Seethe Ramudi Katnam Today Episode రామ్ సీత దగ్గరకు వచ్చి సీరియస్ అవుతాడు. మాట్లాడుతుంటే మాట వినకుండా మధ్యలో వచ్చేశావ్ ఎందుకు అని అడుగుతాడు. దీంతో సీత మీరు నా మాట నమ్మడం లేదు అప్పుడు నేను అక్కడ ఉండి ఏం లాభమని ప్రశ్నిస్తుంది. దానికి రామ్ నువ్వు నాకు చెప్పినట్లు నిజం నిరూపించకుండా వచ్చేశావు అని అడుగుతాడు. మీ పిన్ని వాళ్లు అంతా మ్యానేజ్ చేసేశారు అందుకే నేను వచ్చేశాను అని సీత అంటుంది.
రామ్: ఎదుటివారి మీద నింద వేసి అది నిరూపించనప్పుడు నీదే తప్పు అవుతుంది కదా సీత.
సీత: సాక్ష్యాలు లేనంత మాత్రానా ఆవిడ చేసిన తప్పు ఒప్పు అయిపోదు. మీరు నమ్మండి నమ్మక పోండి ఆవిడ తప్పు చేసింది.
రామ్: ఆవిడ తప్పు నువ్వు నిరూపించలేకపోయావు కాబట్టి తప్పు అంత నీదే అయింది. నువ్వు వచ్చి పిన్నికి సారీ చెప్పాలి అని అందరూ అడుగుతున్నారు.
సీత: చెప్పను అని కిందే చెప్పాను కదా.
రామ్: నేను కూడా అడుగుతున్నాను.
సీత: ఆ దేవుడే వచ్చి చెప్పినా నేను చేయని తప్పునకు క్షమాపణ చెప్పను.
రామ్: పట్టుదలకి ఇది సమయం కాదు సీత. క్షమించమని పిన్నితో ఒక మాట చెప్పి వచ్చేయ్. అదొక్కటి చేయ్ నీకు ఇంకేం అడగను.
సీత: నేను తప్పు చేశాను అంటే మీకు సారీ చెప్తాను ఇంకా ఎవరికీ చెప్పను.
రామ్: నీ వల్ల మా పిన్ని హర్ట్ అయింది ఏడుస్తుంది. నాకు కోపం తెప్పించకు సీత. నీ వల్ల నేను కూడా మా పిన్నిని బాధపెట్టాను. నాకు మా పిన్ని తర్వాతే ఎవరైనా..
సీత: ఆవిడ తప్పు చేస్తే నేను సారీ చెప్పాలా..
రామ్: నీకు ఒక్కరోజే టైం ఇస్తా సీత రేపటిలోగా నువ్వు సారీ చెప్పాలి లేదంటే నేనేం చేస్తాను నాకే తెలీదు.
సీత: మీరేం చేసినా సరే నేను సారీ చెప్పను. చెప్పను గాక చెప్పను.
మరోవైపు సూర్య ఇంకా ఇంటికి రాలేదు అని తన అన్న మధుని పిలిచి అడుగుతాడు. దానికి మధు పని ఉంది అని వెళ్లాడని.. పొద్దున్న ఏదో జాబ్ వచ్చేలా ఉంది అని చెప్పాడని అన్నాడు. ఇంతలో జాబ్ వచ్చింది అని స్వీట్స్ తీసుకొని మధు వస్తాడు. ఇక సూర్య వదిన జీతం తక్కువ మహాలక్ష్మి ఇంటి వాచ్ మ్యాన్‌కి కూడా ఎక్కువే ఉంటుంది అని రెచ్చగొడుతుంది.
మధు: అక్క మాటల్ని పట్టించుకోవద్దు. ఇప్పుడు శాలరీ తక్కువ అయినా ముందు ముందు పెరుగుతుంది. నీకు జాబ్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఒకరితో కంపేర్ చేసి ఎందుకు బాధ పడతావు.
సూర్య: నాదేదో కార్లలో తిరిగి చేసే జాబ్ అనుకున్నావేమో.. కాళ్లతో తిరిగి చేసే జాబ్. అసలే నేను అవిటి వాడిని.. నా జీతం అంతంత మాత్రమే.
సూర్యవదిన: నేను ఒక చిన్న మాట అంటే సూర్యకి అంత బాధ ఎందుకు.
మధు: మీరు ఆ మాట అనకుండా ఉండాల్సింది అక్క.
రామ్: సీత రాత్రి నేను చెప్పింది ఏం చేశావ్. మా పిన్నికి వెళ్లి సారీ చెప్తావా లేదా.. చెప్పు సీత.
