Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మి విద్యాదేవి దగ్గరకు వస్తుంది.  అర్చన చేయించారా.. మీకు ఎవరు లేరు అన్నారు ఎవరి పేరు మీద అర్చన చేయించారని అడుగుతుంది. ఇక తన వెంట విద్యాదేవిని తీసుకెళ్లి పంతులుతో తన భర్త పిల్లల పేరు మీద అర్చన చేయించింది ఈవిడేనా అని అడుగుతుంది. విద్యాదేవి కంగారు పడుతుంది. ఆవిడ కంగారు పడి రెండు చేతులు జోడించి దండం పెడుతుంది. దీంతో పంతులు అబద్ధం చెప్తారు. ఇక జనార్థన్ కూడా రావడంతో పూజ ప్రారంభించమని అంటుంది. 


జనార్థన్: మీరు ఇక్కడే ఉన్నారా విద్యాదేవిగారు. ఈ రోజు నా మొదటి భార్యది నాది పెళ్లి రోజు. ఆవిడ లేకపోయినా ఈ రోజు పెళ్లి రోజు జరుపుకోవడం నాకు అలవాటు.
విద్యాదేవి: చాలా మంచిదండి. ఆవిడ లేకపోయినా ఇంకా మీ మనసులో ఆమెకు స్థానం ఉంది. ఆవిడ కోసం గుడికి వచ్చారు.
జనార్థన్: గుడికి మాత్రం మహానే తీసుకొచ్చింది.
మహాలక్ష్మి: సుమతి నీ మొదటి భార్య అయితే నా బెస్ట్ ఫ్రెండ్ జనా. తన వల్లే నాకు ఈ జీవితం వచ్చింది.
విద్యాదేవి: నా జీవితం ముళ్ల బాట చేసి నీ జీవితానికి పూల బాట వేసుకున్నావ్ మహాలక్ష్మి. నేను నీ ఎదుటే ఉన్నా నువ్వు గుర్తు పట్టలేకపోయావ్.


జనార్థన్ విద్యాదేవి, మహాలక్ష్మిల మధ్య నిల్చొంటారు. పంతులు పూజ చేస్తారు. విద్యాదేవి మనసులో ఏదో ఒకరోజు మీతో ఇదే గుడిలో నేనే మీ భార్య సుమతి అని చెప్తానని అనుకుంటుంది. ఇక విద్యాదేవిని కూడా ఇంటి తీసుకెళ్తానని జనార్థన్ చెప్పి ఆమె కోసం కార్ డోర్ తీస్తాడు. అది చూసి మహా రగిలిపోతుంది. జనా చెప్పాడు కాబట్టి ఈ విద్యాదేవిని కారులో ఎక్కించుకోవాల్సి వచ్చిందని అనుకుంటుంది. 


సీత: నువ్వు బతికే ఉన్నావ్ అని నాకు అనిపిస్తుంది అత్తమ్మ. ఇవాళ చిట్టీల్లో కూడా అదే వచ్చింది. నువ్వు బతికి ఉంటే ఎక్కడ ఉన్నావ్. ఎలా ఉన్నావ్. ఒక్కసారి నాకు కనిపించు అత్తమ్మ. ఆ రోజు మా ఇంట్లో మా అమ్మానాన్నలు మా మేనత్త పేరు సుమతి అన్నారు. ఆ రోజు నేను మా అత్త ఫొటో చూడలేకపోయాను. మీ పేరు కూడా అదే కాబట్టి మీ ఇద్దరూ ఒకటే అనే ఆశ నాలో కలిగింది. 


శివకృష్ణ ఫ్యామిలీ సుమతి గురించి మాట్లాడుకుంటారు. సుమతి ఎక్కడుందో ఎలా ఉందో అని కంగారు పడతారు. ఇక శివకృష్ణ సీతకు కాల్ చేస్తాడు. సుమతి ఫొటో దొరికిందని పంపిస్తాను అని అంటాడు. సీతకు ఫొటో పంపిస్తాడు. సీత ఆ పిక్ చూసి షాక్ అయిపోతుంది. తన మేనత్తే అత్తమ్మ అని సంతోషంతో ఫొటోకి ముద్దులు పెట్టుకుంటుంది. రామ్‌కి ఈ విషయం చెప్పాలని పరుగున రామ్ దగ్గరకు వెళ్లి హగ్ చేసుకొని చాలా సంతోషంగా ఉన్నానని చెప్తుంది. అయితే విషయం ఏంటి అనే అడిగితే ఇప్పుడే చెప్పను అని తన ఊరు వెళ్దామని అంటుంది. వెలకట్టలేని బహుమతి ఇస్తానని అంటుంది. రామ్ వస్తానని అంటాడు. 


శివకృష్ణ: సీతకి కాల్ చేసి.. అమ్మ సీత అత్తయ్య ఫొటో చూశావా.
సీత: నాన్న నాన్న.. నాకు ఎలా చెప్పాలో తెలీడం లేదమ్మా. పట్టరాని సంతోషంతో ఉన్నాను. ఫోన్‌లో చెప్పలేను. నేను మీ అల్లుడు ఇంటికి వచ్చి చెప్తాను. ఇక మేం వచ్చేలోపు మీరు ఓ పని చేయాలి. అని చెప్తుంది. 
గిరిధర్: రామ్, సీత బయటకు వెళ్లడంతో ఎక్కడికో వెళ్తున్నట్లున్నారు.
సీత: ఎక్కడికైనా వెళ్తే ఎక్కడికి అని అడగకూడదని తెలీదా.
గిరిధర్: ఎక్కడికైనా వెళ్తే ఇంట్లో చెప్పి వెళ్లాలి అని మీకు తెలీదా. 
రామ్: మేం సీత వాళ్ల ఊరు వెళ్తున్నాం పిన్ని వచ్చాక చెప్పండి.
అర్చన: ప్రతి సారి అక్కడికి ఎందుకు రామ్. 


సీత రామ్‌ని వెళ్లపోమని చెప్పి అర్చన, గిరిధర్‌లతో ఈ రోజు ఫస్ట్‌నైట్ చేసుకోవడానికి వెళ్తున్నాం అని చెప్తుంది. మహా వస్తే ఏం చేసుకుంటుందో చేసుకోమని చెప్పు అని అంటుంది. సీత, రామ్‌లు సీత పుట్టింటికి వస్తారు. సీత రామ్ కళ్లు మూసి లోపలికి తీసుకెళ్తుంది. శివకృష్ణ సీత చెప్పినట్లు సుమతి ఫొటో పెట్టి దండ వేసి ఎదురుగా ఉంచుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సుమతి బతికే ఉందని నమ్ముతున్న సీత, రామ్‌లు, విద్యాదేవిని ప్రశ్నించిన మహాలక్ష్మి!