Guppedantha Manasu Today Episode  సరోజా వాళ్ల అమ్మమ్మ మీద అరుస్తుంది. దాంతో ఆవిడ ప్రేమగా మంచిగా ఉండి రంగా మనసు గెలుచుకోమని చెప్తుంది. ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు రంగా నిన్నే పెళ్లి చేసుకుంటాడు అని అంటుంది. వసుధారని ఇంట్లో నుంచి పంపేయ్‌మని చెప్తుంది. అలా చేయలేను అని సరోజతో తన అమ్మమ్మ చెప్తుంది. మహేంద్ర, అనుపమల దగ్గర మను, ఏంజెల్ డల్‌గా కూర్చొంటారు. ఏమైందని అనుపమ అడుగుతుంది.


ఏంజల్: నీ వల్లే అత్త ఇలా జరిగింది. నీ వల్లే ప్రతీ సారి ఏదో ఒకటి జరుగుతుంది. 
అనుపమ: నేనేం చేశానమ్మా.
ఏంజల్: ఆ దేవయాని కాలేజ్ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతుందో తెలుసా. 
మను: ఏంజెల్ నువ్వు సైలెంట్‌గా ఉండు.
ఏంజెల్: నోటి కొచ్చినట్లు మాట్లాడుతుంది. నేను బావని మామూలుగా కలవడానికి వెళ్తే కాలేజ్‌ని పార్క్ చేసేస్తున్నారు. అని చాలా నీచంగా మాట్లాడింది. ఆ పక్కనే శైలేంద్ర కూడా ఉన్నాడు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. బావకేమో తండ్రి ఎవరో తెలీదని మాట్లాడుతుంది. అసలు అలాంటి వాళ్లకి నువ్వు ఛాన్స్ ఇవ్వాలా అత్తయ్య.  ఆ నిజం ఏంటో చెప్తే అయిపోతుంది కదా. 
అనుపమ: చెప్పాల్సిన అవసరం ఏంటి.  నా పర్మనల్ లైఫ్ నా ఇష్టం. నా లైఫ్‌ వల్ల నీకు ఏమైనా ప్రాబ్లమా.. తనకు ఏమైనా ప్రాబ్లమా సోసైటీకి ఏమైనా ప్రాబ్లమా.
మహేంద్ర: అసలు వదిన గారికి బుద్ధి లేదు. ఎన్ని సార్లు చెప్పినా వినదు ఇలా కాదు తనని అడుగి నిలదీద్దాం పద అనుపమ.
మను: వద్దు సార్..


మను వద్దన్నా అనుపమను తీసుకొని మహేంద్ర వెళ్తాడు. తన అన్న వచ్చి ఏమైంది అని అడుగుతాడు. వదినను పిలిస్తే చెప్తామని అంటాడు. దేవయాని వచ్చి ఎందుకు వచ్చారని అడుగుతుంది. 


మహేంద్ర: మర్యాదలు చేయడమే కాదు వదిన గారు మాట్లాడటం కూడా తెలిసి ఉండాలి.
దేవయాని: ఇప్పుడు నేనేం అన్నాను మహేంద్ర నాతో గొడవ వచ్చావా ఏంటి. 
మహేంద్ర: మీరు గొడవ పెట్టుకున్నారు కాబట్టే ఇలా వచ్చాం. అనుపమ అన్నయ్య గారి ముందే నువ్వు ఏం మాట్లాడాలి అనుకున్నావో అది వదినతో మాట్లాడు.
శైలేంద్ర: మనసులో.. వామ్మో.. వీళ్లు ఇప్పుడు నిజం చెప్పారు అంటే నాన్న మమల్ని బతకనిచ్చేలా లేరు. ఎలా అయినా ఆపాలి.. ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం.
రవీంద్ర: ఈ రోజు నాకు అసలు విషయం తెలియాలి. నా వెనక మీకు మీకు మధ్య చాలా జరుగుతున్నాయి. అవి నాకు తెలియాలి. అనుపమ నువ్వేం అనుకుంటున్నావో అడుగు.
అనుపమ: అసలు మీ ఉద్దేశం ఏంటి అండి. ఎందుకు మనుని బాధ పెడుతున్నారు. ఎందుకు వాడిని వేధనకు గురించేస్తున్నారు. కాలేజ్‌లో మీరు నా కొడుకు దగ్గరకు వచ్చి ఏం మాట్లాడారో అప్పుడే మర్చిపోయావా. అలా ఎవరైనా మాట్లాడుతారా. వాడి తండ్రి గురించి రకరకాలుగా అడిగి ఎందుకు వాడి హింస పెడుతున్నారు. మీరు ఏం అడగాలి అంటే నన్ను అడగండి. నా కొడుకు జోలికి రాకండి.
దేవయాని: సరే నిన్నే అడుగుతున్నాను. మను తండ్రి ఎవరు. చెప్పు అనుపమ మనుని కన్న తండ్రి ఎవరు. అసలు బతికే ఉన్నాడా చనిపోయాడా. 
అనుపమ: దేవయాని గారు మంచిగా మాట్లాడండి. మీరు ఎంత ట్రై చేసినా నేను మీకు నిజం చెప్పను. మీకు కూడా ఆ విషయం గురించి అవసరం లేదు. మీరు ఇంకొక సారి తన గురించి అడిగితే బాగోదు. 
రవీంద్ర: నువ్వు నీ కొడుకు చేసిన పనికి నా తల కొట్టేసినట్లు ఉంది. మీ ఇద్దరికి చాలా సార్లు చెప్పా అనవసర విషయాల్లో జోక్యం వద్దని. మీరు మాత్రం మారడం లేదు. ఛీ.. ఛీ.. అమ్మా అనుపమ వాళ్లు చేసింది తప్పే అందుకు వాళ్ల తరఫున నేను నిన్ను క్షమించమని అడుగుతున్నాను. 
అనుపమ: మీరు అంత పెద్ద మాట అనొద్దు సార్. వీళ్లు నా, నా కొడుకు జోలికి రాకపోతే అంతే చాలు. 
రవీంద్ర: మీ ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు అసలు నీకు అనుపమకు ఏంటి సంబంధం అని దేవయాని అంటుంది. తనకి మీ గురించి తెలీక లేదంటే కుటుంబ పరువు పోతుందని అలా అడగొచ్చు. మీరు ఎలాంటి తప్పు చేయరని నా నమ్మకం కాబట్టి దేవయానికి నేను సర్దిచెప్తా కానీ బయట ఇలాంటి దేవయానిలు చాలా మంది ఉంటారు. వాళ్లకి ఏం చెప్తాం. అందుకే ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయ్. 


తన తండ్రికి  మన మీద సానుభూతి ప్రేమ ఉందని శైలేంద్ర తల్లితో అంటాడు. ధరణి వచ్చి సెటైర్లు వేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్: తిలోత్తమ బ్యాగ్‌లో క్షుద్రపూజ సామాగ్రి.. ఇంటికి చింతామణిని తీసుకొచ్చిన విశాలాక్షి!