Brahmamudi Today Episode కల్యాణ్ తన కాళ్లు పట్టుకోవాలి అని అనామిక డిమాండ్ చేస్తుంది. జడ్జి ఎంత చెప్పినా వినకుండా అప్పు, కల్యాణ్‌లకు శిక్ష పడాలి అని అంటుంది. ప్రపంచానికి ఇద్దరి ఎఫైర్ గురించి తెలియాలి అని అంటుంది. ఇక జడ్జి కల్యాణ్‌కి తన అభిప్రాయం అడిగితే విడాకులు ఇస్తాను అని అంటాడు.


కల్యాణ్: నేను చేయని నేరానికి శిక్ష పడితే ఆనందంగా భరిస్తాను. ఇంకా ఆమెతో కలిసి ఉండాల్సి వస్తే జీవితాంతం ఆ శిక్షకంటే మీరు వేయబోయే శిక్ష చిన్నది సార్.
అనామిక: ఆయన తెలివిగా నాకు విడాకులు ఇచ్చి అప్పుని పెళ్లి చేసుకోవడానికి లైన్ క్లియర్ చేసుకుంటున్నాడు. నా భర్త ఇంకోకదాన్ని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోను.
జడ్జి: విడాకులు ఇచ్చిన తర్వాత తను ఎవర్ని చేసుకుంటే నీకెందుకు.


డిఫెన్స్ లాయర్ అనామికతో మాట్లాడి పదే పదే తను కల్యాణ్‌ని నీకు సంబంధం ఉంది ఉంది అని చెప్పి కల్యాణ్‌కి చిరాకు పెట్టించిందని అందుకే కల్యాణ్ సహనం కోల్పోయి విడాకులు అడిగాడు అంటాడు. కల్యాణ్ ఎప్పుడూ అందరితో అప్పుతో తనకు ఉన్నది కేవలం స్నేహమే అని చెప్పాడని అనామిక పదే పదే వాళ్లద్దరినీ ఇబ్బంది పెట్టిందని అప్పుడు విడాకులు అడగడం సహజమే కదా అని అంటారు. తప్పుడు కేసులు పెట్టిందని అంటారు. ఇక అనామిక తరఫు లాయర్ వచ్చి ఇద్దరూ స్నేహితులు అయితే హోటల్‌లో ఎందుకు కలుసుకున్నారు అని ఇంట్లో కలుసుకోవచ్చు కదా అని హోటల్ ఫుటేజీ చూపిస్తుంది. దాన్ని డిఫెన్స్ లాయర్ అది తప్పుడు సమాచారం అని దాన్ని తప్పుగా నిరూపిస్తాను అని అంటారు. అనామికను ఇంత క్రియేటివ్‌టా ఎలా కథ అల్లావమ్మా అని అడుగుతారు. వాళ్లిద్దరూ బెడ్ మీద ఉంటే చూశావా.. హగ్ చేసుకోవడం చూశావా.. ఇలా అడుగుతారు. లేదు అని అనామిక అంటుంది. ఇక అప్పు, కల్యాణ్ ఎంత సేపు గదిలో ఉన్నారు. ఎప్పుడు హోటల్‌కి ఎంటర్ అయ్యారు. ఎప్పుడు బయటకు వచ్చారు అన్నవి టైంతో సహా ప్రూవ్ చేస్తారు. ఒక్క నిమిషంలో అనామిక, కల్యాణ్‌ గదిలో నుంచి వచ్చేశారు అని అంతలోనే అనామిక వాళ్ల అత్తని మీడియాని ఎలా తీసుకొచ్చిందని ప్రశ్నిస్తారు. ఇక కల్యాణ్, అప్పులు అసలు వాళ్ల కోసమే బుక్ చేయలేదు అని ఆరోజు అసలు రూమ్ ఎవరి పేరు మీద బుక్ చేసుకోలేదని చెప్తారు. అందుకు సంబంధించిన రికాడ్స్ సీసీ టీవీ ఫుటేజ్ ఇస్తారు. దీంతో అనామిక షాక్ అయిపోతుంది. 



 
ఇక అనామిక తరఫు లాయర్ అప్పుని ప్రశ్నిస్తుంది. అప్పు కల్యాణ్‌ని ప్రేమించాను అని అయితే కల్యాణ్ తనని స్నేహితురాలిగానే చూశాడని కల్యాణ్ కూడా ప్రేమించి ఉంటే ఇంట్లో ఒప్పుకోకపోయి ఉన్నా పెళ్లి చేసుకునేదాన్ని అని అంటుంది. ఇక డిఫన్స్ లాయర్ అప్పుకి, కల్యాణ్‌కి ఏం సంబంధం లేదు అని గతంలో అనామిక ఒప్పుకున్నట్లు బలమైన ఆధారం ఉందని చెప్తారు. గతంలో అనామిక అప్పుతో కావాలనే తనని ఇరికించినట్లు మాట్లాడిన మాటలు  అప్పు ఫ్రెండ్ వీడియో తీయగా అది జడ్జికి ఇస్తారు. ఇక అనామికకు కల్యాణ్ చిత్ర హింసలు పెడుతున్నాడు అని దాని గురించి ఏంటని అడిగితే ప్రత్యక్ష సాక్షి ఉందని కావ్యని డిఫెన్స్ లాయర్ పిలుస్తారు. కావ్య వచ్చి అనామికతో రాత్రి మాట్లాడాను అని అనామిక మీద డౌట్‌తో తనతో మాట్లాడినప్పుడు రికార్డ్ చేశానని చెప్తుంది.  దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్: తిలోత్తమ బ్యాగ్‌లో క్షుద్రపూజ సామాగ్రి.. ఇంటికి చింతామణిని తీసుకొచ్చిన విశాలాక్షి!