సీత: ఏం చెప్పాలి. అత్తయ్య ఫొటో దగ్గర.. మీ అబ్బాయికి ఒకసారి చెప్తే అర్థంకాదా అత్తమ్మ. నిన్నటి నుంచి ఒకటే సతాయిస్తున్నారు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు. మీ అబ్బాయి తాపత్రయం ఏదో మీ కోసం పడుంటే ఒక అర్థం ఉండేది అత్తమ్మ కానీ తనని మోసం చేస్తున్న పిన్ని కోసం ఈ పాట్లే ఏంటి. మీరు అయినా మీ అబ్బాయికి కొంచెం మంచి బుద్ధి ప్రాసాదించండి.
రామ్: మేటర్ డైవర్ట్ చేయకు నేను నీతో మాట్లాడితే నువ్వు ఫొటోతో మాట్లాడుతున్నావేంటి.
సీత: అది ఫొటో కాదు మీ అమ్మగారు.
రామ్: సీరియస్‌గా అడుగుతున్నా సారీ చెప్తావా లేదా..
సీత: చెప్పను.
రామ్: సీతతో ఎలా సారీ చెప్పించాలి.
అర్చన: రామ్ నువ్వు సీతతో సారీ చెప్పిస్తావ్ అని మహా గదిలో వెయిట్ చేస్తుంది. ఆ సీన్ చూడటానికి ఇంట్లో అందరం వెయిట్ చేస్తున్నాం. నువ్వేమో ఇంకా ఆలోచిస్తున్నావ్.
రామ్: నేను ఎంత చెప్పినా సీత సారీ చెప్పనంటోంది.
గరిధర్: ఒక మగాడు చెప్పాల్సిన మాటలేనా ఇవి నీ స్థానంలో నేను ఉంటే మీ పిన్ని మెడ వంచి అయినా సారీ చెప్పించేవాడిని.
రామ్: సీత మొండిగటం పట్టిన పట్టు వదలను పిన్నికి నా ముఖం ఎలా చూపించాలో అర్థం కావడం లేదు.
అర్చన: సీతతో సారీ చెప్పించకపోతే మహా ఎప్పుడూ నీతో మాట్లాడదు. నేను చెప్పినట్లు చేయ్ అని అర్చన రామ్‌కి ఐడియా ఇస్తుంది. మహా కోసం అలా చేస్తావా రామ్.
రామ్: చేస్తాను పిన్ని అని సీరియస్‌గా సీత దగ్గరకు వెళ్తాడు.
గిరిధర్: ఏంటి అర్చన రామ్‌కి అలాంటి ఐడియా ఇచ్చావ్ రామ్‌కి ఏదైనా అయితే..
అర్చన: రామ్‌కి ఏమీ కాదు.. మీరు చూస్తూ ఉండండి. చచ్చినట్లు సీత మహకి సారి చెప్తుంది.
రామ్: రాజ్యం బట్టలు ఆరేస్తుంది తనని కిందకి వెళ్లమంటాడు. ఎందుకు అంటే నేను ఇక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకొని చావబోతున్నాను.
రాజ్యం: అమ్మ బాబోయ్ పరాచికాలు వద్దు బాబు.
రామ్: నోర్మూసుకొని వెళ్లు అని డోర్ లాక్ చేస్తాడు.
రాజ్యం: సీతమ్మ త్వరగా మేడ మీదకు వెళ్లమ్మా రామ్ గారు దూకి చనిపోతాను అంటున్నారు. నాకు భయంగా ఉంది త్వరగా వెళ్లు అమ్మ. ఆయన అన్నంత పని చేస్తారు.
సీత: ఏవండి తలుపు తీయండి.
రామ్: నేను తీయను నేను చావడానికి సిద్ధమయ్యాను. నువ్వు నా మాట విననప్పుడు నేను నీ మాట వినను. నేనుం ఏం చేసినా నా మాట వినను అన్నావు కదా.. నేను ఏం చేస్తానో బయటకు వచ్చి చూడు.
మహాలక్ష్మి: రామ్ మాట సీత ఎందుకు వినదో నా కాళ్లు పట్టుకొని ఎందుకు క్షమాపణ అడగదో చూస్తాను. అది నా దారికి వచ్చే టైం దగ్గర పడింది. దాని మెడలు వంచి నా కాళ్ల దగ్గరకు తెచ్చుకుంటాను. నా బానిసను చేసుకుంటాను. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: సత్యభామ సీరియల్ ఫిబ్రవరి 9th : హర్ష మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన క్రిష్, కాళీని కాల్చేసిన రౌడీ!