందారా నీకు. 


మధు: అవునమ్మా అది మురారి కృష్ణల బిడ్డ. కృష్ణకు పిల్లలు పుట్టరు అని తెలిశాక సరోగసీ పద్ధతిలో తమ బిడ్డను మీరా కడుపులో పుట్టాలి అనుకున్నారు అంతే.


భవాని: నువ్వు చెప్పేది నిజమేనా.  మీరా కడుపులో పెరుగుతున్న బిడ్డ నా వారసుడా. 


రేవతి: మీ కొడుకు ఏ తప్పు చేయలేదు అన్నావ్ ఇందు కోసమేనా. ఆ బిడ్డ మీ బిడ్డేనా చెప్పు.


కృష్ణ: అవును.


ముకుంద: నో ఇదంతా అబద్ధం. ఇది నా బిడ్డ మురారి వల్ల నాకు కలిగిన బిడ్డ. ఎక్కడ మురారి తనకు కాకుండా పోతాడా అని మధుతో కలిసి నాటకం ఆడుతుంది. 


మధు: ఇంకొక్క మాట మాట్లాడితే నాలుక కోసేస్తా. ఇది మురారి మీద కన్నేసింది. ఇంతలో కృష్ణకు పిల్లలు పుట్టరు అని తెలుసుకొని అసలు నాటకం మొదలు పెట్టింది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్ : తిలోత్తమను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండమని ఇంట్లో వాళ్లకి చెప్పిన విశాలాక్షి.. మళ్లీ వచ్చిన ఆత్మ!