Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మి ఇంటికి ప్రీతి, ఉషల ఫ్రెండ్స్ ఇద్దరు అబ్బాయిలు వస్తారు. ఇద్దరు అబ్బాయిల్లో ఒకరు ప్రీతితో క్లోజ్‌గా మాట్లాడుతూ.. మీద చేయి వేసి పక్కన కూర్చొంటాడు. అది విద్యాదేవి చూసి ఆ అబ్బాయి మీద సీరియస్ అవుతుంది. ప్రీతి మీద చేయి తీయమని అంటుంది. దూరం జరగమని కోపమవుతుంది. సంస్కారం లేదా పద్ధతులు తెలీవా అని తిడుతుంది. ఇక ప్రీతి తన కన్న తల్లి అని తెలీక విద్యాదేవిని పని మనిషి అని చెప్పి కాఫీ తీసుకురమ్మని అంటుంది.
విద్యాదేవి కాఫీ తీసుకొని వస్తుంది. ప్రీతి సైగ చేయడంతో ఉష విద్యాదేవి నడుస్తుంటే కాలు అడ్డంగా పెట్టేస్తుంది. దీంతో విద్యాదేవి కాఫీని ప్రీతి ఫ్రెండ్ మీద పడేస్తుంది. దీంతో ఆ అబ్బాయి విద్యాదేవిని తిడతాడు. కొట్టడానికి చేయి ఎత్తుతాడు. అప్పుడే సీత వచ్చి చైతూ చేయి పట్టుకొని తిప్పేస్తుంది. దీంతో చైతు నొప్పి అని విలవిల్లాడుతాడు. విద్యాదేవికి సారీ చెప్తేనే వదులుతాను అని అంటుంది. దాంతో చైతూ క్షమాపణ చెప్తాడు. ఇంతలో మహా, అర్చనలు అక్కడికి వస్తే ప్రీతి, ఉషలు తమ ఫ్రెండ్స్‌ని అవమానించారు అని చెప్తుంది. మహాలక్ష్మి సీతని తిడుతే సీత తిరగబడుతుంది.
మహాలక్ష్మి: అసలు ఆ పిల్లలతో నువ్వు ఎందుకు గొడవపడ్డావు.
విద్యాదేవి: ఆ పిల్లల పద్ధతి అస్సలు బాలేదు. వాళ్లు మన ఆడపిల్లలతో అతి చనువుగా ప్రవర్తించారు.
మహాలక్ష్మి: వాళ్లు ఎలా ప్రవర్తిస్తే నీకు ఎందుకు. ఈ కాలం పిల్లలు అలాగే ఉంటారు. అడగటానికి నువ్వు ఎవరు.
సీత: మంచి చెడు చెప్పడానికి బంధాలు ఎందుకు.
మహాలక్ష్మి: మధ్యలో నువ్వు మాట్లాడకు.
ప్రీతి: పల్లెటూరి వాళ్లకు సిటీ కల్చర్ ఏం తెలుస్తుంది పిన్ని. తెలీకపోతే ఓ మూలన కూర్చొవాలి. ఒక్క డ్యాన్స్ వేస్తే సరిపోదు. లైఫ్ స్టైల్ తెలియాలి తెలియకపోతే నోరు మూసుకొని ఉండాలి.
రామ్: స్టాపిట్ ప్రీతి. టీచర్ గారితో అలాగేనా మాట్లాడేది.
అర్చన: ఈవిడ గారు ఏం చేశారా తెలుసా రామ్. అనవసరంగా ఇంట్లో ఉండనిచ్చావ్.
రామ్: నేను పై నుంచి అంతా చూస్తున్నాను. ప్రీతి, ఉషలదే తప్పు. ఆ అబ్బాయి ప్రీతితో క్లోజ్‌గా మూవ్ అయితే టీచర్ తిట్టారు. టీచర్ గారు చెప్పింది రైట్. ఫ్రెండ్స్ అయినా సరే హద్దులు దాటకూడదు.
రామ్ మాటలకు మహా హర్ట్ అయి వెళ్లిపోతుంది. ప్రీతి, ఉషల ఫ్రెండ్స్ కూడా వెళ్లిపోతారు. విద్యాదేవి కింద పడిన కప్పులు తీసుకొని కిచెన్‌లోకి వెళ్లిపోతుంది. ప్రీతి, ఉషలకు సీత క్లాస్ ఇస్తుంది. ముందు ముందు టీచరే మిమల్ని దారిలో పెడతారు అని సీత అంటుంది. మరోవైపు మధు దగ్గరకు శివకృష్ణ, లలితలు వస్తారు. మధుకి డబ్బులు ఇస్తారు. మధు వద్దు అని చెప్తుంది. ఇక మధుని సూర్య దగ్గర ఇరికించాలి అని జలజ మధు డబ్బు తీసుకొనేలా చేస్తుంది. సరిగ్గా మధు డబ్బు తీసుకొనే టైంకి సూర్య వస్తాడు. భిక్ష తీసుకుంటున్నావా అని సీరియస్ అవుతాడు. శివకృష్ణ, లలితలతో డబ్బు తమకు వద్దని అవసరం లేదని సీరియస్ అవుతాడు. కట్నంగా తీసుకోకపోతే కనీసం అప్పుగా అయినా తీసుకోమని చెప్తారు. సూర్య ఆలోచనలో పడతాడు. అప్పుగా తీసుకోవడానికి అంగీకరిస్తాడు. ఇక మాటల్లో సుమతి ఇంటికి వచ్చిందని చెప్తారు. మధు సంతోషంగా ఫీలవుతుంది. మధు డబ్బు తీసుకుంటుంది.
సీతని ఏం చేయలేకపోతున్నాను అని మధు కూడా బాధలో ఉందని ఏదో ఒక విధంగా మధుని తన దారిలోకి తెచ్చుకుంటేనే సీతని ఇంటి నుంచి గెంటేయొచ్చని అనుకొని మహాలక్ష్మి మధుకి కాల్ చేస్తుంది. వద్దున్న తనకి పదే పదే ఎందుకు కాల్ చేస్తున్నారా అని అనుకుంటుంది. కాల్ లిఫ్ట్ చేసి నన్ను వదిలేయండి అని మధు అంటుంది. తనతో రిలేషన్‌ను కట్ చేసుకోమని అంటుంది. మహా మధుని నచ్చచెప్తుంది. ఇక డబ్బు, నగలు, ఆస్తి ఏం కావాలి అంటే అడగమని చెప్తుంది. మధు వద్దు అనేస్తుంది. కనీసం సూర్యకి జాబ్ ఇస్తాను బిజినెస్ చేయిస్తాను అని అంటే వద్దు అనేస్తుంది. ఇక మధు తన తల్లిదండ్రులు తమ పరువు కోసం డబ్బులు ఇచ్చారని అంటుంది. ఇక తన మేనత్త సుమతి అప్పుడెప్పుడో ప్రేమ పెళ్లి చేసుకొని వెళ్లిందని తిట్టాడని ఇప్పుడు ఆవిడ తిరిగి రావడంతో దగ్గరకు తీసుకొన్నాడని చెప్తుంది. సుమతి బతికి ఉందని తెలియడంతో మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: డ్రాయింగ్ కాల్చేసిన మనోహరి, ఘోరకు అమ్మును బలి ఇస్తానన్న మనోహరి