Seethe Ramudi Katnam Today Episode కిరణ్‌ రేవతిని తీసుకొని బయటకు వెళ్తానని అంటాడు. సీత ఎవరి పర్మిషన్ అవసరం లేదని హ్యాపీగా తిరిగి రమ్మని చెప్తుంది. కిరణ్ రేవతిని తీసుకొని వెళ్తాడు. అందరూ ఎటు వాళ్లు వెళ్లిపోతే సీత మహాలక్ష్మి దగ్గరకు వెళ్లి ఆరోజు కిరణ్ గారితో మాట్లాడలేదు అనుకున్నారు కదా.. కిరణ్ గారు ఇలా వస్తారని ఊహించలేదు కదా.. అత్తయ్య గారు ఇంకా ముందు ముందు మీకు చాలా ట్విస్ట్‌లు ఇస్తానని చెప్పి వెళ్లిపోతుంది.


శివకృష్ణ ఇంట్లోని బీరువాలో సుమతి ఫొటో చూసి గోడ మీద ఉండాల్సిన ఫొటో బీరువాలో ఎవరు పెట్టారని అడుగుతాడు. లలిత, శివ తల్లి మేం పెట్టలేదని అంటారు. ఇక సీత తన మేనత్త ఫొటో చూడాలని చాలా ఆశపడిందని ఈ పొటోని సీత పోన్ కి పంపిస్తానని శివకృష్ణ అనుకొని వెళ్తాడు. ఇక శివతల్లి ఈరోజే సుమతి తమని కాదని వెళ్లిపోయి ప్రేమ పెళ్లి చేసుకుందని గుర్తు చేస్తుంది. ఆ విషయం కూడా సీతకి చెప్పమని లలితతో చెప్తుంది. మరోవైపు సీత సుమతి ఫొటో దగ్గర నిల్చొని అత్తమ్మ బాగా గుర్తొస్తుందని రామ్‌తో చెప్తుంది. ఇక ఎడమ కన్ను అదురుతుందని ఏదైనా మంచి వార్త వింటానని సీత అంటుంది. ఇక తన అత్తమ్మ చనిపోలేదని బాడీ ఎవరూ చూడలేదు అంటే బతికి ఉన్నట్లే కదా అని అంటుంది. రామ్తో వాధిస్తుంది. ఇక చీటీలు రాద్దామని అత్తమ్మ, ఉందని లేదని సీటీలు రాస్తారు. మహాలక్ష్మి రావడంతో సుమతి బతికి ఉందని లేదని రెండు చిట్టీలు రాశామని అంటుంది. ఇక రామ్ మహాలక్ష్మి చేతే చిట్టీ తీయిస్తాడు. అందులో అత్తమ్మ బతికే ఉంది అని రావడంతో మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. రామ్, సీత చాలా సంతోషిస్తారు. అమ్మ ప్రాణాలతో ఉందని అనిపిస్తుందని రామ్ అంటాడు. ఇక సీత కూడా అత్తమ్మ ఎక్కడో బతికే ఉందని అంటాడు. ఇక జనార్థన్ కూడా వచ్చి రామ్, సీతల్లాగే తను కూడా సుమతి గురించి ఆలోచిస్తున్నాను అని ఈ రోజే తాను సుమతి ప్రేమ పెళ్లి చేసుకున్నామని అంటాడు. దాంతో సీత, రామ్‌, మహాలక్ష్మిలు జనార్థన్‌కి శుభాకాంక్షలు చెప్తారు. 


మహాలక్ష్మి: సుమతి బతికి ఉంటే నాకు ఆనందమే కదా. ఈ రోజు మీ పెళ్లి రోజు కాబట్టి నీతో చెప్పకుండా గుడికి వెళ్లి నీ పేరు మీద పిల్లల పేరు మీద అర్చన చేయించాలి అనుకున్నా కానీ ఇప్పుడు నువ్వే అంటున్నావ్ కాబట్టి నువ్వు కూడా నాతో గుడికి రా జనా. మనసులో.. సుమతి ఎక్కడున్నా నలిపి పడేయాలి.
రామ్: సీత నాకు పిన్ని డాడీల వెడ్డింగ్ డే తెలుసు కానీ అమ్మానాన్నలది తెలీదు. 
సీత: అవును టీచర్ గారు కనిపించడం లేదు.
విద్యాదేవి: ఈరోజు మా పెళ్లి రోజు మమల్ని ఆశీర్వదించు స్వామి. జనార్థన్, రామ్, ప్రీతిల పేరున అర్చన చేయండి. వశిష్ట గోత్రం.


మహా, జనా కూడా గుడికి వస్తారు. విద్యాదేవి కూడా అదే గుడిలో ఉంటుంది. మహాలక్ష్మి జనార్థన్, రామ్, ప్రీతి, అని సేమ్ గోత్రం చెప్తే పంతులు మహాలక్ష్మితో ఇందాకే ఒకామె వచ్చి ఆ పేర్లు, గోత్రంతో అర్చన చేయించిందని చెప్తారు. దాంతో మహాలక్ష్మి ఆవిడ పేరు ఎవరు అని డిటైల్స్ అడుగుతుంది. ఇక్కడే ఉంటుంది చూడమని పూజారి చెప్తే మహాలక్ష్మి వెళ్లి చూసి తను సుమతి అయ్యుంటుందని అనుకుంటాడు.  మొత్తం వెతుకుతుంది. ఓ చోట విద్యాదేవి కూర్చొవడం మహాలక్ష్మి చూస్తుంది. అక్కడికి వెళ్తుంది. విద్యాదేవినే పూజ చేయించిందా అని అనుకుంటుంది. సుమతి తనకు తెలుసేమో అని అడుగాలి అని అక్కడికి మహాలక్ష్మి వెళ్తుంది. ఈ రోజుగుడికి రావడానికి ప్రత్యేకమైన కారణం ఉందా. పూజ అర్చన చేయించారా. ఎవరి పేరు మీద చేయించారని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: జేఎమ్మార్‌ని బతికించిన లక్ష్మీ.. అచ్చం జేఎమ్మార్ కూతురిలా ఉన్న లక్ష్మీ బిజినెస్‌లు చూసుకుంటుందా!