Seethe Ramudi Katnam Today Episode సీత రామ్ దగ్గర తన బాధ చెప్పుకొని ఏడుస్తుంది. అన్యాయంగా విద్యాదేవి టీచర్‌ని ఇంటి నుంచి తరిమేశారని బాధపడుతుంది. సుమతి తల్లి సుమతి ఫొటో చూసి కనిపించకుండా వెళ్లిపోయినందుకు బాధ పడుతుంది. ఎందుకు తమ దగ్గరకు రావడం లేదో అని ఏడుస్తుంది. మరోవైపు శివకృష్ణ విద్యాదేవిని ఇంటికి తీసుకొస్తాడు. అందరూ విద్యాదేవిని చూసి సంతోషిస్తారు. ప్రేమగా విద్యాదేవిని దగ్గరకు తీసుకుంటారు. విద్యాదేవి తానే సుమతి అని చెప్పుకోలేకపోతున్నాను అని బాధ పడుతుంది.
శివకృష్ణ: టీచర్ గారు సీతని సాయం చేశారనే అక్కసుతో మహాలక్ష్మి ఆమెను ఇంటి నుంచి పంపేశారు. ఎక్కడికి వెళ్లాలో తెలియని స్థితిలో బస్‌స్టాప్‌లో ఉంటే మన ఇంటికి తీసుకొచ్చా.
లలిత: మంచి పని చేశారండి టీచర్ గారు ఎక్కడో ఉండటం ఏంటి. విద్యాగారు మీరు మమల్ని మీ మనిషి అనుకోండి.
శివకృష్ణ: మిమల్ని చూడగానే మా చెల్లి సుమతి గుర్తొచ్చింది. అందుకే తనని మా ఇంటికి తసుకొచ్చాను.
విద్యాదేవి: నాకు మిమల్ని చూస్తే నా సొంత అన్నలా ఉన్నారు. నా పుట్టింటికి వచ్చినట్లు ఉంది.
సీత ఒంటరిగా కూర్చొని విద్యాదేవి గురించి తలచుకొని బాధ పడుతుంది. తన ఫ్యామిలీ తరఫున మనసులో సారీ చెప్పుకుంటుంది. రేవతి, చలపతి సీత దగ్గరకు వచ్చి ఓదార్పుగా మాట్లాడుతారు. మహా ఇలాగే చేస్తుందని తనని నచ్చిని వారిని పంపేస్తుందని అంటారు. మేం కూడా ఇంట్లో లేమని ఉండి ఉంటే ఆపడానికి ప్రయత్నించేవాళ్లమని అంటారు. విద్యాదేవి టీచర్‌కి చాలా ఆత్మాభిమానం అని ఆవిడ ఎప్పుడూ ఇంటికి రాదు అని అంటుంది. దాంతో రేవతి నీ కోసం వస్తుందని సీతకి ధైర్యం చెప్తారు. ఎప్పటికైనా విద్యాదేవి మళ్లీ వస్తుందని బాధ పడొడ్దని సీతతో రేవతి, చలపతిలు చెప్తారు. దాంతో సీత కూడా ధైర్యం తెచ్చుకుంటుంది.
విద్యాదేవిని ఇంట్లో వాళ్లు సుమతి ఫొటో దగ్గరకు తీసుకెళ్తారు. శివకృష్ణ, సుమతిల బంధం గురించి విద్యాదేవికి చెప్తారు. సుమతి కథని మళ్లీ విద్యాదేవిగా ఉన్న సుమతికే చెప్తారు. విద్యాదేవి చాలా ఎమోషనల్ అవుతుంది. శివకృష్ణ, లలిత, తల్లి ఆరాటం చూసిన విద్యాదేవి తట్టుకోలేక తానే సుమతి అని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. ఇక తాను రామ్‌ని కాపాడబోయి యాక్సిడెంట్ అయి ముఖం మార్చేశారని చెప్తుంది. అందరూ విద్యాదేవిని దగ్గరకు తీసుకుంటారు. మీకు ఇంకో నిజం చెప్పాలి అని విద్యాదేవి రామ్ ప్రీతిలు తన కన్న బిడ్డలు అని జనార్థన్ తన భర్త అని చెప్తుంది. మహాలక్ష్మి తన ఫ్రెండ్ అని ఎలా ఇంట్లోకి వచ్చి తన కుటుంబం, ఆస్తిని లాక్కుందో చెప్తుంది. దాంతో ఇంట్లో అందరూ మహాలక్ష్మి ఇంత మోసం చేసిందా అని రగిలిపోతారు. మహాలక్ష్మిని వదిలిపెట్టకూడదు అని తగిన బుద్ధి చెప్పాలని అందరూ నిర్ణయించుకుంటారు. మహాలక్ష్మి అంతు చూసి నీ కుటుంబాన్ని నీకు అప్పగిస్తాం అని శివకృష్ణ, లలితలు సుమతిని తీసుకొని మహాలక్ష్మి ఇంటికి బయల్దేరుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: జగధాత్రి సీరియల్: యువరాజ్ డబ్బు పట్టుకోకుండా అడ్డుకున్న ధాత్రి.. అతడు బతికే ఉన్నాడని నిరూపిస్తుందా!