Trinayani Today Episode చూపులమ్మ గాయత్రీ దేవి జాడ చూపించకుండా చేసింది సుమనే అని తిలోత్తమ అనుమానం వ్యక్తం చేస్తుంది. సుమన నీ పార్టీనే కదా అని హాసిని అంటే.. ఎవర్ని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదని తిలోత్తమ అంటుంది. ఇక డమ్మక్క ఇందంతా ఎవరు చేశారో తెలిస్తే మిగిలేది రక్తపాతమే అంటుంది. దానికి అందరూ షాక్ అవుతారు. అలా ఎందుకు అన్నావు డమ్మక్క అని విశాల్ అడుగుతాడు.


డమ్మక్క: అవును విశాల్ బాబు. దేవాలయం వంటి ఈ ఇంటి నీడన ఉంటున్న ఇంతమంది మనసులో ఎవరు ఎవరి గురించి ఏమనుకుంటున్నారో తెలిస్తే యుద్ధమే జరుగుతుంది అంటున్నాను. 
విక్రాంత్: నిజమే బాగా ఉన్న ఇంట్లో ఎవరు బాగున్నారు. 
సుమన: అవును ఆ లోటు నాకు ఉండేది నిన్నటి వరకు. కానీ రేపటి నుంచి ఉండదు. 
నయని: ఎందుకని..
సుమన: నువ్వే చూస్తావు కదా అక్క.
డమ్మక్క: తన ఆట మొదలు పెట్టింది ఎలా ఆడుతుందో చూడాలి మరి..


హాసిని: అత్తయ్య నా తాళిని తెంచే ప్రయత్నం చేసింది ఎవరు అనే కదా మీ డౌట్..
తిలోత్తమ: తెలీదు..
హాసిని: క్లూ ఉందా అత్తయ్య.
తిలోత్తమ: లేదు..
హాసిని: నేనే.. అంటూ మళ్లీ కవర్ చేస్తుంది.
తిలోత్తమ: తాళి అంటే అంత చులకనా మీకు..
హాసిని: అత్తయ్య గంగాధర్ మామయ్య కట్టిన తాళి ఏది. నేను చెప్పనా దాన్ని మీరు ఎప్పుడో అమ్ముకొని తినేశారు. విశాల్‌ని కన్న తండ్రి అంటే మీ రెండో భర్త మిమల్ని పెళ్లి చేసుకున్నట్లు గుర్తుగా వేలికి తొడగకపోయినా కొనిచ్చిన డైమండ్ రింగ్ అదెక్కడుంది. తాకట్టు పెట్టి విడిపించుకోలేక వదిలించేసుకుందయ్యా మీ అమ్మ.
తిలోత్తమ: ఇవన్నీ నీకు ఎలా తెలుసే..
హాసిని: మీ డైరీ దొరికింది ఎక్కడ పడితే అక్కడ పడేసుకోకండి..
తిలోత్తమ: నేను రాసుకున్న డైరీ మొత్తం చదివేసుంటుందా..


విశాల్: గాయత్రీ పాపతో.. అమ్మా ఇప్పుడు ఈ బొమ్మలతో ఆడుకుంటున్నావ్.. తిలోత్తమ అమ్మ ఒంటరిగా కనిపిస్తే నీ పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తావ్. అప్పుడు నీకు ఆ శక్తియుక్తలను విశాలాక్షి అమ్మవారే ఇస్తుంది అనుకుంటా.. నువ్వు శత్రు శేషాన్ని ఉంచవని నాకు తెలుసు. తిలోత్తమ్మకు సహకరించేవారిని శాశ్వతంగా తొలగిద్దాం అనుకున్నాను కానీ అది కుదరలేదు.
నయని: బాబుగారు గాయత్రీకి పాఠాలు చెప్తున్నారా..
విశాల్: తనే మనకు చెప్తుంది.
నయని: ఈ కాలం పిల్లలే అంత మనల్ని మించిపోయారు. 
విశాల్: వల్లభ అన్నయ్యని షూట్ చేయాలన్నది మీకు తెలుసు. హాసిని, పావనా చాటుగా వింటారు. వల్లభ అన్నయ్యని షూట్ చేస్తారు అని మీకు ముందే తెలుసు కదా.
నయని: తెలుసు బాబుగారు.
విశాల్: మరి ఎందుకు చెప్పలేదు.
నయని: షూట్ చేసిని వాళ్లకి ముందే చెప్పాను బాబుగారు. దయచేసి ఇళ్లు దాటి వెళ్లొద్దని రిక్వెస్ట్ చేశాను. హాసిని అక్క.. హాసిని షాక్ అవుతుంది. పావనా కంగారుగా చూస్తాడు.
విశాల్: హా... మన .. నయని ఏమంటావ్.. హాసిని అక్క మా అన్నయ్యని షూట్ చేసిందా..
నయని: చావు విషయంలో అబద్ధం చెప్పరు కదా బాబుగారు. మీరు ఇంటి నుంచి వెళ్లగానే హాసిని అక్కకి ఇంటి పనులు చెప్పి బిజీగా ఉంచి ఈ గండం నుంచి కాపాడుదాం అనుకున్నాను. కానీ ఎప్పుడు వెళ్లిపోయిందో వెళ్లిపోయింది. 
విశాల్: మనసులో.. హాసిని వదిన ఇంత పని చేసిందా..
పావనా: వామ్మో ఏంటమ్మా నువ్వు నీ పసుపుకుంకుమలను నువ్వే తుడుచుకోవాలి అనుకుంటున్నావా.. ఎవరి ప్రాణాలు ఎవరు తీస్తున్నారో తెలీదు.
హాసిని: ఏడుస్తూ నా భర్త ప్రాణాలు పోతే పోయాయి. చెల్లి , విశాల్ బాగుండాలి.
పావనా:మరీ ఇంత త్యాగం చేసే వారు మిమల్నే చేస్తున్నాను..


మరోవైపు విశాలాక్షి ఇంటికి వస్తుంది. విశాలాక్షి నడుచుకుంటూ వస్తే పసుపు అడుగులు పడతాయి. ఇంతలో ఎద్దులయ్య విశాలాక్షి పాదాలకు పువ్వులు పెట్టి కోరిక కోరుకోండి నెరవేరుతుంది అని చెప్తాడు. ఎప్పటిలానే సుమన తన నెగిటివ్ మాటలతో నిర్లక్ష్యం చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: రామ్ చరణ్: బాలీవుడ్‌ దిగ్గజ డైరెక్టర్‌తో చరణ్‌ పాన్‌ ఇండియా మూవీ! - కథ ఏంటో తెలుసా?